Mechanic Rocky.. ప్రముఖ యంగ్ హీరో విశ్వక్ సేన్ (Viswak Sen) ఈ మధ్యకాలంలో వరుస హిట్లతో దూసుకుపోతున్నారు. త్వరలో మాస్,యాక్షన్, కామెడీ ఎంటర్టైనర్ ‘మెకానిక్ రాకీ'(Mechanic Rocky)తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. కొత్త దర్శకుడు రవితేజ ముళ్ళపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహించడమే కాకుండా తొలిసారి ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. రామ్ తాళ్లూరి తన బ్యానర్ ఎస్ఆర్టి ఎంటర్టైన్మెంట్స్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. విశ్వక్ సేన్ (Viswak sen), శ్రద్ధ శ్రీనాథ్ (Shraddha Srinath), మీనాక్షి చౌదరి (Meenakshi Choudhary)మధ్య ట్రయాంగిల్ లవ్ స్టోరీ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ‘మెకానిక్ రాకీ’ ట్రైలర్ 1.0 రిలీజ్ అయ్యి, అద్భుతమైన స్పందన సొంతం చేసుకుంది.
శ్రీవారిని దర్శించుకున్న విశ్వక్ సేన్..
ఇక షూటింగ్ కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబర్ 22వ తేదీన విడుదల కాబోతోంది. ఇకపోతే మరి కొద్ది రోజుల్లో సినిమా విడుదల కానున్నప్పటికీ ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో చిత్ర బృందం కాస్త వెనుకబడింది. ఈ నేపథ్యంలోనే మెకానిక్ రాకీ కోసం సూపర్ వీక్ ప్రమోషన్స్ ప్లాన్ చేశారు హీరో విశ్వక్ సేన్. అందులో భాగంగానే మొదట తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారిని దర్శించుకున్న ఈయన ఇక అక్కడి నుంచి ఒక వీడియోని విడుదల చేస్తూ సినిమా ట్రైలర్ అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్ పై క్లారిటీ ఇచ్చారు.
ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ లాక్..
ఇక తాజాగా ఒక వీడియో విడుదల చేసిన విశ్వక్ సేన్ మాట్లాడుతూ..”నవంబర్ 17వ తేదీన మా మెకానిక్ రాకీ సినిమా ట్రైలర్ 2.0 రిలీజ్ అవ్వడమే కాకుండా మేము వరంగల్ వచ్చి ప్రీ రిలీజ్ ఈవెంట్ ను సాయంత్రం 5:00 గంటల నుంచి ప్రారంభిస్తాము. ఇక వరంగల్లో నాతో పాటు మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్, మా డైరెక్టర్ రవి, ప్రొడ్యూసర్ అందరం రావడం జరుగుతుంది. కాబట్టి అందరూ వచ్చి మా సినిమాని ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను. గోవిందా” అంటూ ఒక వీడియో రిలీజ్ చేశారు. ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక దీనికి తోడు విశ్వక్ సేన్ స్వయంగా ప్రమోషన్స్ మొదలుపెట్టడంతో అంచనాలు మరింత పెరిగిపోయాయి.
విశ్వక్ కెరియర్..
విశ్వక్ సేన్ విషయానికి వస్తే.. హీరోగా , డైరెక్టర్ గా తనను తాను ప్రూవ్ చేసుకున్నారు. స్క్రీన్ ప్లే, రచయితగా కూడా పేరు తెచ్చుకున్న ఈయన అసలు పేరు దినేష్ నాయుడు. హైదరాబాదులో పుట్టి పెరిగారు. 2017లో ‘వెళ్లిపోమాకే’ అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన విశ్వక్ సేన్ ఆ తర్వాత 2018 లో ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాతో 17వ సంతోషం ఫిలిం అవార్డ్స్ లో భాగంగా ఉత్తమ తొలిచిత్ర నటుడిగా అవార్డు అందుకున్నారు. ఇక తర్వాత వచ్చిన ‘ఫలక్ నుమాదాస్’ సినిమాతో దర్శకుడిగా , రచయితగా, సహానిర్మాతగా కూడా మారి పాపులారిటీ అందుకున్నారు. ఇక 2020లో హిట్, ఆ తర్వాత ఏడాది నుంచీ వరుసగా ‘పాగల్’, ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’, ‘ఓరి దేవుడా’, ‘ముఖచిత్రం’, ‘గామి’, ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. ఇప్పుడు ‘మెకానిక్ రాకీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రంతోపాటు మరో రెండు చిత్రాలను లైన్ లో పెట్టారు విశ్వక్ సేన్.
Mass ka Das’s message straight from Tirupati 🙏🏼Trailer 2.0 drops on 17th November in the PRE RELEASE EVENT 5:00 pm onwards #MechanicRocky #MechanicRockyOnNOV22 📷 🛠 pic.twitter.com/CgidQK6Qb3
— BIG TV Cinema (@BigtvCinema) November 16, 2024