Tollywood Heroine:సినీ ఇండస్ట్రీలో చాలామంది సెలబ్రిటీలు ఒకరినొకరు ఇష్టపడి, ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న తర్వాత కొన్ని కారణాలతో విడిపోతారు.. మరి కొంతమంది పెళ్లి చేసుకొని అర్ధాంతరంగా తనువు చాలిస్తే.. ఆ ఇద్దరిలో ఒకరు ఇంకో తోడు వెతుక్కుంటారు. ఇక అలాంటి జాబితాలోకి టాలీవుడ్ హీరోయిన్ పావని రెడ్డి (Pavani Reddy) చేరిపోయింది.. తాజాగా ఈ ముద్దుగుమ్మ మళ్ళీ పెళ్లి చేసుకోబోతోంది అనే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. అందులో భాగంగానే తన ఇన్ స్టా గ్రామ్ వేదికగా ఒక వీడియోని షేర్ చేస్తూ.. అసలు విషయాన్ని తెలియజేసింది పావని రెడ్డి. తన ఇన్ స్టాగ్రామ్ లో కాబోయే వరుడితో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేస్తూ.. “త్వరలో మేము పెళ్లి చేసుకోబోతున్నాం. ఒకరికొకరు తోడుంటామని సముద్రం సాక్షిగా మాటిచ్చుకున్నాము. ఇకపై కలిసి జీవిద్దాం” అంటూ తెలిపింది. ఇక ఈనెల 20వ తేదీన ప్రముఖ కొరియోగ్రాఫర్ అమీర్ (choreographer Amir ) తో ఏడడుగులు వేయబోతున్నట్లు ఆ పోస్టులో తెలిపింది పావని రెడ్డి. ఇక ఈ పోస్ట్ చూసిన తర్వాత పలువురి సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు పావని, అమీర్ లకు అభినందనలు తెలియజేస్తున్నారు.
పావని రెడ్డి వ్యక్తిగత జీవితం..
ప్రముఖ నటి పావని రెడ్డి 2013లో తెలుగు నటుడు ప్రదీప్ కుమార్ (Pradeep Kumar)ను ప్రేమించి మరీ వివాహం చేసుకుంది. సరిగ్గా ప్రేమికుల రోజు వీరి వివాహం కూడా జరిగింది. అయితే ఏమైందో తెలియదు కానీ 2017లో ప్రదీప్ ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాదులోని పుష్పాలగూడ లో తన నివాసంలో విగత జీవిగా కనిపించాడు. అప్పట్లో ఈ సంఘటన టాలీవుడ్ లో కలకలం రేపింది. దీంతో పావని రెడ్డి పేరు కూడా సోషల్ మీడియాలో మార్మోగింది. ఆమె ఇంకొకరితో చనువుగా ఉండటం వల్లే ప్రదీప్ కుమార్ ఇలా బలవన్మరణానికి పాల్పడ్డారు అనే విమర్శలు గుప్పించారు. ఈ విషాదం తర్వాత పావని నిర్మాత ఆనంద్ జాయ్ (Anand joy) ను వివాహం చేసుకోబోతున్నట్లు వార్తలు షికార్లుగా వినిపించాయి. కానీ అది వాస్తవం కాదని అప్పట్లోనే ఇద్దరు క్లారిటీ ఇచ్చారు.
బిగ్ బాస్ షో లో రన్నరప్ గా నిలిచిన పావని రెడ్డి..
ఇకపోతే ఒకప్పుడు వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించిన పావని రెడ్డి.. తమిళ బిగ్ బాస్ సీజన్ -5 (Tamil Biggboss -5) లో కంటెస్టెంట్ గా పాల్గొనింది. అక్కడ తన పెర్ఫార్మన్స్ తో అందరిని అబ్బురపరిచింది. లేడీ శివంగిలా తన ఆట తీరుతో ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలోనే అటు ఆడియన్స్ కూడా ఈమెకు పట్టం కట్టారు. అలా సీజన్ ఫైవ్ లో టైటిల్ కోసం పోరాడి సెకండ్ రన్నరప్ గా నిలిచింది. ఇక ఈ షో సమయంలోనే ఇందులో పాల్గొన్న కంటెస్టెంట్ అమీర్ తో ప్రేమలో పడింది. వీరిద్దరూ ప్రస్తుతం కలిసే ఉంటున్నారని ప్రచారాలు కూడా జరుగుతున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఇప్పుడు ఆ రూమర్లను మాత్రం నిజం చేస్తూ మళ్ళీ పెళ్లికి సిద్ధమైంది పావని రెడ్డి. ఇంకా త్వరలోనే ఏడడుగులు వేయబోతోంది ఈ జంట.
పావని రెడ్డి సినిమాలు..
సినిమాలే కాదు సీరియల్స్ లో కూడా నటించి ఆకట్టుకుంది. ఇకపోతే డబుల్ ట్రబుల్ , సేనాపతి, మళ్లీ మొదలైంది, తెగింపు, ఛారీ 111 వంటి చిత్రాలలో నటించిన ఈమె అగ్నిపూలు, నా పేరు మీనాక్షి, శ్రీమతి తదితర సీరియల్స్ లో కూడా నటించి ఆకట్టుకుంది.