BigTV English

Hyundai Creta CNG: పోటీకి సిద్ధమవుతున్న ‘హ్యుందాయ్ క్రెటా సీఎన్‌జీ’ వెర్షన్..!

Hyundai Creta CNG: పోటీకి సిద్ధమవుతున్న ‘హ్యుందాయ్ క్రెటా సీఎన్‌జీ’ వెర్షన్..!

Hyundai Creta CNG Launching Soon: దేశీయ మార్కెట్‌లో హ్యుందాయ్ కార్లకు మంచి క్రేజ్ ఉంది. అందులోనూ హ్యుందాయ్ క్రెటా ఎస్యూవీ అత్యధిక సేల్ అవుతున్న కార్ల జాబితాలో ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. దీంతో ఈ కారుకు వస్తున్న రెస్పాన్స్ బట్టి కంపెనీ ఈ ఏడాది స్టార్టింగ్‌లో ఫేస్‌లిఫ్ట్‌ని రిలీజ్ చేసింది. దీనికి మంచి రెస్పాన్స్ రావడంతో కంపెనీ సేల్స్ గణనీయంగా పెరిగాయి. ఇక ఇప్పుడు కంపెనీ మరొక అడుగు ముందుకు వేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఈ కారు ఇప్పుడు కొత్త సీఎన్‌జీ పవర్‌ట్రెయిన్‌ వెర్షన్‌లో మార్కెట్‌లోకి రాబోతున్నట్లు సమాచారం.


ఇప్పటికీ ఈ కొత్త వెర్షన్‌కు సంబంధించిన ఫొటోలు ఇంటర్నెట్‌లో షేక్ చేశాయి. ఈ కొత్త వెర్షన్ టెస్ట్‌డ్రైవ్ చేస్తూ కనిపించి కొన్ని ఫొటోలు తాజాగా వైరల్ అవుతున్నాయి. దీని ప్రకారం.. ఈ కొత్త హ్యుందాయ్ క్రెటా ఫుల్‌గా కవర్‌తో కప్పబడి కనిపించింది. అయినప్పటికీ ఇది డేటైమ్ రన్నింగ్ లైట్లు, ఫ్రంట్ గ్రిల్, హెడ్‌లైట్లతో వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇది సీఎన్‌జీ పవర్‌ట్రెయిన్ ఆప్షన్‌లో రానుంది.

అయితే ప్రస్తుతం దేశంలో పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల కారణంగా వాహన ప్రియులు ఎలక్ట్రిక్, సీఎన్‌జీ కార్లపై ఆసక్తి చూపుతున్నారు. అలాంటి సమయంలోనే ప్రముఖ కంపెనీలు సైతం సీఎన్‌జీ, ఎలక్ట్రిక్ వెహికల్స్‌ను తయారు చేసి మార్కెట్‌లో లాంచ్ చేస్తున్నాయి. అందువల్లనే వాహన ప్రియులను దృష్టిలో ఉంచుకుని హ్యుందాయ్ కంపెనీ క్రెటా సీఎన్‌జీను మార్కెట్‌లో లాంచ్ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలిసినప్పటి నుంచి కారు ప్రియులు ఈ క్రెటా సీఎన్‌జీ కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.


Also Read: హ్యుందాయ్ క్రెటా నుంచి EV.. సింగిల్ ఛార్జ్‌తో 500 కిమీ రేంజ్!

అయితే ఈ ఒక్క కంపెనీయే కాకుండా కియా కూడా సీఎన్‌జీ వెర్షన్‌పై పనులు మొదలు పెట్టింది. సెల్టోస్ లైనప్‌లో సరికొత్త ఫీచర్లతో సీఎన్‌జీ వెర్షన్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తుంది. దీనికి సంబంధించి ఆల్రెడీ టెస్ట్‌డ్రైవ్ కూడా చేసినట్లు తెలుస్తోంది. కాగా హ్యుందాయ్ క్రెటా సీఎన్‌జీ పవర్‌ట్రెయిన్ శక్తి, టార్క్ అనేది పెట్రోల్ వేరియంట్‌తో పోలిస్తే చాలా తక్కువగా ఉండే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇకపోతే హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ లీటర్ పెట్రోల్‌కి 17.4 నుంచి 21.8 కి.మీ మైలేజీ ఇస్తుంది.

అదే సమయంలో మారుతి గ్రాండ్ విటారా సీఎన్‌జీ పవర్‌ట్రెయిన్ కిలోకు 26.6 కి.మీ మైలేజీ అందిస్తుంది. ఇక త్వరలో మార్కెట్‌లోకి రాబోతున్న క్రెటా సీఎన్‌జీ వెర్షన్‌లోనూ ఇలాంటి మాదిరి ఇంధన సామర్థ్యం ఉన్నట్లు తెలుస్తోంది. దీని బట్టి చూస్తే క్రెటా సీఎన్‌జీ కూడా 26 కి.మీ మైలేజీని అందిస్తుందని అభిప్రాయపడుతున్నారు. ఇది 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌ గేర్‌బాక్స్‌తో వస్తుందని బావిస్తున్నారు. అలాగే 7 స్పీడ్ DCT యూనిట్‌ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ హ్యుందాయ్ క్రెటా సీఎన్‌జీని వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభం తర్వాత రిలీజ్ చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

Tags

Related News

JIO Super Plans: జియో నుంచి సూపర్ ఆఫర్లు.. ఏది ఫ్రీ, ఏది బెస్ట్ అంటే?

SEBI – Foreign Funds: భారతీయ ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్.. విదేశీ ఫండ్స్‌కి SEBI గ్రీన్ సిగ్నల్

ICICI Bank New Rules: కస్టమర్లకు ICICI బిక్ షాక్.. కనీస బ్యాలెన్స్ రూ.10 వేలు కాదు.. అంతకుమించి.. పేదోళ్ల సంగతి ఏంటో?

Digital Rent Agreement: ఈ రూల్ తెలియకుండా ఇల్లు అద్దెకు ఇస్తే రూ. 5000 జరిమానా కట్టక తప్పదు..

Real Estate: ఈ విషయాలు తెలియకుండా ‌ఫార్మ్ లాండ్స్ కొంటే భారీ నష్టం తప్పుదు..అడ్వర్టయిజ్‌మెంట్స్ చూసి మోసపోకండి..

Gold Particles: మురుగునీటి నుంచి భారీగా బంగారం ఉత్పత్తి.. లక్షల్లో సంపాదన..? ఎక్కడో తెలుసా?

Big Stories

×