Crime News: నిజామాబాద్‌లో CCS కానిస్టేబుల్ దారుణ హత్యకు గురయ్యాడు. కానిస్టేబుల్ ప్రమోద్‌కు పై అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు ఒక ఛైన్ స్నాచింగ్ అయిన రియాజ్ అనే వ్యక్తిని తీసుకొని రావడానికి వెళ్లాడు. ఎంక్వైరీ చేసి బైక్ పైన పీఎస్‌కు తీసుకొని వెళ్తున్నాడు. ఈ క్రమంలో రియాజ్ వెనక నుండి కత్తితో ప్రమోద్ చాతిలో పొడిచాడు. దీంతో తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్‌ను స్థానికులు హాస్పిటల్‌కి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రమోద్ మృతి చెందాడు. సమాచారం అందుకున్న బాధితుడి కుటుంబ సభ్యులు, పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.