BigTV English

Jackfruit : ఈ పండు మాంసాహారానికి అసలైన ప్రత్యామ్నాయం

Jackfruit : ఈ పండు మాంసాహారానికి అసలైన ప్రత్యామ్నాయం

Jackfruit : పనస పండు.. ప్రపంచ దేశాల్లోకెల్లా మన భారతదేశంలోని ఈ పంటను అధికంగా పండిస్తుంటారు. తీయని రుచితో పాటు మంచి సువాసన కూడా కలిగి ఉంటాయి. ఈ పనసపండు మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలుగజేస్తుంది. తరచూ ఈ పండు తినడం వల్ల ఎన్నో అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. మాంసాహారం తినని వారు ఈ పనస పండును తినడం వల్ల మాంసాహారంలో ఉండే ఎన్నో పోషకాలు ఇందులో కూడా ఉంటాయి. పనస పండ్లలో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీర నిర్మాణానికి, కండరాల పనితీరుకి బాగా ఉపయోగపడతాయి. ఈ పనస పండ్లను రెగ్యులర్‌గా తినడం వల్ల మన శరీరానికి శక్తి బాగా లభిస్తుంది. విటమిన్ ఏ, సి, మెగ్నీషియం, ఫైబర్, కాపర్, పొటాషియం, మాంగనీస్ లాంటి ఎన్నో పోషకాలు ఈ పనస పండ్లలో ఉన్నాయి. ఇవి రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతాయి. ఇన్ఫెక్షన్లను సమర్ధవంతంగా అడ్డుకుంటాయి. పనస పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి మన శరీరంలోని వాపులను తగ్గిస్తాయి. అంతేకాకుండా గుండె జబ్బులు, క్యాన్సర్ రాకుండా చూసుకుంటాయి. ఈ పనస పండ్లలో ఉండే కెరోటినాయిడ్లు టైప్-2 మధుమేహాన్ని, అలాగే గుండె జబ్బులు వచ్చే అవకాశాలను కూడా తగ్గిస్తాయి. ఈ పండ్లు తక్కువ గ్లేసిమిక్ ఇండెక్స్ కలిగి ఉంటాయి. అంతేకాకుండా వీటిలో ఫైబర్ కూడా సమృద్ధిగా లభిస్తుంది. అందువల్ల వీటిని తిన్న వెంటనే రక్తంలో షుగర్ లెవెల్స్ పెరగవు కాబట్టి షుగర్ ఉన్నవారు ఎలాంటి సందేహం లేకుండా ఈ పండ్లను తీసుకోవచ్చు. హైబీపీ ఉన్నవారికి కూడా ఈ పనస పండ్లు ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ఉండే పొటాషియంతో హైబీపీ తగ్గుతుంది. అలాగే శరీరంలో రక్తనాళాల గోడలపై అధికంగా పడే ఒత్తిడి కూడా తగ్గుతుంది. దీంతో రక్తం సరఫరా మెరుగుపడుతుంది. శరీరంలో ఎక్కువగా చేరే సోడియం వల్ల కలిగే దుష్పరిణామాలు తగ్గుతాయి. అధిక బరువు ఉన్నవారు ఈ పనస పండ్లను తినడం వల్ల క్యాలరీలు, కొవ్వు తగ్గుతాయి అని నిపుణులు చెబుతున్నారు.


Tags

Related News

Migraine: మైగ్రేన్ తగ్గాలంటే.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి చాలు !

Saggubiyyam Payasam: సగ్గుబియ్యం పాయసం.. ఇలా చేస్తే సూపర్ టేస్ట్ !

Cheese Pasta: అద్భుతమైన రుచితో ‘చీజ్ పాస్తా’, ఇలా తయారు చేస్తే.. లొట్టలేసుకుంటూ తింటారు !

Brain Boosting Foods: ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని పెంచే ఫుడ్స్ ఏవో తెలుసా ?

Soaked Raisins: డైలీ ఉదయం నానబెట్టిన ఎండుద్రాక్ష తింటే.. ఇన్ని లాభాలా ?

Natural Honey: స్వచ్ఛమైన తేనె vs కల్తీ తేనె – ఇంట్లోనే తేడా తెలుసుకోండి!

Face Scrub: ఈ ఫేస్ స్క్రబ్స్ వాడితే.. ముఖం మెరిసిపోతుంది తెలుసా ?

Sleep Fast Tips: నిద్ర పట్టడం లేదా ? ఇలా చేస్తే.. ప్రాబ్లమ్ సాల్వ్

Big Stories

×