Heroines Favourite food: మనం ఈ ప్రపంచంలో ఏం చేసినా ఎంత కష్టపడినా పొట్టకూటి కోసమే అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇకపోతే ఎంత కష్టపడినా సరే నచ్చిన భోజనం తినకపోతే ఆ జన్మ వృధానే అని చెబుతున్నారు భోజనప్రియలు. ముఖ్యంగా సామాన్యులను మొదలుకొని సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరికి కూడా ఇష్టమైన ఆహారం ఉంటుంది.కానీ కట్టుదిట్టమైన నిర్ణయాల వల్ల కళ్ళముందు తమకు నచ్చిన ఆహారం ఉన్నా సరే తినడానికి సంకోచిస్తూ ఉంటారు. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో ఉండే సెలెబ్రెటీలు అందంగా కనిపించడానికి.. ఫిజిక్ మెయింటైన్ చేయడం కోసం తప్పనిసరిగా డైట్ ఫాలో అవుతారు. అయితే ఎంత డైట్ ఫాలో అయినా నచ్చిన ఫుడ్ కళ్ళ ఎదుట ఉంటే కచ్చితంగా తినాల్సిందే అంటున్నారు మనం స్టార్ హీరోయిన్స్. ముఖ్యంగా మన స్టార్ హీరోయిన్స్ వెరైటీ కాంబినేషన్స్ ట్రై చేసి అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. మరి ఈ హీరోయిన్స్ కి ఇష్టమైన ఆహారం ఏంటో ఇప్పుడు చూద్దాం.
రష్మిక మందన్న..
నేషనల్ క్రష్ గా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక మందన్న(Rashmika mandanna) ‘పుష్ప 2’ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు శంభాజీ శివాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా వస్తున్న ‘ఛావా’ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా ఫిబ్రవరి 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇకపోతే రష్మిక ఫేవరెట్ ఫుడ్ విషయానికి వస్తే.. వెరైటీ ఫుడ్ కాంబినేషన్స్ ప్రయత్నించడం అంటే చాలా ఇష్టమట. అందుకే బిర్యానీ – రసం, పెరుగన్నం – బంగాళదుంప చిప్స్ ,చిప్స్ – నూడుల్స్ వంటివి తరచూ ప్రయత్నిస్తానని చెబుతోంది ఈ ముద్దుగుమ్మ.
జాన్వీ కపూర్..
‘దేవర’ సినిమాతో తెలుగులో భారీ పాపులారిటీ అందుకున్న బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor). ప్రస్తుతం రామ్ చరణ్ (Ram Charan), బుచ్చిబాబు సనా(Bucchibabu sana) కాంబినేషన్లో వస్తున్న ఆర్సి 16 సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈమెకు నత్తల కూర అంటే చాలా ఇష్టమట. అలాగే ఇడ్లీలను చికెన్ కర్రీలో నంజుకొని తినడం అంటే ఇంకా ఇష్టమని తెలిపింది.
సాయి పల్లవి..
సాధారణంగా ఎవరైనా బాబా గుడికి లేక శివాలయానికో వెళితే కచ్చితంగా అక్కడ ఉన్న విభూదిని తీసుకొని నోట్లో వేసుకుంటారు. కానీ సాయి పల్లవికి మాత్రం రోజు విభూది తినే అలవాటు ఉందని తెలిపింది. దానిని ఒక ప్రత్యేకమైన చెట్టుతో తయారు చేస్తారని, అది తింటే ఒక రకమైన అనుభూతి కలుగుతుందని చెబుతోంది.
మృణాల్ ఠాకూర్..
మృణాల్ ఠాకూర్.. (Mrunhal thakur) అన్నంలో వెనీలా ఐస్ క్రీమ్ కలుపుకొని తినడం అంటే చాలా ఇష్టమని చెబుతోంది. అంతేకాదు పిజ్జా – అప్పం, కెచప్ – పైనాపిల్ వంటి కాంబినేషన్లు తనకు ఇష్టమని చెబుతోంది. అంతేకాదు బ్లాక్ కాఫీ – బనానా వంటివి కూడా తింటుందట.
తాప్సీ..
ఏదైనా పర్యాటక ప్రదేశాలకు వెళ్తే.. అక్కడ పాపులర్ అయిన ఒక వెరైటీ వంటకాన్ని తప్పకుండా రిపీట్ చేస్తానని తెలిపింది. అలాగే ఒకసారి చెన్నై వెళ్ళినప్పుడు నూనెలో వేయించిన గొల్లభామలు తిన్నదట. ఇక అప్పటినుంచి ఈ వంటకం తన ఫేవరెట్ అయిపోయిందని తెలిపింది తాప్సి.మొత్తానికైతే ఈ హీరోయిన్స్ వెరైటీ ఫేవరెట్ ఫుడ్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.