BigTV English

Nayantara: కోట్లిచ్చిన ఆ హీరోతో నటించనని తేల్చేసిన తార

Nayantara: కోట్లిచ్చిన ఆ హీరోతో నటించనని తేల్చేసిన తార

Nayantara who decided not to act with That Hero


Nayantara who decided not to act with That Hero(Entertainment news today) : దక్షిణ భారతదేశంలో అత్యంత కాస్ట్‌లీ హీరోయిన్ ఎవరైన ఉన్నారంటే..ఆ క్రెడిట్‌ మొత్తం ఆమెకే చెందుతుంది. ఇంతకీ ఆవిడ ఎవరు అనుకుంటున్నారా.. ఆవిడే అందాల తార నయనతార. తాజాగా ఓ హీరో గురించి ఆమె చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఆ హీరో పక్కన వంద కోట్లిచ్చిన నటించనని పెద్ద బాంబ్ పేల్చేసింది. ఇంతకీ ఎవరా హీరో తెలియాలంటే లెట్స్ వాచ్ దిస్ స్టోరీ.

అందాల తార నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎందుకంటే తన యాక్టింగ్‌తో టాలీవుడ్ నుంచి బాలీవుడ్‌ దాక రికార్డులను తిరగరాస్తూ.. తిరుగులేని తారగా ఓ మార్కును వేసుకుంది. తాజాగా..ఓ హీరోతో తాను యాక్ట్ చేయనని ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ప్రస్తుతం ఆమె తన సినిమాలకు తీసుకునే పారితోషకం రూ.12 కోట్ల పై మాటే.


Read More: విశ్వక్ సేన్ ‘గామి’ ఫుల్ రివ్యూ.. హిట్టా ఫట్టా

ఇక బాలీవుడ్ బాద్‌షా షారుక్‌ఖాన్ చిత్రంలో యాక్ట్ చేసింది ఈ భామ. ఇందులో షారుఖ్ పక్కన నటించినందుకు గానూ ఆమె తీసుకున్న పారితోషికం రూ. 12 నుంచి 15 కోట్ల మధ్యన ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే… అన్ని ఇండస్ట్రీల్లో హీరోయిన్లు అందరూ స్టార్ హీరోలతో యాక్ట్ చేసి తమ హోదాను, పలుకుబడిని దక్కించుకుంటారు. కానీ.. నయనతార అలా కాదు..ఒక హీరో పక్కన నటించడానికి మాత్రం ససేమిరా అందట. అంతేకాదు…తనకు రూ. 100 కోట్లు ఇచ్చినా సరే తన పక్కన నటించనని కుండబద్దలు కొట్టిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్తలు తమిళ ఇండస్ట్రీలో తెగ వైరల్ అవుతూ..ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి.

లెజెండ్ హీరో వ్యాపారవేత్త శరవణన్. 50 పదుల వయసులోనూ మొఖానికి రంగు వేసుకొని హీరోగా మారిపోయాడు. అనంతరం కథానాయకుడిగా ఎంట్రీ ఇచ్చి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఇటు ఇండస్ట్రీలోనూ.. అటు వ్యాపారంలోనూ కొనసాగుతున్నాడు.2022లో వచ్చిన ది లెజెండ్ మూవీతో శరవణన్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ మూవీ రిలీజ్ అయిన తరువాత ట్రోలింగ్‌లు చాలా దారుణంగా చేశారు చాలామంది. ఆయన మీద ఎన్నోరకాల మీమ్స్ కూడా రావడం మనం చూసుంటాం. కానీ అవన్నింటిని పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోతున్నాడు.

Read More:ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ టీవీ నటి మృతి

ఇక తన పక్కన నటించేందుకు నయనతారకు ఆఫర్ ఇచ్చాడట. కానీ తన పక్కన నటించేందుకు ఇంట్రెస్ట్ చూపలేదట. దీంతో ఏంటీ ఈవిడా అంటూ అందరూ షాక్ అయ్యారట. ఇలా ఎందుకు ఆవిడ చెప్పిందనేది మాత్రం అందరికి ప్రశ్నార్థకంగా మారింది. వీరిద్దరి మధ్య గతంలో ఏవైనా గొడవలు ఉన్నాయా అనే వార్తలు వినిపిస్తున్నాయి.

Tags

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×