
Heroines : పెళ్లికి ముందు శృంగారంపై మనదేశంలో ఎంత పెద్ద చర్చ జరిగిందో. ఇప్పటికీ జరుగుతూనే ఉంది. ఎంతో మంది దీన్ని సపోర్ట్ చేస్తుంటే.. కొంతమంది ఇది మంచి పద్దతి కాదంటూ వ్యతిరేకిస్తున్నారు. ఎవరెన్ని చెప్పినా అది వ్యక్తిగతం. ఒక్కసారి మేజర్ అయిన తరువాత ఎవరి ఇష్టం వారిది. పైగా ఆర్థికంగా సొంత కాళ్లపై నిలబడిన అమ్మాయిలైతే… తమ నిర్ణయాన్ని, ఇష్టాన్ని మరింత బలంగా చెబుతున్నారు. ఇక సినీ హీరోయిన్స్ అయితే చెప్పేదేముంది. అలాంటి వారిలో కొందరు.. ముందుగా ప్రెగ్నెన్సీ తెచ్చుకున్న తరువాతే పెళ్లి చేసుకున్నారు.
అమీ జాక్సన్. బ్రిటన్‌లో పుట్టి పెరిగిన ఈ ఇంగ్లీష్ మోడల్… దక్షిణాది సినిమాలో మంచి హిట్స్ ఇచ్చింది. తమిళ, తెలుగు, కన్నడ భాషల్లో నటించింది. అమీ జాక్సన్.. బాయ్ ఫ్రెండ్‌తో డేటింగ్ చేసి, బిడ్డను కని ఆ తరువాత పెళ్లి చేసుకుంది.
ఇంగ్లీష్ అమ్మాయి కాబట్టే ఆ కల్చర్ అనుకోనక్కర్లేదు. ఇండియన్ సినీ స్టార్స్ కూడా ఈ లిస్టులో ఉన్నారు. అలియాభట్ పెళ్లైన కొన్ని రోజులకే తను ప్రెగ్నెంట్ అని ప్రకటించింది. పెళ్లికి ముందే రణబీర్ కారణంగా తను గర్భం దాల్చిన విషయాన్ని బయటపెట్టింది.
గోవా పిల్ల ఇలియానా కూడా తను తల్లి కాబోతున్నట్టు అనౌన్స్ చేసింది. అమర్ అక్బర్ ఆంటోనీ సినిమా సమయంలో ఇలియానా బాయ్ ఫ్రెండ్‌తో తెగ చక్కర్లు కొట్టింది. ఆ తరువాత ఏమైందో గానీ.. ఆ బంధాన్ని తెంచుకుంది. ఇప్పుడు సడెన్‌గా ప్రెగ్నెంట్ అని చెప్పుకుంది. దీంతో తండ్రి ఎవరు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
హీరోయిన్ నేహా దూపియా కూడా పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయింది. చాలాకాలం అంగద్ బేడీతో డేటింగ్‌లో ఉండడంతో.. రెండు కుటుంబాల వాళ్లు మాట్లాడుకుని ఇద్దరికీ పెళ్లి చేశారు. 2018 మేలో నేహా దూపియాకు పెళ్లైతే.. నవంబర్‌కే బిడ్డకు జన్మనిచ్చింది.
ఇక దియా మీర్జా కూడా పెళ్లికి ముందే ప్రెగ్నెంట్. ఆ తరువాత తను డేటింగ్ చేసిన బాయ్ ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకుంది.