Pandya- Natasha: టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా { Hardik Pandya} – బాలీవుడ్ హీరోయిన్ నటాషా స్టాంకోవిచ్ { Natasha Stankovich} తమ వైవాహిక జీవితానికి ముగింపు పలికిన విషయం తెలిసిందే. పాండ్యా – నటాషా జంట 2020 మే లో హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు. అనంతరం 2023 ఫిబ్రవరిలో క్రైస్తవ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు. వీరికి అగస్త్య అనే కుమారుడు ఉన్నారు.
Also Read: Sachin Tendulkar: పాకిస్థాన్ వల్లే నా కెరీర్ మారింది.. ఆ 9 గంటలు చుక్కలు చూశా ?
అయితే నాలుగేళ్లపాటు సవ్యంగానే సాగిన వీరి దంపత్య జీవితంలో విభేదాలు తలెత్తాయి. దీంతో 2024 జూలైలో విడిపోతున్నామని ఇద్దరు వారి సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఇది చాలా కఠిన నిర్ణయమే అయినప్పటికీ తప్పడం లేదని, కుమారుడు అగస్త్యకు తామిద్దరం కో పేరెంట్స్ గా కొనసాగుతామని స్పష్టం చేశారు. అయితే నటాషా కంటే తానే ఎక్కువ అని హార్దిక్ పాండ్యా భావించడం, గర్వంతో ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం వంటి కారణాలవల్లే వీరిద్దరి మధ్య మనస్పర్ధలు తలెత్తాయని, ఈ కారణంగానే ఈ జంట విడాకులు తీసుకుందని వీరితో సన్నిహితంగా ఉండే ఓ వ్యక్తి వెల్లడించినట్లు జాతీయ మీడియా వెబ్సైట్ పేర్కొంది.
ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట విడిపోవడం అందరిని షాక్ కి గురిచేసింది. ఎంతో గాఢంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న హార్దిక్ – నటాషా ఇలా విడిపోతారని ఎవరు అనుకోలేదు. ఇదిలా ఉంటే.. ఇండియా – ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న 5 టీ-20 ల సిరీస్ లో భాగంగా నాలుగవ టి-20 లో హార్దిక్ పాండ్యా అద్భుత ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. అంతేకాదు ఈ మ్యాచ్ లో పాండ్యా చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టి-20 ల్లో 1500 పరుగుల ప్లస్ పరుగులు, 50 కి పైగా వికెట్లతో పాటు.. ఐదు కంటే ఎక్కువ హాఫ్ సెంచరీలు నమోదు చేసిన తొలి భారత ఆటగాడిగా చరిత్రకెక్కాడు హార్దిక్ పాండ్యా.
నాలుగోవ టి-20 లో హాఫ్ సెంచరీ చేయడం ద్వారా ఈ ఘనతని సాధించాడు. ఈ మ్యాచ్ లో కేవలం 30 బంతుల్లోనే నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సులతో 53 పరుగులు చేసి భారత గెలుపులో పెద్దన్న పాత్ర పోషించాడు. అయితే ఈ ప్రదర్శన పట్ల స్పందించిన హార్దిక్ పాండ్యా.. ” అభిమానుల కోసం నేనెప్పుడూ ఆడతాను. వారే నా ప్రాణం. కోట్లాదిమంది భారత అభిమానులు తనలో ఆ అదనపు ప్రేరణ నింపారు” అని చెప్పుకొచ్చాడు.
Also Read: U19 Women’s T20 World Cup: నేడు టీమిండియా వర్సెస్ సౌతాఫ్రికా ఫైనల్.. ఉచితంగా ఇలా చూడొచ్చు..?
అయితే ఈ మ్యాచ్ లో పాండ్యా ప్రదర్శనని మెచ్చుకునేందుకు అతడి భార్య నటాషా తిరిగి మళ్లీ హార్దిక్ పాండ్యా వద్దకు వచ్చిందని, దీంతో మీరిద్దరూ కలిసిపోయారని, వీరిద్దరికీ సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఇదంతా ఫేక్ అని, ఆ ఫోటోలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వారా కొందరు ఆకతాయిలు సృష్టించి వైరల్ చేస్తున్నవిగా తేలిపోయింది. ఈ ఏఐ టెక్నాలజీతో తయారుచేసిన ఫోటోలు.. నిజమైన ఫోటోలను పోలి ఉన్నట్లు ఉండి కొన్ని సందర్భాలలో సెలబ్రిటీలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.