Meenakshi Choudhary :ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న ఏకైక పేరు మీనాక్షి చౌదరి (Meenakshi choudhary). ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ మారిపోయింది. ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా మారింది ఈ ముద్దుగుమ్మ. తొలుత ‘ఇచట వాహనములు నిలపరాదు’ అనే సినిమా ద్వారా హీరోయిన్ గా తెలుగు తెలుగు పరిచయమైంది మీనాక్షి చౌదరి. సుశాంత్(Sushanth) హీరోగా నటించిన ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేదు. ఆ తర్వాత రవితేజ (Raviteja) హీరోగా నటించిన ‘ఖిలాడి’ సినిమాలో తన గ్లామర్ తో ఆకట్టుకుంది. ఆ తర్వాత అడివి శేష్ (Adivi shesh ) హీరోగా నటించిన ‘హిట్ 2’ సినిమా ఈమెకు మంచి గుర్తింపును అందించింది. తర్వాత మహేష్ బాబు (Mahesh babu) తో ‘గుంటూరు కారం’ సినిమాలో కనిపించిన మీనాక్షి చౌదరి, తమిళ్లో విజయ్ దళపతి (Vijay dhalapathy ) హీరోగా నటించిన ‘గోట్’ సినిమాలో కూడా ఆకట్టుకుంది. అంతేకాదు గత ఏడాది దుల్కర్ సల్మాన్ ( Dulquar Salman ) హీరోగా నటించిన ‘లక్కీ భాస్కర్’ సినిమాలో కూడా నటించి మంచి విజయాన్ని అందుకుంది.ఇప్పుడు వెంకటేష్ (Venkatesh) హీరోగా నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో సూపర్ హిట్ అందుకొని ఫుల్ జోష్ మీద ఉంది ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడు ఈ అమ్మడు లిస్టులో పెద్ద సినిమాలు చాలానే ఉన్నాయి అని చెప్పవచ్చు. అంతేకాదు ఒకటి రెండు పాన్ ఇండియా సినిమాలు కూడా ఉండడం గమనార్హం.
ఇదిలా ఉండగా కెరియర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్న మీనాక్షి చౌదరి.. మొదటిసారి తన క్రష్ ఎవరో చెప్పింది. సంక్రాంతికి వస్తున్నాం చిత్ర బృందంతో కలిసి పలు ఇంటర్వ్యూలకు హాజరవుతున్న ఈమె.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “స్కూల్ సమయంలో నాకు ఒక క్రష్ ఉండేది. మా స్కూల్ టీచర్.. ఆయన అంటే నాకు చాలా ఇష్టం. నా ఒక్కదానికే కాదు ముఖ్యంగా మా స్కూల్లో ఉండే ప్రతి అమ్మాయికి కూడా ఆయనపై క్రష్ ఉండేది. అంతేకాదు అతనే నా ఫస్ట్ క్రష్ కూడా. ఆ తర్వాత ఇప్పటివరకు ఎవరి మీద అలాంటి ఫీలింగ్ కలగలేదు” అంటూ తెలిపింది మీనాక్షి చౌదరి. ఇక అలాగే మాట్లాడుతూ.. “జీవితంలో అందరికీ ఎవరో ఒకరి మీద ఖచ్చితంగా క్రష్ కలుగుతుంది. మా సంక్రాంతికి వస్తున్నాం సినిమా కూడా అదే కథతో తెరకెక్కడం నాకు సంతోషంగా ఉంది. దీనికి తోడు ఈ సినిమా మంచి విజయం సాధించడంతో నా ఆనందం రెట్టింపు అయ్యింది” అంటూ మీనాక్షి చెప్పుకొచ్చింది. ప్రస్తుతం మీనాక్షి చౌదరి షేర్ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
సంక్రాంతికి వస్తున్నాం సినిమా విశేషాలు..
మీనాక్షి చౌదరి ఇటీవల నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా విషయానికి వస్తే.. వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో జనవరి 14వ తేదీన ఈ సినిమా విడుదల అయ్యింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా మూడు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్లో చేరి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఇందులో మీనాక్షి చౌదరి తో పాటు ఐశ్వర్య రాజేష్ (Aishwarya rajesh )కూడా హీరోయిన్గా నటించింది.