అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో రాబోతున్న చిత్రం పుష్ప 2. మరో రెండు రోజుల్లో మరో రెండు రోజుల్లో థియేటర్లలోకి రాబోతోంది. డిసెంబర్ 5న విడుదల కాబోతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ సినిమా హైకోర్టులో కేసు ఎదుర్కోవడం కాస్త ఆశ్చర్యపరిచే అంశమని చెప్పవచ్చు. ముఖ్యంగా తెలంగాణలో టికెట్ రేటు పెంచడమే ఇందుకు ప్రధాన కారణం అని చెప్పాలి. ఇకపోతే పుష్ప 2 కి సంబంధించి తెలంగాణ హైకోర్టులో విచారణ నిర్వహించగా.. అందులో హైకోర్టు లైన్ క్లియర్ చేసినట్లు సమాచారం.
విడుదలకు లైన్ క్లియర్.. కానీ..
అధిక మొత్తంలో టికెట్ చార్జీలు వసూలు చేయడాన్ని అడ్డుకోవాలని ప్రముఖ జర్నలిస్టు సతీష్ కమల్ హైకోర్టులో పిటిషన్ వేశారు. బెనిఫిట్ షో పేరుతో రూ.800 రూపాయలు అదనంగా వసూలు చేయడం అన్యాయమని, తన పిటీషన్ లో పేర్కొన్నారు. అయితే దీనిపై విచారణ జరిపిన హైకోర్టు చివరి నిమిషంలో సినిమా రిలీజ్ ను ఆపలేమని, తదుపరి విచారణను మరో రెండు వారాలకు వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తానికైతే పుష్ప -2 విడుదలకు లైన్ క్లియర్ అయింది. కానీ విచారణను మాత్రం హైకోర్టులో ఎదుర్కోవాల్సి ఉంటుంది పుష్ప టీమ్.
పుష్ప 2 సినిమా యూనిట్ పై హై కోర్ట్ సీరియస్..
అయితే విచారణ జరిపే సమయంలో చిత్ర బృందం పై హైకోర్టు సీరియస్ అయినట్లు సమాచారం. విచారణ సమయంలో జర్నలిస్ట్ తరపు న్యాయవాది శ్రీనివాస్ రెడ్డి (Srinivas Reddy)మాట్లాడుతూ.. బెనిఫిట్ షో ఎవరి బెనిఫిట్ కోసం అంటూ మండిపడ్డారు. ముఖ్యంగా బెనిఫిట్ షో ద్వారా వచ్చిన డబ్బులను ఎస్క్రో అకౌంట్ లో పెట్టాలని ఆయన తన వాదనను వినిపించారు. దీంతో మైత్రి మూవీ మేకర్స్ తరపు న్యాయవాది సిద్దార్థ్ (Siddharth)మాట్లాడుతూ..” రెండు వారాలు సమయం కావాలని కోరగా”.. మళ్లీ దీనిపై శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ..” రెండు వారాలు సమయం అంటే బెనిఫిట్ షో, సినిమా కూడా రిలీజ్ అయిపోతుంది” అంటూ తన వాదనను వినిపించారు. ఇక దీనిపై విచారణ జరిపిన తర్వాత జస్టిస్ విజయ్ సేన్ రెడీ బెంచ్ మాట్లాడుతూ..” సాయంత్రం ఆర్డర్ ఇస్తామని తెలిపిన ఆయన, అదే సమయంలో రూ.800 పెట్టి సామాన్యుడు ఎలా సినిమా చూస్తాడు.. ? ఓ కుటుంబం నుండి 10 మంది సినిమాకు వెళ్తే రూ.10 వేలు ఖర్చు పెట్టాలా? అంటూ కోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు బెనిఫిట్ షో అర్ధ రాత్రి 1 గంటలకు పెట్టడం ఏంటి ..? చిన్న పిల్లల ఆరోగ్యం దెబ్బ తింటుంది కదా” అంటూ కూడా మండిపడినట్లు తెలిసింది.