BigTV English

Apple for Face: యాపిల్‌తో ఫేస్ ప్యాక్ ఎప్పుడైనా ట్రై చేశారా? తళుక్కుమనే అందం మీ సొంతం

Apple for Face: యాపిల్‌తో ఫేస్ ప్యాక్ ఎప్పుడైనా ట్రై చేశారా? తళుక్కుమనే అందం మీ సొంతం

Homemade Apple Face Packs For Glowing Skin: పోషకాలు అధికంగా ఉండే యాపపిల్‌ తింటే ఆరోగ్యానికి ఎంత మంచిదో మనందరికి తెలుసు. కానీ చర్మ సౌందర్యానికి కూడా యాపిల్ అద్భుతంగా పనిచేస్తుందన్న సంగతి మీకు తెలుసా? అవును యాపిల్ చర్మ సౌందర్యాన్ని పెంచే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మీ అందాన్ని రెట్టింపు చేసే అవసరమైన విటమిన్లు, పోషకాలు ఇందులో పుష్కలంగా లభిస్తాయి. యాపిల్‌లో విటమిన్ సి, విటమిన్ ఎ, జింక్, కాపర్ వంటి గుణాలు పుష్కలంగా లభిస్తాయి. యాపిల్ వృద్ధాప్య సమస్యల నుండి దూరం చేస్తాయి. మీ చర్మం పొడిబారకుండా చేస్తుంది. ముడతలు తగ్గిస్తాయి. ముఖం కాంతి వంతంగా మారుతుంది. యాపిల్‌తో ఫేస్ ప్యాక్ వేసుకోవడం ద్వారా చర్మం మృదువుగా తయారవుతుంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఓసారి యాపిల్‌తో ఈ ఫేస్ ప్యాక్‌లు ట్రై చేయండి.


గ్లోయింగ్ స్కిన్ కోసం యాపిల్, పెరుగు , నిమ్మకాయ ఫేస్ ప్యాక్
ఒక చిన్న యాపిల్‌ను మెత్తగా పేస్ట్ లాగా తయారు చేయండి. అందులో టీ స్పూన్ పెరుగు, నిమ్మకాయ కలపి వాటిని బాగా మిక్స్ చేయండి. ఆ తర్వాత ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల తర్వాత సాధారణ నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే ముఖంపై మొటిమలు, మచ్చలు తొలగిపోతాయి. ముఖం కాంతి వంతంగా మెరుస్తుంది.

రోజ్ వాటర్‌తో యాపిల్ ఫేస్ ప్యాక్
తక్షణ గ్లో కోసం యాపిల్, రోజ్ వాటర్ ఫేస్ ప్యాక్ ట్రై చెయ్యొచ్చు. యాపిల్‌లో యాంటీ ఆక్సీడెంట్లు, యాంటీ మైక్రోబియల్ గుణాలు అధికంగా ఉంటాయి. ఇందుకోసం యాపిల్ గుజ్జులో రెండు టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ కలపి ముఖానికి అప్లై చేయండి. 10-15 నిమిషాల తర్వాత ముఖాన్ని గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకుంటే తక్షణమే మీ స్కిన్ మెరిసేలా చేస్తుంది. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.


Also Read:  బ్రౌన్ రైస్ తింటే నిజంగానే షుగర్ కంట్రోల్‌ చేసుకోవచ్చా..?

యాపిల్, తేనె ఫేస్ ప్యాక్
ఒక చిన్న యాపిల్ గుజ్జులో టీ స్పూన్ తేనె కలిపి ముఖానికి అప్లై చేయండి. ఆ తర్వాత ముఖాన్ని సాధారణ నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే మీ స్కిన్ కాంతివంతంగా మెరుస్తుంది. ముఖంపై  మొటిమలు, మచ్చలు తొలగిపోతాయి.

యాపిల్, అరటి, ఫేస్ ప్యాక్
ఒక చిన్న యాపిల్‌ను మొదట బాయిల్ చేయండి. అందులో ఒక చిన్న అరటి పండును తీసుకుని మెత్తగా పేస్ట్ లాగా తయారు చేయండి. ఈ మిశ్రమంలో టీ స్పూన్ తేనె కలిపి ముఖానికి అప్లై చేయండి. ఆ తర్వాత గోరువెచ్చటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోండి. ఇలా వారానికి ఒకసారి చేస్తే ముఖంపై ముడతలు, మచ్చలు తగ్గిపోతాయి. ముఖం కాంతివంతంగా మెరుస్తుంది.

యాపిల్, పాలు, తేనె ఫేస్ మాస్క్
యాపిల్ గుజ్జులో రెండు టేబుల్ స్పూన్ పాలు, టీ స్పూన్ తేనె కలిపి ముఖానికి అప్లై చేయండి. అరగంట తర్వాత గోరువెచ్చటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే మీ స్కిన్ కాంతివంతంగా మెరుస్తుంది.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

 

Related News

Parenting Tips: పిల్లల అరుపులు ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Big Stories

×