BigTV English

Heroines: ఈ హీరోయిన్లలో సంక్రాంతి అదృష్టవంతులు ఎవరో..?

Heroines: ఈ హీరోయిన్లలో సంక్రాంతి అదృష్టవంతులు ఎవరో..?

Heroines: ఈ సంక్రాంతికి టాలీవుడ్ నుంచి డజనుకు పైగా చిత్రాలు రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి. ఈ సినిమాల ద్వారా చాలామంది హీరోయిన్స్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అయ్యారు. మరి ఆ హీరోయిన్స్ ఎవరు?.. వాళ్లు ఏ సినిమాలో నటిస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..


మహేశ్ బాబు హీరోగా నటిస్తోన్న చిత్రం ‘గుంటూరు కారం’. ఈ సినిమాలో హీరోయిన్స్‌గా శ్రీలీల, మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. ఈ ఇద్దరు హీరోయిన్లకు ప్రస్తుతం బ్లాక్ బస్టర్ హిట్ అవసరం. ఈ సినిమా ఖచ్చితంగా విజయాన్ని అందుకుంటుందనే అంతా భావిస్తున్నారు.

నాగార్జున నటిస్తున్న నా సామిరంగ సినిమాలో ఆషికా రంగనాథ్ హీరోయిన్‌గా నటిస్తోంది. హీరోయిన్‌గా ఈ సినిమాతో సక్సెస్ వస్తే ఆమెకు వరుస ఆఫర్లు రానున్నాయి.


వెంకటేష్ నటిస్తున్న ‘సైంధవ్’. ఈ సినిమాలో శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా హిట్ అయితే ఈమెకు మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది.

తేజా సజ్జ హీరోగా, అమృత అయ్యర్ హీరోయిన్‌గా ‘హనుమాన్’ మూవీలో నటిస్తున్నారు. ఈ హీరోయిన్‌కు ప్రస్తుతం సక్సెస్ చాలా అవసరమని చెప్పవచ్చు.

మరోవైపు రవితేజ నటిస్తోన్న ఈగల్ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ నటిస్తున్నారు. ఈ ఇద్దరు తారలు ఈ సినిమాపైన ఆశలు పెట్టుకున్నారు. అయితే ఈ సినిమా సంక్రాంతి రేస్ నుంచి అధికారికంగా తప్పుకొని.. ఫిబ్రవరి 9న విడుదల కాబోతుంది. మరి ఈ తారలు ఏ స్థాయిలో తమ నటనతో అభిమానులను, ప్రేక్షకులను ఆకట్టుకుంటారో చూడాలి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×