BigTV English
Advertisement

Kannappa First Look : హీరో మంచు విష్ణు కన్నప్ప ఫస్ట్‌ లుక్‌

Kannappa First Look : హీరో మంచు విష్ణు కన్నప్ప ఫస్ట్‌ లుక్‌

Hero Manchu Vishnu Bhakta Kannappa First Look Release


Hero Manchu Vishnu Bhakta Kannappa First Look Release(Tollywood news in telugu): టాలీవుడ్ హీరో మంచు మోహన్‌బాబు తనయుడు మంచు విష్ణు చాలా గ్యాప్ తరువాత ఓ మూవీ చేస్తున్నారు. విష్ణు ప్రధాన పాత్రలో యాక్ట్ చేస్తున్న ఫాంటసీ డ్రామా మూవీ కన్నప్ప. ఈ మూవీలో కంప్లీట్‌గా ఫాంటసీ లుక్‌లో కనిపించనున్నారు విష్ణు. ముకేష్ కుమార్‌సింగ్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా…ఈ మూవీ చిత్రీకరణ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ మూవీ నుంచి చిత్ర బృందం ఆడియెన్స్‌కి బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చింది. నేడు శుక్రవారం మహాశివుడికి అతి ఇష్టమైన రోజు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని కన్నప్ప ఫస్ట్‌లుక్‌ని రిలీజ్ చేశారు మూవీ యూనిట్.

ఈ మూవీ భారీ బడ్జెట్‌తో రూపొందుతుంది. అత్యున్నత టెక్నికల్ నాలెడ్జ్‌తో సీనియర్ నటుడు మోహన్‌బాబు ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇందులో మంచు విష్ణు భక్త కన్నప్పగా కనిపించనున్నారు. ఈ మూవీలో ప్రభాస్, నయనతారలు శివపార్వతులుగా కనిపించనున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇందులో నటులు మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, బ్రహ్మానందం, శరత్‌కుమార్ వంటి పలువురు ఈ మూవీలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.


Read More: కోట్లిచ్చిన ఆ హీరోతో నటించనని తేల్చేసిన తార

స్టీఫెన్ దేవస్సే, మణిశర్మ ఈ మూవీకి బాణీలు అందిస్తున్నారు. కన్నప్ప మూవీ అత్యధిక భాగాన్ని న్యూజిలాండ్‌లో చిత్రీకరించారు. తదుపరి భాగాన్ని కూడా న్యూజిలాండ్‌లోనే తీస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్‌ని తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ని విడుదల చేశారు. ఈ లుక్‌లో విష్ణు భక్త కన్నప్ప లుక్‌లో విల్లు ఎక్కుపెట్టినట్లుగా కనిపిస్తున్నారు.

 

Tags

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×