BigTV English

Hina Khan: స్టార్ నటి కుమార్తెకు క్షమాపణలు చెప్పిన హీరోయిన్..

Hina Khan: స్టార్ నటి కుమార్తెకు క్షమాపణలు చెప్పిన హీరోయిన్..

Hina Khan: బాలీవుడ్ యంగ్ హీరోయిన్ హీనా ఖాన్  గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  తెలుగువారికి ఆమె సుపరిచితం కాకపోయినా.. ఈ మధ్యనే ఆమె గురించిన ఒక వార్త సోషల్ మీడియాను షేక్ చేసింది. సీరియల్ నటిగా కెరీర్ మొదలుపెట్టిన ఆమె.. హిందీ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి  మరింత గుర్తింపు తెచ్చుకుంది. ఇకపోతే ఈ మధ్యనే హీనా ఖాన్ రొమ్ము క్యాన్సర్ తో బాధపడుతున్నట్లు అభిమానులకు తెలిపింది.


” నేను స్టేజ్‌ 3 బ్రెస్ట్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్నాను. ఇది సవాలుతో కూడుకున్న సమయం అని తెలుసు..  అయినప్పటికీ నేను చాలా బలంగా ఉన్నాను.. పోరాడుతున్నాను.  ప్రస్తుతం ఈ క్యాన్సర్ కు  చికిత్స తీసుకుంటున్నాను. దీన్నుంచి త్వరగా బయటపడతానని బలంగా నమ్ముతున్నాను” అంటూ రాసుకొచ్చింది. దీంతో ఇంత చిన్న వయస్సులోనే ఆమె ఇలాంటి వ్యాధి బారిన పడడంతో అందరు ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు.

ఇక క్యాన్సర్ ను కూడా లెక్కచేయకుండా హీనా.. ఒక పక్క ట్రీట్ మెంట్ తీసుకుంటూనే ఇంకోపక్క షూటింగ్స్ కు, ఈవెంట్స్ అటెండ్ అవుతుంది.  తాజాగా హీనా ఖాన్ ఒక ఈవెంట్ కు అటెండ్ అయ్యింది. అయితే ఆ ఈవెంట్ కు వెళ్లకూడదని అనుకోని.. డబ్బును వెనక్కి ఇచ్చేద్దామనుకున్న సమయంలో తనకు శక్తి వచ్చిందని, ఆ దేవుడి దయవలన ఆ ఈవెంట్ కు అటెండ్  అయ్యాయని చెప్తూనే.. బాలీవుడ్ స్టార్ నటి నీనా గుప్తా కుమార్తె మసాబాకు హీనా క్షమాపణలు చెప్పుకొచ్చింది. మసాబా ఒక డిజైనర్ అన్న విషయం తెల్సిందే. బాలీవుడ్ లో స్టార్స్ కు ఆమె డిజైనర్ గా వర్క్ చేస్తుంది.


హీనా ఖాన్ వెళ్లే ఈవెంట్ కు కూడా మసాబానే చీరను డిజైన్ చేసింది. అయితే ఆ చీరకు ఉన్న అందాన్ని హీనా పాడుచేసినందుకు ఆమె.. మసాబాను  క్షమించమని కోరింది. “ఇది ఎంత మంచి రోజు.. మీ అందరికీ తెలిసినట్లుగా, నాకు న్యూరోపతిక్ నొప్పి ఉంది. ఇది కొన్ని నిమిషాల కంటే ఎక్కువసేపు నిలబడనివ్వదు. ఈ ఈవెంట్ కు వస్తానని నేను ముందే  డబ్బులు తీసుకున్నాను. చికిత్స తరువాత అది చేయలేనేమో అని డబ్బులు కూడా వెనక్కి ఇచ్చేద్దామనుకున్నాను. కానీ ఏదో ఒకవిధంగా దేవుడు నాకు చాలా బలాన్ని ఇచ్చాడు. అందుకే నేను ఈవెంట్ కు రాగలిగాను. 

ఇక అంతసేపు నేను నిలబడగలగడానికి నా పాదాల కింద మెత్తగా ఉంటే ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది అనిపించింది. అందుకే నేను నా చీర క్రింద ఒక సూపర్ కంఫీబూట్లను ధరించాను. మసాబా గుప్తా.. ఈ అందమైన చీర రూపాన్ని చంపినందుకు నన్ను క్షమించు. కానీ, ఈ చీరపై కొన్ని కిల్లర్ ఫోటోలు మాత్రం దిగాను” అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట  వైరల్ గా మారింది. ఇక ఈ పోస్ట్ చూసిన అభిమానులు నీ మనసు ఎంతో అందమైనది. నువ్వు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం అంటూ  కామెంట్స్ పెడుతున్నారు. 

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×