BigTV English
Advertisement

Ranbir Kapoor’s Ramayanam: హైప్ పెంచేస్తున్న ‘రామాయణం’.. బడ్జెట్ ఎంతో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..?

Ranbir Kapoor’s Ramayanam: హైప్ పెంచేస్తున్న ‘రామాయణం’.. బడ్జెట్ ఎంతో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..?

Ranbir Kapoor Ramayanam Budget: బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ గతేడాది ‘యానిమల్’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్‌ అందుకున్నాడు. ఈ మూవీలో మాస్ అండ్ రగ్గడ్ లుక్‌లో కనిపించి మాస్ సినీ ప్రియులకు ఫుల్ ట్రీట్ అందించాడు. ముఖ్యంగా ఇందులోని యాక్షన్ అండ్ రొమాంటిక్ సీన్లకు యూత్ బాగా అట్రాక్ట్ అయ్యారు. ఎన్నో అంచనాలతో తెరకెక్కిన ఈ చిత్రం అంతే గ్రాండ్‌గా బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. దాదాపు రూ.900 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి దుమ్ము దులిపేసింది.


ఇక ఈ మూవీ తర్వాత రణబీర్ ఎలాంటి సినిమా చేస్తాడు అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో అతడు సరికొత్త జానర్‌లోకి అడుగుపెట్టాడు. ఇందులో భాగంగానే ‘రామయణం’ మూవీ చేస్తున్నాడు. ఇప్పటికే ‘రామాయణం’ పేరుతో ఎన్నెన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించాయి. అయితే ఒక్కొక్క దర్శకుడి ప్రెజెంటేషన్ ఒక్కోలా ఉంటుంది.

ఇప్పుడు ఇప్పుడు రణ్‌బీర్ కపూర్ నటిస్తున్న ఈ ‘రామాయణం’ మూవీపైనే అందరి కళ్లు ఉన్నాయి. ఈ చిత్రాన్ని ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు నితిశ్ తివారీ భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నాడు. ఇందులో రాముడి పాత్రలో రణ్‌బీర్ కపూర్ నటిస్తుండగా.. సీతాదేవి పాత్రలో హైబ్రీడ్ పిల్ల సాయి పల్లవి నటిస్తుంది. అలాగే రావణాసురుడి పాత్రలో కేజీఎఫ్ హీరో యష్ నటిస్తున్నట్లు తెలుస్తోంది.


Also Read: బ్రేకింగ్: ‘రామాయణం’ మూవీకి నిర్మాతగా రాఖీభాయ్ యష్.. నమిత్ మల్హోత్రాతో కలిసి..

అలాగే హనుమంతుడిగా సన్నీడియోల్, కైకేయిగా లారా దత్త, శూర్పణకగా రకుల్ ప్రీత్ సింగ్ వంటి స్టార్ నటీ నటులు ఇందులో భాగం కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన పలు ఫొటోలు సోషల్ మీడియాలో లీకై షేక్ చేశాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ మూవీ మొత్తం మూడు పార్టులుగా తెరెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఈ మూవీ బడ్జెట్‌కు సంబంధించి క్రేజీ న్యూస్ సినీ ప్రియుల్ని ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ చిత్రాన్ని దాదాపు రూ.835 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.

దీంతో ఈ విషయం తెలిసి సినీ ప్రియులు నోరెళ్లబెడుతున్నారు. ఈ సినిమా ఏకంగా రూ.835 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతుందంటే అది మామూలు విషయం కాదు. ఈ మూవీ ఫస్ట్ పార్ట్‌కే ఇన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు. దీని బట్టి చూస్తే.. ఈ చిత్రాన్ని ఏ రేంజ్‌లో రూపొందిస్తున్నారో అర్థం అవుతుంది. దంగల్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని తెరకెక్కించిన నితీశ్ తివారి ఈ చిత్రాన్ని మరి ఏ లెవెల్లో ప్రెజెంటేషన్ చేసి చూపిస్తాడో మరికొద్ది రోజులు వేచి చూడాలి.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×