E-Paper
Advertisement

Jakkanna son’s Tollywood entry: డబ్బింగ్ మూవీతో జక్కన్న కొడుకు టాలీవుడ్ ఎంట్రీ

Jakkanna son’s Tollywood entry: డబ్బింగ్ మూవీతో జక్కన్న కొడుకు టాలీవుడ్ ఎంట్రీ
Advertisement

Jakkanna son's Tollywood entry:

Jakkanna’s son’s Tollywood entry with a dubbing movie: ఈ మధ్య కాలంలో ఏ ఇండస్ట్రీని చూసుకున్నా సరే, చిన్న బడ్జెట్ తో రిలీజైన మూవీస్ అన్ని కలెక్షన్ల సునామిని క్రియేట్ చేస్తూ బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్నాయి. హంగు, ఆర్బాటం లేకుండా రిలీజై, కంటెంట్ ఉంటే చాలు బ్యాగ్రౌండ్ అక్కర్లేదని నిరూపిస్తున్నాయి. తాజాగా ఆ కోవలోకి దిగ్గజ దర్శకుడు జక్కన్న తనయుడు కార్తీకేయ ఓ మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయిపోయాడు. ప్రేమలు అనే మళయాళ మూవీ చాలా తక్కువ బడ్జెట్‌ అంటే రూ.3 కోట్లతో తెరకెక్కింది. ఈ మూవీని ఎంత వీలైతే అంత త్వరగా టాలీవుడ్ లోకి రిలీజ్ చేసేందుకు సన్నద్ధం అవుతున్నాడు.

Advertisement

Read More: కమల్ హాసన్ నా కాళ్ల మీద పడి ఏడ్చాడు, సీనియర్ నటి షాకింగ్ కామెంట్స్

కానీ ఇప్పటికే ఈ మూవీ రూ. 60 కోట్ల కలెక్షన్ల మార్కును దాటేసింది. భాగ్యనగరం బ్యాక్‌డ్రాప్‌ లో ఈ మూవీ రూపుదిద్దుకొంది. దీంతో ఈ మూవీ తెలుగులోకి ఎప్పుడూ రిలీజ్ అవుతుందా అని టాలీవుడ్ ఆడియెన్స్ వెయిట్ చేస్తున్నారు. అలా కోరుకునే వారందరికి ఓ గుడ్‌ న్యూస్‌..ప్రేమలు చిత్రంలో త్వరలోనే తెలుగులోకి డబ్బింగ్‌ కాబోతుంది. ఈ చిత్రం ఓటీటీ ప్లే రిపోర్ట్‌ ప్రకారం.. తెలుగు హక్కులను ఎస్‌ఎస్‌ కార్తీకేయ సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన డబ్బింగ్‌ వర్క్స్ స్టార్ట్ అయినట్లు తెలుస్తోంది.

Advertisement

Read More:పెళ్లి పీటలు ఎక్కబోతున్న సొట్ట బుగ్గల సుందరి తాప్సీ..

మరికొద్ది రోజుల్లోనే ఈ మూవీ డీటెయిల్స్ గురించి అధికారికంగా అనౌన్స్ మెంట్ రావడం ఖాయంగా కనిపిస్తోంది. వచ్చే నెల 8న ప్రేమలు మూవీని తెలుగులోకి రిలీజ్ చేసేందుకు కార్తీకేయ గట్టిగానే ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీకి గిరీశ్‌ ఏడీ డైరెక్టర్‌ గా వర్క్ చేస్తుండగా.. నెల్స్‌ కే గఫూర్‌, మమితా బజు హీరోహీరోయిన్లుగా యాక్ట్ చేస్తున్నారు.ఈ మూవీని నటుడు ఫాహద్‌ ఫాజిల్‌, దిలీశ్‌ పోతన్‌, శ్యామ్‌ పుష్కరన్‌లు సంయుక్తంగా నిర్మించారు. విష్ణు విజయ్‌ మ్యూజిక్ ని అందించారు. ఈ మూవీలో హీరో ఇంజినీరింగ్‌ చదివే టైంలో ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు.

Read More:రజనీకాంత్ పాన్ ఇండియా మూవీ ఫిక్స్.. నిర్మాత ఎవరంటే?

కానీ ఆ విషయం ఆమెతో చెప్పడు. చదువు పూర్తయిన తరువాత విదేశాలకు వెళ్లాలనుకుంటాడు కానీ.. వెళ్లలేడు. దాంతో సొంత ఊరు నుంచి హైదరాబాద్‌ కి కోచింగ్‌ కోసం వస్తాడు. అక్కడ హీరోయిన్‌ తో లవ్ లో పడతాడు. అయితే ఈ మ్యాటర్ గురించి ఆమెతో చెబుతాడా.. వారి ప్రేమ సక్సెస్‌ అయ్యిందా లేదా అనేదే ఈ మూవీ అసలు స్టోరీ. మరి మలయాళంలో హిట్ ని సొంతం చేసుకున్న ఈ మూవీ తెలుగులో సక్సెస్ సాధిస్తుందో లేదో తెలియాలంటే ఈ మూవీ రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయకతప్పదు.

Tags

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×