BigTV English

Fire Accident: గరీబ్‌రథ్ రైలులో భారీ అగ్ని ప్రమాదం.. తగలబడిపోయిన రైలు..

Fire Accident: గరీబ్‌రథ్ రైలులో భారీ అగ్ని ప్రమాదం.. తగలబడిపోయిన రైలు..
Advertisement

Fire Accident: పంజాబ్‌లోని సిర్హింద్ రైల్వే స్టేషన్ సమీపంలో జరిగిన గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ రైలులో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన ఉదయం 7:30 గంటల సమయంలో జరిగింది. ట్రైన్ నంబర్ 12204 అమృత్‌సర్ నుంచి సహరసా వరకు ప్రయాణిస్తున్న గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్, లుధియానా నుంచి ఢిల్లీ దిశగా పయనిస్తుండగా సిర్హింద్ జంక్షన్ (SIR) సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.


ఈ రైలు వారానికి మూడు రోజులు నడుస్తుంది.. అలాగే 1,716 కిలోమీటర్ల దూరాన్ని 31 గంటల 20 నిమిషాల్లో పూర్తి చేస్తుంది. ఇది 23 రైల్వే స్టేషన్‌లలో ఆగుతుంది, వీటిలో బీఆస్, జలంధర్ సిటీ, ఫాగ్వారా, ధండారీ కలాన్, అంబాలా క్యాంట్, ఢిల్లీ, హపూర్, మోరడాబాద్, బరెల్లీ, హర్దోయి, లక్నో NR, గోరఖ్‌పూర్, దేవరియా సదర్, సీవాన్, చప్రా, హజీపూర్, ముజఫ్ఫర్‌పూర్, సమస్తీపూర్, దల్‌సింగ్ సరాయ్, బరౌనీ, బేగుసరాయ్, ఖాగరియా, ఎస్ బఖ్తియార్‌పూర్ వంటివి ఉన్నాయి.

రైలు సిర్హింద్ స్టేషన్‌ను దాటుతుండగా, కోచ్ నంబర్ 19లో షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ మంటలు చెలరేగాయి. ధూమం గుర్తించిన వెంటనే ప్రయాణికులు అప్రమత్తులై, ఐఎం పుల్ చైన్ లాగి రైలును ఆపేశారు. దీంతో రైలు అంబాలా సమీపంలో 0.5 కిలోమీటర్ దూరంలో ఆగిపోయింది. మంటలు త్వరగా వ్యాపించి, ముగ్గా కోచ్‌లు దెబ్బతిన్నాయి. లుధియానా నుంచి వచ్చిన కొంతమంది వ్యాపారులు ఈ కోచ్‌లో ప్రయాణిస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ సోషల్ మీడియాలో అవుతంది.


అయితే ప్రయాణికులు తమ సామానులు వదిలేసి కిందకు దిగిపోయారు, దీంతో పెను ప్రమాదం తప్పింది. ఒక మహిళా ప్రయాణికురాలికి తీవ్ర గాయాలు పాలయ్యాయి, మిగిలినవారికి తేలికపాటి గాయాలు మాత్రమే అయ్యాయి. మొత్తం ప్రయాణికుల సంఖ్య గురించి ఖచ్చితమైన సమాచారం లభించలేదు, కానీ అందరూ సురక్షితంగా ఇతర కోచ్‌లకు మార్చబడ్డారు.

Also Read: బాలయ్యకు బంపర్ ఆఫర్.. మంత్రి పదవి పక్కా..?

రైల్వే సిబ్బంది, స్థానిక పొలీసులు, ఫైర్ టెండర్‌లు తక్షణమే స్పందించాయి. ఫైర్ బ్రిగేడ్ బృందాలు మంటలను త్వరగా అదుపులోకి తెచ్చారు. గవర్నమెంట్ రైల్వే పోలీసు షో రతన్ లాల్ ప్రకారం, “ప్రయాణికులు సమయానికి ఎవాక్యుయేట్ చేయబడ్డారు కాబట్టి ఎలాంటి మరణాలు లేవు. రైల్వే పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.

Related News

Indian Railways: రైలు నుంచి పడి చనిపోయిన భర్త.. పరిహారం ఇవ్వని రైల్వే, సుప్రీం కోర్టు ఊహించని తీర్పు!

Fire Accident: ఎయిర్ పోర్టులో మంటలు, విమానాల రాకపోకలు బంద్!

Fire in Flight: గాల్లో ఉండగా విమానంలో మంటలు, భయంతో వణికిపోయిన ప్రయాణీకులు!

Diwali 2025: దీపావళిని ఏయే రాష్ట్రాల్లో ఏమని పిలుస్తారో తెలుసా? ఒక్కోచోట ఒక్కో సాంప్రదాయం!

Diwali Train Tickets: IRCTC సైట్ పని చేయట్లేదా? నో టెన్షన్.. ఇక్కడ కూడా ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు!

Prank In Train: రైల్లో సీటు కోసం అన్నాదమ్ముల కంత్రీ ఐడియా.. చివరికి కటకటాల్లోకి..

Trains Timing Change: ప్రయాణీకులకు అలర్ట్, 38 రైళ్ల టైమింగ్స్ మారాయి!

Big Stories

×