Rishab Shetty: కన్నడ డైరెక్టర్ రిషబ్ శెట్టి(Rishab Shetty)గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ‘కిరిక్ పార్టీ’ అనే సినిమాకి దర్శకత్వం వహించారు. ఇదే సినిమాతో రష్మిక మందన్న (Rashmika Mandanna), రక్షిత్ శెట్టి(Rakshith Shetty)ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. అదే పరిచయంతో ఇద్దరూ ప్రేమలో పడ్డారు. నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల బ్రేకప్ చెప్పుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రష్మిక మందన్న తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి నేషనల్ క్రష్ గా మారిపోయింది. ఇక రిషబ్ శెట్టి విషయానికి వస్తే.. కన్నడలో వరుస సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈయన.. ప్రాంతీయ సాంప్రదాయాన్ని కాంతార పేరుతో తెరపైకి తీసుకొచ్చి, ఏకంగా పాన్ ఇండియా హీరోగా మారిపోయారు. ఈ సినిమాకు దర్శకత్వం వహించడమే కాదు ఇదే సినిమాలో హీరోగా కూడా చేసి తన అద్భుతమైన నటనతో అందరిని ఆకట్టుకున్నారు.
మరోవైపు కాంతార – చాప్టర్ 1 తో కూడా ప్రేక్షకుల ముందుకు రావడానికి సన్నహాలు సిద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా వచ్చే ఏడాది అక్టోబర్ 2న విడుదల కానుంది.
ఇలా ఒకవైపు దర్శకత్వం వహిస్తూనే మరొకవైపు బడా హీరోల సినిమాలలో అవకాశాలు దక్కించుకొని మరింత పాపులారిటీ సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు రిషబ్ శెట్టి. ఈ క్రమంలోనే ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వరస చిత్రాలు చూస్తే మాత్రం నిజంగా ఆశ్చర్యపోవాల్సిందే.
జై హనుమాన్:
ప్రశాంత్ వర్మ (Prashanth Varma)దర్శకత్వంలో యంగ్ హీరో తేజ సజ్జ(Teja Sajja) నటించిన చిత్రం హనుమాన్(Hanuman). చిన్న సినిమాగా వచ్చి రూ.100 కోట్ల క్లబ్ లో చేరి పాన్ ఇండియా సినిమాగా రికార్డు సృష్టించింది.. ఇదిలా ఉండగా ఈ సినిమాకి సీక్వెల్ గా ‘జై హనుమాన్’ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ప్రశాంత్ వర్మ యూనివర్స్ లో ఈ సినిమా రాబోతుండడంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. జై హనుమాన్ అంటూ రాబోతున్న ఈ చిత్రంలో రిషబ్ శెట్టి ఆంజనేయ స్వామి గెటప్ లో నటిస్తున్నట్లు అందుకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. యాక్షన్ పీరియాడిక్ మూవీగా రాబోతున్న ఈ చిత్రానికి సితార ఎంటర్టైన్మెంట్ వారు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
ఛత్రపతి శివాజీ మహారాజ్:
ఇక ఇప్పుడు ‘ఛత్రపతి శివాజీ మహారాజ్’ లో కూడా అవకాశం దక్కించుకున్నారు. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రిషబ్ శెట్టి నటించబోతున్నారు. ఈ సినిమా జనవరి 21 2027లో రిపబ్లిక్ డే వీక్ లో విడుదల కాబోతున్నట్టు సమాచారం. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా మల్టీ లాంగ్వేజస్ లో ఈ సినిమాని విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ‘ది ప్రైడ్ ఆఫ్ భారత్ : చత్రపతి శివాజీ మహారాజ్’ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ ను రివీల్ చేశారు. శివాజీ అవతార్లో రిషబ్ శెట్టి ఫస్ట్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇక ఈ సినిమాలన్నీ హిట్ అయితే కనుక ఈయన స్టార్ స్టేటస్ అందుకోవడం గ్యారంటీ అని చెప్పవచ్చు.