
Rules Ranjan : కిరణ్ అబ్బవరం, డీజే టిల్లు బ్యూటీ నేహశెట్టి కాంబోలో వచ్చిన మూవీ రూల్స్ రంజన్ . రిలీజ్ కి ముందు ఈ మూవీ నుంచి వచ్చిన “సమ్మోహనుడా” పాట ప్రేక్షకులని ఓ రేంజ్ లో అలరించింది. దీంతో మూవీ పై బాగానే హైప్ క్రియేట్ అయింది.. కానీ అక్టోబర్ 6న విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అనుకున్న రీతిలో ప్రేక్షకులను ఆకట్టుకో లేకపోయింది. దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ పెద్ద డిజాస్టర్ గా మిగిలింది.
హిట్స్.. ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వెరైటీ కంటెంట్ మూవీస్ చేస్తూ మంచి ప్రేక్షక ఆధారణ పొందిన నటుడు కిరణ్ అబ్బవరం. అతను రీసెంట్గా నటించిన మూవీ రూల్స్ రంజన్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు రెడీగా ఉంది. ఒక పాటతో ఈ మూవీ సోషల్ మీడియాని ఓ ఊపు ఊపింది కానీ థియేటర్లో మాత్రం అనుకున్న రేంజ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయింది. మామూలుగా ఓ మోస్తరుగా ఆడిన మూవీ 45 రోజులకి ఓటీటీలో వచ్చేస్తున్న టైం లో ..డిజాస్టర్ గా మిగిలిన ఈ చిత్రం మాత్రం రావడానికి రెండు నెలలు ఎందుకు పట్టిందో తెలుసా?
ఈ మూవీ థియేట్రికల్ రన్ పెద్దగా లేకపోవడంతో.. ఓటీటీలో విడుదల చేయడం వాయిదా పడ్డట్టు తెలుస్తుంది. ఈ మధ్య కాలంలో థియేటర్లలో ఫెయిలైన మూవీస్ ఓటీటీల్లో మంచి స్పందన అందుకుంటున్నాయి. మరి ఈ మూవీ కూడా ఓటీటీ లో మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంటుందేమో చూడాలి. ఇంతకీ మూవీ ఎక్కడ ?ఎప్పటినుంచి ?స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?
అమెజాన్ ప్రైమ్ వీడియోలో..
అమెజాన్ ప్రైమ్ వీడియోలో డిసెంబర్ 1 నుంచి స్ట్రీమింగ్‌కు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీ తర్వాత కిరణ్ అబ్బవరం మరో మూడు క్రేజీ ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్నాడు. నేను మీకు బాగా కావల్సిన వాడిని, మీటర్, రూల్స్‌రంజన్.. ఇలా వరుసగా డిజాస్టర్లు చవిచూసిన కిరణ్.. ఈసారైనా సక్సెస్ అందుకుంటాడేమో చూడాలి.
Sukesh: కేటీఆర్ బెదిరిస్తున్నారు.. కేసు వేస్తా.. సుఖేశ్ మళ్లీ కలకలం..