BigTV English

Yash Toxic: యష్ మూవీలో కియారాకు అవమానం.. హీరో అసంతృప్తి..!

Yash Toxic: యష్ మూవీలో కియారాకు అవమానం.. హీరో అసంతృప్తి..!

Yash Toxic: సాధారణంగా సౌత్ సినిమాలలో బాలీవుడ్ హీరోయిన్స్ నటిస్తున్నారు అంటే పెద్దగా ప్రమోషన్స్ లేకుండానే క్రేజ్ పెరిగిపోతుంది. అయితే కేవలం ఆ క్రేజ్ బాలీవుడ్ హీరోయిన్ ఉందనే కారణంతో సినిమాలు ఆడవు అనే విషయాన్ని కూడా ఆడియన్స్ అర్థం చేసుకోవాలి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇటీవల తెలుగులో కియారా అద్వానీ (Kiara Advani) చేసిన సినిమాలే అని చెప్పవచ్చు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ నటించిందని అందరికీ తెలుసు. కానీ ఆమె నటించిన సినిమాలు మాత్రం పెద్దగా విజయాన్ని అందుకోలేదు. అప్పుడెప్పుడో మహేష్ బాబు (Maheshbabu) తో ‘భరత్ అనే నేను’ సినిమా చేసిన ఈమె ఆ తర్వాత నటించిన ‘వినయ విధేయ రామ’ తో పాటూ ఇటీవల వచ్చిన ‘గేమ్ ఛేంజర్’ సినిమాలు బొక్క బోర్లా పడ్డాయి. సినిమాలు డిజాస్టర్ లైనా సరే ఈమెకు మాత్రం బడా చిత్రాలలో అవకాశాలు లభిస్తున్నాయి. అలాంటి చిత్రాలలో తాజాగా కన్నడ హీరో యష్(Yash ) నటిస్తున్న టాక్సిక్ (Toxic) కూడా ఒకటి.


కియారా నటనపై యష్ అసంతృప్తి..

ఇప్పటికే ఈ టాక్సిక్ మూవీకి సంబంధించి షూటింగు కొంత భాగం పూర్తయింది. కానీ షూట్ చేసిన భాగంలో కియారా నటన పట్ల హీరో యస్ సంతృప్తిగా లేడని, ఈ నేపథ్యంలోనే హీరోయిన్ ను మార్చాలని అనుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి ‘టాక్సిక్’ లో హీరోయిన్ పాత్రకు నటన ప్రాధాన్యత చాలా ఎక్కువగా ఉందని, అలాంటి పాత్రలో కియారా ఏ మాత్రం మెప్పించడం లేదని హీరో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. ఈ నేపథ్యంలోనే ఆమెను మార్చాలని యష్ చిత్ర బృందంతో మాట్లాడినట్లు సమాచారం. ఇకపోతే దీనిపై ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు కానీ ఒకవేళ ఇదే నిజమైతే కియారా కెరియర్ కు ఇదొక బ్యాడ్ రిమార్క్ గా ఉండిపోనుంది అని చెప్పవచ్చు. ఇక ఇది చూసిన నెటిజన్స్ కియారాకి ఘోర అవమానం జరగబోతోంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా ఇందులో నిజానిజాలు తెలియాల్సి ఉంది ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం సౌత్ లో ఆమెకు జరిగే అవమానం కారణంగా మళ్ళీ ఆమె సౌత్ సినిమాలు చేస్తుందా? అనే ప్రశ్నలు కూడా వ్యక్తం అవుతూ ఉండడం గమనార్హం.


హీరో యష్ కెరియర్..

కన్నడ హీరో యష్ (Yash) విషయానికి వస్తే.. ఒకప్పుడు యాడ్స్ చేస్తూ.. సీరియల్స్ ద్వారా కూడా పాపులారిటీ అందుకున్న ఈయన, ఆ తర్వాత కన్నడలో కొన్ని చిత్రాలు చేశారు. ఇక ఎప్పుడైతే ప్రముఖ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో కేజిఎఫ్ , కేజిఎఫ్ 2 చేశాడో ఒక్కసారిగా పాన్ ఇండియా హీరో అయిపోయారు. అంతేకాదు పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన చిత్రాలలో కేజీఎఫ్ కూడా స్థానం దక్కించుకుంది. ఇక ఇప్పుడు యష్ నుండి రాబోయే టాక్సిక్ మూవీ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు ప్రముఖ లేడీ డైరెక్టర్ గీతూ మోహన్దాసు దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇక ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara) కూడా కీలక పాత్ర పోషిస్తుంది. మరి పగడ్బందీగా ప్లాన్ చేస్తున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×