BigTV English

Chinna Movie Review : చిన్నా…మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ తో వచ్చిన సిద్ధార్థ..

Chinna Movie Review : చిన్నా…మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ తో వచ్చిన సిద్ధార్థ..
Chinna Movie Review

Chinna Movie Review : టాలీవుడ్ లో లవర్ బాయ్ గా ఒకప్పుడు మంచి గుర్తింపు తెచ్చుకున్న సిద్ధార్థ…ఒక డీ గ్లామరైజ్డ్ పాత్రలో చిన్నా అనే సరికొత్త మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ తమిళ్ డబ్బింగ్ మూవీ తో మాంచి హిట్ కోసం బాగా ట్రై చేస్తున్న సిద్ధార్థ సక్సెస్ అవుతాడా లేదో తెలియాలి. ఈ మూవీ ని సిద్ధార్థ స్వయంగా నిర్మించడం మరో విశేషం.మొత్తానికి ఈరోజు విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు ఇంప్రెస్ చేసిందో చూద్దాం పదండి…


స్టోరీ :


ఒక పురపాలక శాఖ ఉద్యోగి అయిన ఈశ్వర్ (సిద్ధార్థ్), అన్న మరణం తర్వాత తన వదిన (అంజలి నాయర్),అతని కూతురి (సహజ శ్రీ) బాధ్యతలను తీసుకుంటాడు. అన్న కూతుర్ని సొంత కూతురుగా పెంచుకొని ఈశ్వర్ అనుకోకుండా కొన్ని చిక్కుల్లో ఇరుక్కుంటాడు. చిట్టి స్నేహితురాలిపై అత్యాచారం చేశాడనే ఆరోపణ ఈశ్వర్ పై వస్తుంది. పిల్లలను ఎంతో ఇష్టపడే ఈశ్వర్ తనపై పడకూడని నింద పడడంతో కృంగిపోతాడు. ఈ క్రమంలో ఎవరో చిట్టి ను అపహరిస్తారు. కనిపించకుండా పోయిన చిట్టి కోసం ఈశ్వర్ వెతకడం మొదలుపెడతాడు.

ఈశ్వర్ పై ఎనిమిదేళ్ల అమ్మాయిని అత్యాచారం చేశాడు అన్న ఆరోపణలు ఏ పరిస్థితుల్లో వచ్చాయి? ఈశ్వర్ తనను తాను నిర్దోషిగా ఎలా నిరూపించుకున్నాడు? చిట్టి ఎలా కిడ్నాప్ అయింది? చిట్టిని కిడ్నాప్ చేసి వేధింపులకు గురి చేసిన వ్యక్తి ఎవరు? చిట్టి పై లైంగిక దాడి చేసిన వ్యక్తికి ఎటువంటి శిక్ష పడింది? అని అన్ని ప్రశ్నలకు చిన్నా మూవీ సమాధానం.

విశ్లేషణ:

ఎంతో సెన్సిటివ్ మేటర్ తో ముడిపడిన ఈ కథను అద్భుతంగా తెరకెక్కించారు. చాలా డిఫరెంట్ గా ఉండే కథ, మంచి బోల్డ్ కంటెంట్ తో సిద్ధార్థ అద్భుతంగా నటించాడు. ఇప్పటివరకు చాక్లెట్ బాయ్ గా అందరికీ కనిపించే సిద్ధార్థ ఎటువంటి మేకప్ లేకుండా చాలా నాచురల్ గా ఒక డీ గ్లామరైజ్డ్ పాత్రలో మెప్పించాడు. ఈ మూవీ లో అన్ని పాత్రలు ఎంతో సహజంగా హృదయానికి హత్తుకునే విధంగా ఉన్నాయి.

ప్రస్తుత సమాజంలో పిల్లలకు ఎక్కువగా సెల్ఫోన్ అలవాటు చేస్తే …మన గేర్ హాజరిలో అవి ఎటువంటి దుష్ప్రయోజనాలకు దారితీస్తాయి అనేదానికి ఈ చిత్రం నిలువెత్తు నిదర్శనం. స్టోరీ నచ్చడంతో నిర్మించడమే కాకుండా ..విడుదలైన అన్ని భాషలలో తన పాత్రకు సిద్ధార్థ స్వయంగా డబ్బింగ్ చెప్పడం జరిగింది. ఈ సినిమా చూస్తున్నంత సేపు ఒక ఎమోషనల్ రోల కోస్టర్ అనుభూతి కలుగుతుంది.

మూవీ డబ్బింగ్ విషయంలో కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు కాబట్టి ఇది సహజంగా తెలుగులో తీసిన సినిమా లాగా కనిపిస్తుంది తప్ప తమిళ్ డబ్బింగ్ అనిపించదు. ఎంతో సెన్సిటివ్ విషయాన్ని ,కాస్త కూడా అటు ఇటు కాకుండా డైరెక్టర్ ఎంతో జాగ్రత్తగా తీయడం జరిగింది. ఈ మూవీలో ప్రతి ఒక్కలు తమ వంతు పర్ఫామెన్స్ కు న్యాయం చేశారు. ఒక రకంగా చెప్పాలి అంటే సిద్ధార్థ ఈ చిత్రంలో వన్ మ్యాన్ షో చేశాడు.

అయితే మూవీ కాస్త లెంథగా .. డ్రాగ్ చేసినట్లుగా ఉంటుంది. ఈశ్వర్ కు అతని అన్న కూతురికి మధ్య ఉన్న అనుబంధాన్ని ఒక ఐదు ఆరు సీన్లలో చూపించిన సరిపోతుంది కానీ ఇది మరింత హత్తుకునే విధంగా ఉండాలి అనే ఉద్దేశంతో డైరెక్టర్ చాలా డ్రాగ్ చేశాడు. ఇక ఇంటర్వెల్ కి కాస్త టైముంది అనగా సినిమా అసలు సీన్ స్టార్ట్ అవుతుంది. ఎడిటింగ్ విషయంలో మరికొన్ని జాగ్రత్తలు తీసుకొని ఉంటే బాగుండేది. ఈశ్వర్ పని చేస్తున్న మున్సిపల్ శాఖలో పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది కూడా ఎంతో డీటెయిల్ గా చూపించడంతో ఒక ఆర్ట్ ఫిలిం చూసిన అనుభూతి కలుగుతుంది.

ప్లస్ పాయింట్స్ :

సిద్ధార్థ్ సహజమైన నటన ఈ చిత్రానికి ఒక పెద్ద ప్లస్ పాయింట్.

దర్శకుడు ఎంచుకున్న పాయింట్ సెన్సిటివ్ అయినదే కాదు ఎంతో విభిన్నమైనది కూడా.

నిర్మాణ విలువలను ఎంతో అద్భుతంగా పాటించారు.

నేటి తరానికి ఒక మంచి సందేశాత్మక చిత్రం.

మైనస్ పాయింట్స్:

క్యారెక్టర్స్ మధ్య బంధాలను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎక్కువ టైం తీసుకోవడంతో కాస్త సాగదీసినట్లుగా ఉంది.

ఎడిటింగ్ విషయంలో మరింత జాగ్రత్త తీసుకుంటే సీన్స్ ఇంకా క్లిక్ అయ్యేవి.

రేటింగ్ :

3/5

మూవీ : చిన్నా

నటీనటులు : సిద్ధార్థ్, నిమిషా సజయన్, అంజలి నాయర్, సహస్ర శ్రీ , సబియా 

నిర్మాత : సిద్ధార్థ్

దర్శకత్వం : ఎస్.యు.అరుణ్ కుమార్

సంగీతం : ధిబు నినాన్ థామస్

విడుదల తేదీ : అక్టోబర్ 6, 2023

ట్యాగ్ లైన్ :

ఒక మంచి ఎమోషనల్ ఆర్ట్ మూవీ చూడాలి అనుకునే వారికి ఈ చిత్రం కచ్చితంగా నచ్చుతుంది. ఎంతో సహజమైన నటనతో ,మనసుకు ఆకట్టుకునే కథనంతో సాగుతుంది ఈ చిన్నా మూవీ.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×