CM Chandrababu: ముఖ్యమంత్రి చంద్రబాబు సోదరుడు, టాలీవుడ్ హీరో నారా రోహిత్ తండ్రి రామమూర్తి నాయుడు శనివారం కన్ను మూశారు. కొద్దిరోజుల కిందట అనారోగ్యానికి గురైన ఆయన, హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో సీఎం చంద్రబాబుకు ఈ విషయం తెలిసింది.
చిన్నాన్న ఆరోగ్యం విషయంలో తెలియగానే అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు మంత్రి లోకేష్. అసెంబ్లీ నుంచి నేరుగా గన్నవరం ఎయిర్‌పోర్టుకు వెళ్లారు. అక్కడి నుంచి హైదరాబాద్‌కు వెళ్లారు. తీవ్ర అస్వస్థతో హైదరాబాద్‌లో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో వెంటి లేటర్‌పై చికిత్స పొందుతూ రామ్మూర్తి నాయుడు కన్ను మూసినట్లు నందమూరి రామకృష్ణ వెల్లడించారు. ఆయన మరణానికి సంతాపం ప్రకటించారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న చంద్రబాబు.. సోదరుడి మరణవార్త తెలియగానే హైదరాబాద్‌కు బయల్దేరారు.
ఏఐజీ హాస్పిటల్ రిలీజ్ చేసిన హెల్త్ బులిటిన్ ప్రకారం.. ఈ నెల 14న ఉదయం 8 గంటలకు రామమూర్తి నాయుడు కార్డియాక్ అరెస్ట్‌తో అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు హుటాహుటిన హాస్పిటల్‌కు తరలించారు. అప్పటి నుంచి ఆయనకు వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. శనివారం ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాలకు రామ్మూర్తి నాయుడు మరణించినట్లు వైద్యులు స్పష్టం చేశారు.
ALSO READ: తిరుమలలో కొత్త రూల్స్.. ఇకపై మాట్లాడినా కేసులే!
నారా కర్జురనాయుడు-అమ్మన్నమ్మ దంపతుల రెండో కుమారుడు రామ్మూర్తి నాయుడు. సీఎం చంద్రబాబుకు తమ్ముడు. టీడీపీలో చేరిన రామమూర్తి నాయుడు 1994లో చంద్రగిరి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత రాజకీయాల నుంచి తప్పుకున్నారు. రామమూర్తి నాయడుకి ఇద్దరు పిల్లలు. ఒకరు హీరో రోహిత్ కాగా, మరొకరు గిరీష్.