Snehasish Ganguly: గత కొంతకాలంగా భారత క్రికెట్ ఆటగాళ్లు పేలవ ప్రదర్శనతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో జట్టు పరిస్థితి మరింత దిగజారక ముందే ఆటగాళ్ల తీరును చక్కదిద్దేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) పలు చర్యలు ప్రారంభించింది. భారత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ క్రికెట్ డ్రెస్సింగ్ రూమ్ లో క్రమశిక్షణ రాహిత్యం గురించి బీసీసీఐ దృష్టికి తీసుకు వెళ్లడంతో.. తీవ్ర చర్చల అనంతరం బీసీసీఐ 10 పాయింట్ల విధానాన్ని సమర్పించింది.
Also Read: Neeraj Chopra’s Wife: నీరజ్ చోప్రా భార్య బ్యాక్ గ్రౌండ్ ఇదే.. దిమ్మతిరిగి పోవాల్సిందే!
భారత ఆటగాళ్లు అందరూ ఈ 10 నిబంధనల గైడ్లైన్స్ ని పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని బీసీసీఐ హెచ్చరికలు జారీ చేసింది. ఇటీవలి కాలంలో భారత జట్టు వరుస వైఫల్యాలకు క్రమశిక్షణ లేమి కారణమని భావిస్తున్న భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ ఈ కఠిన మార్గదర్శకాలను అమలులోకి తీసుకువచ్చింది. అయితే తాజాగా ఈ నిబంధనలను అమలు చేయడం మొదలుపెట్టింది బీసీసీఐ. ఈ మేరకు జట్టు ఆటగాళ్లందరూ ఒకే బస్సులో ప్రయాణించేలా చూడాలని, ఏ ఆటగాడికి కూడా వ్యక్తిగత వాహనాలు సమకూర్చవద్దని స్పష్టం చేసింది.
ఇంగ్లాండ్ తో జరగబోయే సిరీస్ మ్యాచ్ లకు వేదికలైన రాష్ట్ర సంఘాలకు ఈ ఆదేశాలను జారీ చేసింది. దీంతో మొదటి టీ-20 కి కలకత్తా ఆతిథ్యమిస్తున్న నేపథ్యంలో బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (సిఏబి) ఈ ఆదేశాలను అమలు చేస్తోంది. అయితే బీసీసీఐ ఆదేశాలను పాటిస్తామని బెంగళూరు క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు స్నేహశీష్ గంగూలీ తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “బుధవారం ఈడెన్ గార్డెన్స్ లో జరిగే మొదటి టి20 కోసం ఇప్పటికే భారత్ – ఇంగ్లాండ్ జట్లు అక్కడికి చేరుకున్నాయి. ఆదివారం రోజు ప్రాక్టీస్ కోసం హోటల్ నుండి ఆటగాళ్లు, సహాయక సిబ్బంది అందరూ ఒకే బస్సులో ప్రయాణించారు. ప్రాక్టీస్ అనంతరం తిరిగి అదే బస్సులో హోటల్ కి చేరుకున్నారు. వీరంతా ప్రాక్టీస్ సెషన్ అయ్యేంతవరకు మైదానంలోనే ఉండాలి.
గ్రౌండ్ నుండి నేరుగా హోటల్ కి అందరూ కలిసే వెళ్లాలి. భారత జట్టు కోసం ఓ బస్సును అందుబాటులో ఉంచాం. క్రికెటర్లలో ఎవరికీ వ్యక్తిగత వాహనాలు సమకూర్చడం లేదు. మ్యాచ్ కి, ప్రాక్టీస్ సెషన్ కి అందరూ ఒకే బస్సులో ప్రయాణించాలనే నిబంధనకు కట్టుబడి ఉన్నాం” అని తెలిపారు స్నేహశీష్ గంగూలీ.
Also Read: WV Raman: నరకంలో ఆ మాజీ క్రికెటర్..చనిపోయి, మళ్లీ బతికానంటూ పోస్ట్ !
అయితే మ్యాచ్ లు జరిగే సమయంలో లేదా ప్రాక్టీస్ సెషన్స్ లో పాల్గొనే సమయంలో ఆటగాళ్లు కుటుంబాలతో కలిసి వేరువేరుగా ప్రయాణాలు చేయడాన్ని తాజాగా బీసీసీఐ నిషేధించింది. మ్యాచ్ లు జరిగే సమయంలో ఆటగాళ్లు వేరువేరుగా కుటుంబాలతో కలిసి ప్రయాణించడం వల్ల జట్టు ఐక్యతను దెబ్బతీస్తుందని బిసిసిఐ భావించి ఈ నిబంధనను అమలులోకి తీసుకువచ్చింది.
🚨 NO PERSONAL VEHICLES FOR INDIAN PLAYERS 🚨
– The entire Indian squad travelling to and from training on the Team Bus at Kolkata during the first T20I as state associations have started following the guidelines set by BCCI. [PTI] pic.twitter.com/FAUlwzGc5C
— Johns. (@CricCrazyJohns) January 19, 2025