BigTV English

Janhvi kapoor: రూ. 4 కోట్లు ఇస్తేనే ఆ పని చేస్తానంటున్న జాన్వీకపూర్‌

Janhvi kapoor: రూ. 4 కోట్లు ఇస్తేనే ఆ పని చేస్తానంటున్న జాన్వీకపూర్‌

Janhvi Kapoor in Pushpa 2 Item Song(Today tollywood news): బాలీవుడ్‌ అందాల తార జాన్వీకపూర్ గురించి స్పెషల్ ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన పనిలేదు. ఎందుకంటే భూలోక తార శ్రీదేవి కూతురిగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన దగ‌రి నుండి ఈ భామ వరుస సినిమాలతో తగ్గకుండా తన గ్లామర్‌, యాక్టింగ్‌తో అభిమానులను సొంతం చేసుకుంది.అంతేకాకుండా మత్తెక్కించే తన అందమైన కళ్లతో కుర్రకారుని ఓ ఆట ఆడుకుంటుంది.బాలీవుడ్‌లో వరుసగా మూవీస్ చేసి అతి తక్కువ టైమ్‌లో తిరుగులేని స్టార్‌డమ్‌ని సంపాదించుకుంది.అటు బాలీవుడ్‌, ఇటు టాలీవుడ్‌లో వరుస ఆఫర్లతో దూసుకెళ్తోంది. తాజాగా టాలీవుడ్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ యాక్ట్ చేసిన దేవర మూవీ. కొరటాల శివ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ మూవీలో ఛాన్స్ కొట్టేసింది ఈ భామ.అంతేకాదు ఆ తరువాత బుచ్చిబాబు దర్శకత్వంలో రాబోయే మూవీలో రామ్‌చరణ్‌తో యాక్ట్ చేసేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు మరిన్ని మూవీస్‌కి కూడా సైన్ చేసినట్టు తెలుస్తోంది.


ఇక ఇదిలా ఉంటే..దీపం ఉన్నప్పుడే ఇల్లు సర్ధిపెట్టుకోవాలంటారు కదా మన పెద్దలు. అందుకనుగుణంగా ఈ స్టార్ హీరోయిన్ ప్లాన్ చేసుకుంటుందటా. ఆ మూవీలో ఐటమ్ సాంగ్ చేయాలంటే కోట్లు డిమాండ్ చేస్తోంది ఈ నటి.అల్లు అర్జున్ నటించిన పుష్ప మూవీ ఎంత పెద్ద సంచలనంగా మారిందో టాలీవుడ్‌ అభిమానులకు చెప్పనక్కర్లేదు. ఈ మూవీలో బన్నీ క్యారెక్టర్ చాలా డిఫరెంట్‌గా తెరకెక్కించాడు డైరెక్టర్ సుకుమార్‌. అంతేకాకుండా ఈ మూవీ పేరు గుర్తుకొస్తే చాలు ఊ అంటావా ఊఊ అంటావా మావా ఐటమ్ సాంగ్‌ గుర్తుకొస్తుంది. ఎందుకంటే ఈ సాంగ్‌ అంతలా పాపులార్టీని సొంతం చేసుకుంది. ఈ సాంగ్ చేసిన అందాల తార సమంతకి కూడా మంచి ఫేమ్ వచ్చింది.

Also Read: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన రెబల్‌ హీరోయిన్‌


ఈ క్రమంలో పుష్ప మూవీకి సీక్వెల్‌గా రాబోతున్న పుష్ప 2 మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.ఈ మూవీలో పస్ట్‌ పార్ట్‌లో విధంగా ఐటమ్ సాంగ్ కోసం ప్లాన్ చేస్తున్నారట డైరెక్టర్ సుకుమార్. అందుకోసం స్టార్ హీరోయిన్‌ని రంగంలోకి దించాలని గట్టి ప్లాన్ చేస్తున్నాడట. ఇప్పటికే ఈ వరుసలో బాలీవుడ్‌ అందాల తారలు త్రిప్తి డిమ్రితో పాటు దిశా పటానీ పేర్లు వినిపించాయి.అందులో జాన్వీ కపూర్ పేరు కూడా రేసులో ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే ఈ ఐటమ్ సాంగ్ చేయాలంటే దాదాపుగా రూ.4 కోట్లు రెమ్యూనరేషన్‌ని డిమాండ్ చేస్తుందట ఈ భామ. ఇక ఈ ఒక్క సాంగ్ కోసం ఇంత డిమండ్ చేయడంతో అందరూ షాక్‌కి గురవుతున్నారు. అంతేకాదు ఈ మూవీ కోసం మూవీ మేకర్స్ ఎక్కడా కూడా తగ్గేదేలేదంటూ భారీగానే ఖర్చు పెడుతున్నారు.

ఇక ఈ మూవీ అనుకున్న టైమ్‌లో కాకుండా కొన్ని సీన్స్ కోసం డిసెంబర్‌ 6 కి వాయిదా పడటం వంటివి ఈ మూవీని వెంటాడుతున్నాయి. అందుకే నిర్మాతలపై అనుకున్న దానికంటే ఎక్కువ భారం పడుతోందని మూవీ యూనిట్ తెలిపింది. అంతేకాదు ఈ మూవీ ఫైనల్‌గా ఈ ఏడాది చివరి నాటికి కంప్లీట్ కానున్నట్టు తెలుస్తోంది. అందులోనూ ఈ మూవీకి ఇంకో హైలైట్ ఏంటంటే..ఐటమ్ సాంగ్ మరి ఈ ఐటమ్ సాంగ్‌లో బన్నీతో డ్యాన్స్ వేసే బంపరాఫర్ ఎవరికి దక్కనుందో తెలియాలంటే మరికొన్ని డేస్ వెయిట్ చేయకతప్పదు.

Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×