BigTV English

Hero Suman: కల్కి మూవీపై హీరో సుమన్ షాకింగ్‌ కామెంట్స్‌, అందులో ఏముందంటూ..

Hero Suman: కల్కి మూవీపై హీరో సుమన్ షాకింగ్‌ కామెంట్స్‌, అందులో ఏముందంటూ..
Advertisement

Hero Suman  Comments on Kalki 2898 AD Movie(celebrity news today) : సీనియర్ హీరో, నటుడు సుమన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎందుకంటే తన యాక్టింగ్‌తో టాలీవుడ్‌ ఆడియెన్స్‌ని ఎంతగానో ఆకట్టుకున్నాడు.అంతేకాదు తన యాక్టింగ్‌తో తనకంటూ ఓ మార్క్‌ని సంపాదించుకున్నాడు. అంతేకాదు తన అందమైన ముఖంతో దృఢమైన శరీర ఆకృతితో హీరో అంటే ఇలా ఉండాలనేటట్టుగా తన అధ్భుతమైన యాక్టింగ్‌తో ఆడియెన్స్‌ని అలరించాడు. అయితే తాజాగా రిలీజ్ అయిన పాన్‌ ఇండియా మూవీ కల్కి 2898 ఏడీ. ఈ మూవీ రిలీజై వరల్డ్‌వైడ్‌గా రికార్డుల మోత మోగిస్తూ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అంతేకాదు రూ.1000 కోట్ల క్లబ్‌లోకి చేరి బాక్సాఫీస్‌ని షేక్ చేస్తోంది. అంతేకాకుండా పాన్‌ ఇండియా లెవల్‌గా ఆడియెన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. అయితే ఈ మూవీ గురించి తాజాగా సీనియర్ యాక్టర్ సుమన్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు.అంతేకాదు ఈ మూవీలో అసలు ఏముందని షాక్ ఇచ్చాడు.


ఓ యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తాజాగా కల్కి మూవీ గురించి ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. హీరో సుమన్‌తో యాంకర్ కల్కిలో మిమ్మల్ని మిస్ అయ్యామంటూ అడగగా.. మిస్ అవడానికి అసలు ఏముంది అందులో అంటూ రియాక్ట్ అయ్యాడు సుమన్. దీంతో ఆ యాంకర్ ఒక్కసారిగా షాక్ అయింది. సుమన్ రిప్లై ఇస్తూ.. అసలు ఏముంది ఆ మూవీలో అందులో నాకు సరైన క్యారెక్టర్ అయితే లేదంటూ రిప్లై ఇచ్చాడు. అదేంటి కల్కి మూవీలో చాలామంది స్టార్స్‌ ఉన్నారు కదా అని యాంకర్ అడగగా.. ఈ మూవీకి అదే పెద్ద తప్పు అంటూ రిప్లై ఇచ్చాడు. టాలెంటెడ్ రోల్స్ ఉన్న నటీనటులను కేవలం చిన్న రోల్స్‌కి పరిమితం చేయడం వల్ల వాళ్ల ఫ్యాన్స్ చాలా డిసప్పాయింట్‌లో ఉన్నారని చెప్పుకొచ్చారు.

Also Read: రామోజీ ఫిలింసిటీలో వార్ సెట్‌, ఇక రచ్చ రచ్చే..


నాకు మామూలుగా మాస్‌ మూవీస్ అంటే చాలా ఇష్టం. కానీ..కల్కిలో ఫస్టాఫ్ డ్రాగీగా అనిపించిందని.. ఒక అరగంట సీన్లు కన్ఫర్మ్ గా తీసేయొచ్చని చెప్పుకొచ్చారు. కానీ ముఖ్యంగా బాంబే హీరోయిన్ సాంగ్ ఓ ఫైట్ సీన్ రిమూవ్ చేయొచ్చు. ఇక సెకండాఫ్ మ్యాటర్‌కి వస్తే ఇందులో నటీనటుల క్యారెక్టర్స్ ఫ్యూచరిస్ట్‌గా బాగానే ఉంది. కానీ ఇందులో బచ్చన్ రోల్ చాలా డామినేటెడ్‌గా ఉందని, అశ్విన్ ఈ మూవీని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాడని తెలిపారు. అంతేకాకుండా ఇందులో క్యారెక్టర్స్ అన్నీ ఒకదానికంటే ఒకటి చాలా డామినేటెడ్‌గా ఉన్నాయన్నాడు. దీంతో ఈ మూవీలో క్యారెక్టర్ చేయలేదని చెప్పుకొచ్చాడు.

సినిమాలోని ముఖ్యమైన ఘట్టంలో ప్రభాస్ రోల్‌ డామినేటెడ్‌గా ఉందని చెప్పుకొచ్చాడు. ఇక ఈ మూవీలో సిక్స్‌ ప్యాక్ బాడీ ప్రభాస్‌కి ఉంది. అతన్ని టార్జన్‌లా చూపించాలి. కానీ అతడి బాడీని కంప్లీట్‌గా కవర్ చేస్తూ చూపించారని చెప్పుకొచ్చాడు సుమన్. దీంతో సుమన్ కామెంట్స్‌ని సైతం నెటిజన్లు అంగీకరిస్తున్నారు. అసలు ఇందులో ఇంతమంది నటీనటులు ఉన్నట్టే కానీ.. ఇందులో యాక్ట్ చేసిన నటీనటులకు గెస్ట్‌ రోల్స్ ఇచ్చినట్టుగా ఉందని చాలామంది అనుకుంటున్నారు. అంతేకాదు సుమన్ గారు ఈ మూవీ గురించి వాస్తవాలు మాట్లాడారని అతనికి మద్ధతు తెలుపుతున్నారు నెటిజన్లు.

Tags

Related News

Influencer Bhavani Ram : కన్నీళ్లు తెప్పిస్తున్న ఇన్‌ఫ్లుయెన్సర్ భవాని స్టోరీ… అప్పుడు ట్రోల్ చేశారు.. ఇప్పుడు సంపాదన ఎంతంటే?

Lazawal Ishq Show: పాక్‌‌లో డేటింగ్ రియాల్టీ షో.. వెంటనే ఆపాలంటూ గోలగోల, ఎందుకంటే?

Venu Swamy: శత్రువుల నాశనం కోసం వేణు స్వామి పూజలు…నీటిపై తేలియాడుతూ అలా!

Bigg Boss 9 Wildcard Entry: 6 గురు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్… యాడ దొరికిన సంతరా ఇది.. అంతా స్క్రాపే

PVRInox : తింటూ సినిమా చూసే ఎక్స్పీరియన్స్, ఏంట్రా బాబు ఆ సౌండ్స్ ను ఎలా భరించాలి

Durga Rao: టిక్ టాక్ దుర్గారావు ఇంట్లో విషాదం.. సమాధి దగ్గరే.. కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం!

Rakesh Poojary: ‘కాంతారా-1’లో కడుపుబ్బా నవ్వించిన.. ఈ నటుడు ఎలా చనిపోయాడో తెలుసా? కన్నీళ్లు ఆగవు!

Janu lyri- Deelip Devagan: జాను లిరితో బ్రేకప్.. దిలీప్ రియాక్షన్ ఇదే.. సెలబ్రిటీలం కాబట్టే అంటూ!

Big Stories

×