E-Paper
Advertisement

Srikanth : విడాకులపై హీరో శ్రీకాంత్ క్లారిటీ…

Srikanth : విడాకులపై హీరో శ్రీకాంత్ క్లారిటీ…
Advertisement

Srikanth : విడాకులు ప్రచారంపై హీరో శ్రీకాంత్ తీవ్రంగా స్పందించారు. కొన్ని వెబ్ సైట్స్, యూట్యూబ్ ఛానల్స్ లో విడాకుల వార్తలు రావడంపై మండిపడ్డారు. ఆ వార్తలన్నీ పుకార్లే అని కొట్టి పారేశారు. ఎవరు పుట్టిస్తున్నారు ఇలాంటి పనికిమాలిన వార్తలను అని శ్రీకాంత్ ప్రశ్నించారు. గతంలో తాను చనిపోయినట్లుగా పుకారు పుట్టించారని గుర్తు చేశారు. ఆ సమయంలో తన కుటుంబ సభ్యులను తీవ్ర ఆందోళనకు గురి చేశారని చెప్పారు. ఇప్పుడు తాము ఆర్థిక ఇబ్బందుల కారణంగా విడాకులు తీసుకుంటున్నామని పుకార్లు పుట్టించారని మండిపడ్డారు.

కొన్ని వెబ్ సైట్స్ లో వచ్చిన ఈ ఫేక్ న్యూస్ ను తన ఫ్రెండ్స్ ఊహకు ఫార్వర్డ్ చేశారని శ్రీకాంత్ తెలిపారు. ఆమె ఆ పోస్టులను తనకు చూపించిందని శ్రీకాంత్ వివరించారు. ఇలాంటి వార్తలను ఏమాత్రం నమ్మవద్దని అభిమానులకు సూచించారు. విడాకుల వార్త సోషల్ మీడియాలో చూసి బంధుమిత్రులందరూ ఫోన్ చేసి అడుగుతుంటే వివరణ ఇచ్చుకోవడం పెద్ద ఇబ్బందిగా మారిందన్నారు. ప్రస్తుతం తాను, ఊహ దైవ దర్శనానికి అరుణాచలం వెళ్తున్నామని తెలిపారు. ఇలాంటి తరుణంలో ఈ పుకారు తమ కుటుంబానికి చాలా చిరాకు తెప్పించిందని మండిపడ్డారు. చాలామంది ప్రముఖుల మీద ఇలాంటి పుకార్లు స్ప్రెడ్ చేస్తున్న వెబ్ సైట్స్, యూట్యూబ్ ఛానల్స్ పై సైబర్ క్రైమ్ డిపార్ట్ మెంట్ కఠిన చర్యలు తీసుకోవాలని శ్రీకాంత్ కోరారు.

Advertisement

విడాకుల వ్యవహారంపై శ్రీకాంత్ , ఊహతో వీడియో కాల్ లో మాట్లాడినట్లు నిర్మాత బండ్ల గణేష్ ట్వీట్ చేశారు.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×