E-Paper
Advertisement

Visakha Road Accident: విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం.. కొబ్బరి బొండాలమ్మే మహిళపైకి దూసుకెళ్లిన లారీ

Visakha Road Accident: విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం.. కొబ్బరి బొండాలమ్మే మహిళపైకి దూసుకెళ్లిన లారీ
Advertisement

Visakha Road Accident: విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గాజువాక సమతానగర్ సమీపంలో భారీ లారీ అదుపు తప్పింది. నిద్ర మత్తులో ఉన్న డ్రైవర్ అదుపు కోల్పోవడంతో రోడ్డు పక్కన కొబ్బరి బొండాలు అమ్మే మహిళ(55)పైకి లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. కొబ్బరి బొండాలు అమ్మి కుటుంబాన్ని పోషిస్తుంది ఆ మహిళ. ఆమె మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి

విశాఖ నగరంలోని ఆరిలోవ బీఆర్టీఎస్ రోడ్డులో గురువారం జరిగిన ప్రమాదంలో ఓ విద్యార్థి మృతి చెందాడు. విశాఖలోని ఓ కాలేజీలో చదువుతున్న విజయనగరం జిల్లాకు చెందిన వినయ్ అనే యువకుడు మృత్యువాత పడ్డాడు. స్నేహితులతో కలిసి టూర్ కి వెళ్లి తిరిగి వస్తుండగా, అతని స్నేహితుడు ఉదయ్ నడుపుతున్న బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వినయ్‌ను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వినయ్ శుక్రవారం మరణించాడు. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న ఉదయ్‌కు కూడా గాయాలయ్యాయి.

Advertisement

Also Read: Telangana Crime: నిజామాబాద్‌లో దారుణం.. కానిస్టేబుల్‌ను పొడిచి పొడిచి చంపిన దొంగ..!

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×