Balakrishna:నటసింహ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), గాడ్ ఆఫ్ మాసెస్ వరుస పెట్టి సినిమాలు ప్రకటిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఇకపోతే యుక్త వయసులో ఉన్నప్పుడు టాలీవుడ్ లోనే సినిమాలు చేసే ప్రేక్షకులను అలరించిన ఈయన ఇప్పుడు మాత్రం భాష మార్చేశారు అని చెప్పాలి. ఒకటి తర్వాత మరొకటి కోలీవుడ్లో అవకాశాలు అందుకుంటున్నారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం. బాలకృష్ణ.. రజనీకాంత్ (Rajinikanth) హీరోగా నటిస్తున్న ‘జైలర్ 2’ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. 20 రోజులపాటు సాగే చిత్రీకరణలో ఈయన భాగం కాబోతున్నారు. అంతేకాదు ఈ 20 రోజుల కోసం ఏకంగా రూ.50 కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు బాలయ్య. అంతేకాదు తన కెరియర్ లో ఈ సినిమా కోసమే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని చెప్పవచ్చు.
కోలీవుడ్లో వరుస అవకాశాలు అందుకుంటున్న బాలయ్య..
ఇదిలా ఉండగా ఇప్పుడు మరో తమిళ్ సినిమాకి బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అసలు విషయంలోకి వెళ్తే.. ఇటీవల అజిత్ (Ajith) తో ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమా చేసి రూ.100 కోట్ల క్లబ్లో చేరిన డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ (Adhik Ravichandran) తో బాలయ్య సినిమా చేయబోతున్నట్లు సమాచారం. ఈ గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన విషయం తెలిసిందే. అటు బాలయ్య.. గోపీచంద్ మలినేని (Gopichandh malineni)దర్శకత్వంలో చేసిన సినిమా వీరసింహారెడ్డిని నిర్మించింది కూడా మైత్రి మూవీ మేకర్స్ కావడం గమనార్హం. ఇప్పుడు ఆ చొరవతోనే.. నవీన్ ఎర్నేని (Naveen yerneni), వై రవిశంకర్(Y.Ravishankar ) ఆధిక్ రవిచంద్రన్ – బాలయ్య తో కలిసి సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. అందులో భాగంగానే అధిక్ రవిచంద్రన్ చెప్పిన పాయింట్ నచ్చడంతో అతడిని బాలకృష్ణ దగ్గరకు మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు తీసుకెళ్లారని, ఇప్పటికే స్టోరీ పాయింట్ విన్న బాలకృష్ణ త్వరలో తన అభిప్రాయాన్ని చెప్పే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం కథను ఫైనల్ చేసే పనిలో పడ్డారట బాలయ్య.
బాలయ్య రిస్క్ చేస్తున్నారా?
ఒకవేళ ఇదే నిజమైతే టాలీవుడ్ దర్శకులను పక్కనపెట్టి కోలీవుడ్ దర్శకులకు బాలయ్య అవకాశాలు ఇచ్చేటట్టు కనిపిస్తోంది . ఇక మరొకవైపు ఇదే విషయంలో ఆయన రిస్క్ లో పడుతున్నారేమో అని అభిమానులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వరుసగా కోలీవుడ్ డైరెక్టర్లకే అవకాశాలు ఇస్తే మళ్లీ టాలీవుడ్ డైరెక్టర్లు అనుకున్న టైంలో బాలయ్యకు అవకాశాలు ఇస్తారా..? అసలు భాషను మార్చి బాలయ్య రిస్క్ చేస్తున్నారా? అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు. మరి దీనిపై బాలయ్య నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి. ఇక బాలయ్య సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ‘అఖండ’ సీక్వెల్ ‘అఖండ 2’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు. అటు జైలర్ 2 సినిమాలో స్పెషల్ రోల్స్ చేస్తున్న బాలయ్య.. అన్నీ కుదిరితే అధిక్ రవిచంద్రన్ తో కూడా సినిమా చేసే అవకాశం కనిపిస్తోంది. ఇక దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ALSO READ:Rajasaab: ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఎట్టకేలకు కదిలిన ఘాడీ..!