
Devara movie update : ఎన్టీఆర్ మోస్ట్ అవైటెడ్ మూవీ దేవర. రాజమౌళి దర్శకత్వంలో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ ప్రతిభను దేశ విదేశాలకు చాటిచెప్పిన ఆర్ఆర్ఆర్ సక్సెస్ తర్వాత తారక్ కు వరల్డ్ వైడ్ ఫేమ్ వచ్చింది. దీంతో ప్రస్తుతం రాబోయే తారక్ చిత్రం పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఈమధ్య సెట్స్ నుంచి లీకైన ఆమె ఫొటోస్ సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేశాయి.
షూటింగ్ శరవేగం తో సాగుతున్న ఈ మూవీ సెట్స్ లో ఒక చిన్న కి ఏక్సిడెంట్ చోటు చేసుకుంది. తాజాగా జరిగిన మూవీ షూటింగ్ షెడ్యూల్ లో సీనియర్ నటుడు శ్రీకాంత్ కూడా పాల్గొన్నారు. ఒకప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ ఫేవరెట్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీకాంత్.. ప్రస్తుతం సపోర్టింగ్ రోల్స్ లో సత్తా చాటుతున్నాడు. హీరోగా ఎన్నో మూవీస్ లో తన ప్రతిభ కనబరిచి వెండితెర పై దూసుకుపోయిన ఈ హీరో ప్రస్తుతం విలన్ పాత్ర లో కూడా బాగా మెప్పిస్తున్నాడు. అల్లు అర్జున్ సరైనోడు ,బాలకృష్ణ అఖండ ,విజయ్ వారసుడు, రామ్ పోతినేని స్కంద.. ఇలాంటి చిత్రాలలో వైవిధ్యమైన పాత్రలు చేసి మెప్పించాడు.
ప్రస్తుతము శ్రీకాంత్ జూనియర్ ఎన్టీఆర్ తో దేవర మూవీలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. మరోపక్క ఈ కాస్త గ్యాప్ లో ‘కోటబొమ్మాళి పీఎస్’మూవీలో కూడా చేశాడు. ఇక రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ చిత్రంలో కూడా శ్రీకాంత్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ప్రస్తుతం శ్రీకాంత్ నటించిన కోటబొమ్మాలి ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి. ఈ మూవీ నవంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఈ ప్రచార కార్యక్రమాల్లో భాగంగా తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 ఎపిసోడ్ కి శ్రీకాంత్ హాజరయ్యాడు.
షో కి కాలికి పెద్ద బ్లాక్ పట్టి కట్టుకొని శ్రీకాంత్ రావడంతో నాగార్జున ఏమైంది అని అడిగారు. దాంతో శ్రీకాంత్ దేవర షూటింగ్ సెట్స్ లో గాయం తగిలినట్టు చెప్పారు. రీసెంట్గా గోవాలో దేవర కు సంబంధించిన కొన్ని సముద్రం బ్యాక్ డ్రాప్ తో సాగే సన్నివేశాలు షూటింగ్ జరిగింది. ఈ షూటింగ్ సమయంలో సెట్ లోని కంకర పై పరిగెడుతున్న టైం లో శ్రీకాంత్ కు గాయమైందట. అయితే అంత గాయం అయినప్పటికీ రెస్ట్ తీసుకోకుండా ఒకపక్క షూటింగ్లో పాల్గొంటూ మరోపక్క ప్రమోషన్స్ కి హాజరవుతున్న శ్రీకాంత్ ను చూసి అతని వర్క్ డెడికేషన్ కు నెటిజన్లు అభినందిస్తున్నారు.