Actress Laya : టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ లయ పేరు తెలియని వాళ్లు ఉండరు.. ఒకప్పుడు ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసింది. స్టార్ హీరోలు అందరు సరసన నటించి మెప్పించింది. అయితే కెరీర్ పిక్స్ లో ఉన్నప్పుడే ఈమె పెళ్లి చేసుకుని సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. తర్వాత ఫ్యామిలీ లైఫ్ ని లీడ్ చేసుకుంటూ వచ్చింది. వెంటనే పిల్లలు కలగడంతో పిల్లల బాధ్యతను కూడా తానే తీసుకొని గృహిణిలాగా మారిపోయింది. ఇటీవల సోషల్ మీడియాలో లయ యాక్టివ్ గా ఉంటుంది అన్న విషయం తెలిసిందే.. లేటెస్ట్ ఫోటోలతో పాటు ఫ్యామిలీ ఫోటోలను కూడా షేర్ చేసుకుంటూ అభిమానులను పలకరిస్తూ ఉంటుంది. ఈమధ్య పలు ఇంటర్నెట్ చానల్స్ కూడా ఇంటర్వ్యూ లిస్టు వస్తున్న లయ తన గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకుంది. తాజాగా ఈమె గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. భర్తకు లయ దూరంగా ఉందన్న వార్త నెట్టింట ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది..
భర్తకు దూరంగా లయ..
ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు ఎప్పుడు పెళ్లిలను అనౌన్స్ చేస్తున్నారో.. ఎప్పుడూ విడాకులను తీసుకుంటున్నారో కూడా తెలియకుండా పోతుంది. నిన్న మొన్న బాగానే ఉన్న జంట కూడా రేపు విడాకులు తీసుకుపోతున్నాం అంటూ అనౌన్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఇలాంటి వార్తలు ప్రతిరోజు ఏదో ఒకటి వినిపిస్తూనే ఉంటుంది. ఇప్పుడు హీరోయిన్ లయ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వినిపిస్తుంది. అదేంటంటే ఆమె తన భర్తకు దూరంగా ఉందంటూ టాక్.. ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ ప్రస్తుతం ఇది మీడియా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.. లయ తన భర్త నుంచి విడాకులు తీసుకోబోతున్నారని? ఆమెకు వేలకోట్ల ఆస్తులు ఉన్నాయంటూ రూమర్స్ వైరల్ అయ్యాయి. దీనిపై ఓ ఇంటర్వ్యూలో లయ క్లారిటీ ఇచ్చారు. తన భర్తకు అమెరికాలో క్లినిక్స్ ఉన్నాయని.. తమ కుటుంబంలో అందరూ డాక్టర్సేనని తనకు వేలకోట్లు లేకపోవచ్చు కానీ ఏం కావాలన్నా క్షణాల్లో కొనగలనని పేర్కొన్నారు.. నేను ఇండియాలో ఆయన అమెరికాలో ఉండడం వల్లే మేమిద్దరం విడిపోయామని వార్తలు వినిపిస్తున్నాయంటూ లయ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు..
Also Read : ఈరోజు టీవి ఛానెల్లో వచ్చే సినిమాలు.. చిరు ఫ్యాన్స్ కు పండగే..
లయ సినిమాల విషయాలు..
హీరోయిన్ లయ గురించి, ఆమె సినిమాల గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఒకవైపు చదువుతూనే, మరోవైపు నటనపై ఆసక్తితో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేసింది. 1992లో భద్రం కొడుకో అనే సినిమాలో బాలనటిగా ఎంట్రీ ఇచ్చిన లయ ఏడేళ్లు తిరిగే సరికి 1999లో స్వయంవరం సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు.. మొదటి సినిమాతో మంచి టాక్ని సొంతం చేసుకున్న ఈ అమ్మడు ఆ తర్వాత వరుసగా బ్యాక్ టూ బ్యాక్ చిత్రాల్లో నటించి ఎన్నో అవార్డులను అందుకుంది. నటనతో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన లయ ఈమధ్య సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టబోతుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే అక్కడ టులో ఆమె కూతురు చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే.. మరి లయ కూడా సినిమాలు చేస్తుందేమో చూడాలి..