BigTV English

Allu Arjun Support to Pawan: పవన్ కల్యాణ్‌కే నా సపోర్ట్.. నంద్యాల టూర్‌పై అల్లు అర్జున్ క్లారిటీ.. వీడియో వైరల్!

Allu Arjun Support to Pawan: పవన్ కల్యాణ్‌కే నా సపోర్ట్.. నంద్యాల టూర్‌పై అల్లు అర్జున్ క్లారిటీ.. వీడియో వైరల్!

My Support to Pawan Kalyan Said By Allu Arjun: రెండు తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ స్టార్ట్ అయింది. ప్రముఖ సినీ, రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కును సమర్థవంతంగా వినియోగించుకుంటున్నారు. ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ పోలింగ్ జరుగుతుంది. అలాగే ఇటు తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలకి పోలింగ్ జరుగుతుంది. ఈ క్రమంలో తమ ఓటేసేందుకు ప్రముఖ సినీ సెలబ్రెటీలు క్యూ కట్టారు. అందులో భాగంగా తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హైదరాబాద్‌లోని పోలింగ్ కేంద్రంలో తన ఓటును వినియోగించుకున్నారు.


ఇక ఓటు వినియోగించుకున్న అనంతరం మీడియాతో ముచ్చటించారు. ఇందులో భాగంగా మీడియా వారు అడిగిన కొన్ని ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు చెప్పాడు. ఇటీవల ఏపీలోని నంద్యాల నియోజకవర్గానికి అల్లు అర్జున్ తన భార్య స్నేహాతో కలిసి వెళ్లారు. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతు పలికారు. ఇక శిల్పా రవిచంద్ర వైసీపీ ఎమ్మెల్యే కావడంతో బన్నీపై మెగా ఫ్యాన్స్ ట్రోల్స్, విమర్శలు చేశారు. ఈ విషయంపై మీడియా వారు బన్నీని అడిగారు.

దీనిపై బన్నీ క్లారిటీ ఇచ్చాడు. ‘‘ నాకు అఫీషియల్‌గా ఏ పార్టీతో సంబంధం లేదు. నేను అన్నీ పార్టీలకు న్యూట్రల్ గానే ఉంటాను. నా అనే వ్యక్తులు ఏ పార్టీలో ఉన్నా పార్టీతో సంబంధం లేకుండా నేను వ్యక్తిగతంగా వాళ్లకి నా సపోర్ట్ ఇస్తాను. అది నా మావయ్య పవన్ కల్యాన్ గారు.


Also Read: పవన్ కు షాక్ ఇచ్చిన అల్లు అర్జున్.. వైసీపీ అభ్యర్థికి మద్దతు.. ?

ఆయనకి నా సపోర్ట్ ఎప్పటికీ ఉంటుంది. అలాగే నా స్నేహితుడు నంద్యాల రవి కావచ్చు. లేదంటే నా మామయ్య చంద్రశేఖర్ రెడ్డి కావచ్చు. అలాగే రేపు బన్నీ వాసు కూడా కావచ్చు. పార్టీకి సంబంధం లేకుండా నేను వారికి మద్దతు ఇస్తాను. ఇక నంద్యాల టూర్ విషయానికొస్తే.. రవి నాకు గత 15 ఏళ్లుగా తెలుసు. మేము మంచి ఫ్రెండ్స్.

ఎప్పట్నుంచో నేనొక మాట అనేవాడిని.. బ్రదర్ మీరు ఎప్పుడైనా పాలిటిక్స్ లోకి వస్తే.. కచ్చితంగా నేను మీ ఊరు వచ్చి మీకు సపోర్ట్ చేస్తాను అని ఎప్పుడూ అనే వాడిని. నేను మాట ఇచ్చాను. అయితే 2019 టైంలో రవి పాలిటిక్స్‌లోకి వచ్చిన తర్వాత నేను రాలేకపోయాను. కేవలం ట్వీట్ ద్వారా మాత్రమే సపోర్ట్ చేశాను. అయితే ఈ 2024కి వచ్చేసరికి అప్పట్నుంచి నా మనసులో ఉంది. అరే ఇలా మాట ఇచ్చాం కదా.. కచ్చితంగా వచ్చి ఒక్కసారి అయినా కనపడాలి అని నా మనసులో ఉంది.

Also Read: Janasena protest in Bhimavaram: అర్థరాత్రి జనసేన ఆందోళన, ఈవీఎంలు ప్రైవేటు కారులో తరలింపుపై

అందువల్ల ఈ సారి ఎలక్షన్‌లో ఆయన నిల్చున్నాడని తెలిసి నేనే అతడికి ఫోన్ చేసి బ్రదర్ నేను ఇలా మాట ఇచ్చాను కదా.. నేను వద్దామనుకుంటున్నాను అని చెప్పాను. అందువల్లనే నేను, నా భార్య కలిసి పర్సనల్‌గా వచ్చి ఆయన్ను కలిసి బెస్ట్ విషేస్ చెప్పేసి వచ్చేశాను. అయితే భవిష్యత్‌లో మీరు రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందా అని అడిగిన ప్రశ్నకు నవ్వుతూ.. లేదు లేదు థాంక్యూ’’ అంటూ వెళ్లిపోయారు.

Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×