BigTV English

Heroine Simran: వారు క్షమాపణ చెప్పాలి.. బహిరంగ ప్రకటన చేసిన సిమ్రాన్..!

Heroine Simran: వారు క్షమాపణ చెప్పాలి.. బహిరంగ ప్రకటన చేసిన సిమ్రాన్..!

Heroine Simran.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా పేరు సొంతం చేసుకున్న సిమ్రాన్ (Simran) , వైవాహిక బంధం లోకి అడుగుపెట్టిన తర్వాత దాదాపుగా తెలుగు ఇండస్ట్రీకి దూరమైందనే చెప్పాలి. అయితే ఈ మధ్య కాలంలో తమిళ్ చిత్రాలలో అడపాదడపా క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తోంది ఒకవైపు నటిగా ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే మరొకవైపు నిర్మాణ రంగంలోకి కూడా అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గత కొద్ది రోజులుగా ఈమె పై రూమర్స్ వైరల్ అయ్యాయి..


సిమ్రాన్ ఆఫర్ ను రిజెక్ట్ చేసిన విజయ్..

గత కొద్ది రోజులుగా కోలీవుడ్ హీరో విజయ్ 69(Vijay 69) వ చిత్రాన్ని సిమ్రాన్ తన ప్రొడక్షన్ హౌస్ లో చేయబోతుందనే వార్తలు వినిపించాయి. అంతేకాదు తన మొదటి ప్రొడక్షన్ లో విజయ్ తో సినిమా చేయాలని ఆమె ఆశపడిందని , అందులో భాగంగానే విజయ్ ను ఈ విషయంపై సంప్రదించగా.. ఆయన సున్నితంగా తిరస్కరించారు అని వార్తలు వినిపించాయి. ఈ వార్తలు కాస్త సిమ్రాన్ వరకు చేరడంతో ఒక సుదీర్ఘ నోట్ వదిలింది సిమ్రాన్. అందులో తనపై తప్పుడు ప్రచారం చేసిన వారు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలి అంటూ ప్రకటన చేసింది. మరి ఆ ప్రకటనలో ఏముందో ఇప్పుడు చూద్దాం.


నా పరిమితులు నాకు తెలుసు..

సిమ్రాన్ ఆ ప్రకటనలో.. నాపై ఎన్నో రూమర్స్ సృష్టించారు. అయినా సరే ఇప్పటివరకు నేను మౌనం గానే ఉన్నాను. ఇకపై అలా కుదరదు. పెద్ద హీరోలతో కలిసి పని చేయాలని నాకు లేదు. కానీ పెద్ద హీరోలతో ఒకప్పుడు నటించాను. ఇప్పుడు నా లక్ష్యం వేరు. గమ్యం వేరు. ఒక స్త్రీగా నా పరిమితులు నాకు ఉంటాయి. అవన్నీ కూడా నాకు తెలుసు. ఇవన్నీ ఆలోచించకుండా గతంలో నన్ను ఇంకొకరితో లింక్ చేసి ఎఫైర్ రూమర్స్ సృష్టించారు. అప్పుడు నేను సింగిల్ గానే ప్రశాంతంగా ఉన్నాను. కానీ తప్పుడు ప్రచారాలు నన్ను మరింత మానసికంగా ఇబ్బందికి గురి చేసాయి.

బహిరంగంగా నాకు క్షమాపణలు చెప్పాలి..

Heroine Simran: They should apologize.. Simran made a public statement..!
Heroine Simran: They should apologize.. Simran made a public statement..!

ఇలాంటి రూమర్స్ వచ్చినప్పుడు వెంటనే స్టాప్ అనే పదం ఉపయోగించి, నేను రూమర్స్ కి చెక్ పెట్టి ఉండాల్సింది. కానీ అప్పట్లో నేను ప్రయత్నించలేదు. నేనే కాదు నాపై ఇలా రూమర్స్ వస్తున్నప్పుడు ఎవరు కూడా వాటిని ఆపే ప్రయత్నం చేయలేదు. నా భావాలను ఎవరు గౌరవించలేదు. ఇలా నా పేరు పై నెగిటివిటీ స్ప్రెడ్ చేశారు. సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఏది సరైనదో దానికి మాత్రమే నేను కట్టుబడి ఉన్నాను. ఇండస్ట్రీపై అవగాహన వ్యక్తుల నుంచి కూడా నేను అదే ఆశిస్తున్నాను. విజయ్ తో కూడా నేను నా ప్రొడక్షన్ హౌస్ లో తొలి సినిమా చేస్తున్నాను అంటూ రూమర్స్ క్రియేట్ చేశారు. నేనెవరితో కూడా ఇప్పుడు పని చేయడానికి సిద్ధంగా లేను. ఎవరైతే నాపై అనవసర పుకార్లు ప్రచారం చేస్తున్నారో.. వారంతా నాకు క్షమాపణలు చెప్పాలి. ఇకనైనా రూమర్స్ ఆపాలి. లేకపోతే కఠిన చర్యలు తప్పవు అంటూ చాలా ఎమోషనల్ అవుతూ పోస్ట్ చేసింది సిమ్రాన్. ఇక సిమ్రాన్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఏది ఏమైనా ఇప్పటివరకు తనపై వచ్చిన రూమర్స్ అన్నింటికీ కూడా ఒక సుదీర్ఘ ప్రకటనతో చెక్ పెట్టింది అని చెప్పవచ్చు.

 

View this post on Instagram

 

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×