BigTV English

Director Bobby : డైరెక్టర్ బాబీ లవ్ స్టోరీ ఎలా మొదలైందంటే..? ఇన్ని ట్విస్టులా…

Director Bobby : డైరెక్టర్ బాబీ లవ్ స్టోరీ ఎలా మొదలైందంటే..? ఇన్ని ట్విస్టులా…

Director Bobby : టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ బావి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. సిటీ లోకి అడుగుపెట్టిన కొద్ది కాలంలోనే ఈయన స్టార్ హీరోలతో సినిమాలు తెరక్కించారు.. గ తేడాది చిరంజీవితో వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న ఈ డైరెక్టర్ సంక్రాంతి కూడా మరో హిట్ సినిమాను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. సంక్రాంతి కానుకగా వచ్చిన బాలయ్య బ్లాక్ బస్టర్ మూవీ డాకు మహారాజు సినిమాతో భారీ ప్రభంజనాన్ని సృష్టించారు. ఒకవైపు మిక్స్డ్ టాక్ వినిపిస్తున్న కూడా మరోవైపు ఈ సినిమా కలెక్షన్స్ బాగానే రాబట్టడంతో సినిమా విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఈ డైరెక్టర్ ఏ హీరోతో సినిమా చేస్తారా అనే వార్త చర్చినీయంశంగా మారింది. ఇదిలా ఉండదా తాజాగా ఈయన గురించి మరో ఇంటరెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. బాబీ నిజంగా ఇలాంటి వాడా అని కొందరు కామెంట్లు కూడా చేస్తున్నారు. అసలు మ్యాటర్ ఏంటో ఇప్పుడు ఇది తెలుసుకుందాం..


ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్లలో బాబీ పేరు కూడా వినిపిస్తుంది. రెండేళ్ల కిందట ‘వాల్తేరు వీరయ్య’తో బాబీ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. తన కెరీర్లో ఒక్క ‘సర్దార్ గబ్బర్ సింగ్’ మినహా అన్నీ సక్సెస్ ఫుల్ సినిమాలే. ఇప్పుడీ స్థాయిలో ఉన్న బాబీ.. ఒకప్పుడు సినీ రంగంలోకి అడుగు పెట్టినపుడు అందరిలాగా ఇబ్బంది పడ్డవాడే.. అయితే ఎవరైనా లైఫ్ లో సెటిల్ అయిన తర్వాత పెళ్లి వైపు అడుగులు వేస్తారు. కానీ డైరెక్టర్ బాబి మాత్రం కష్టాలు పడుతున్న సమయంలోనే పెళ్లి చేసుకున్నారని తెలుస్తుంది.. చెస్ ప్లేయర్ హారిక సోదరి అయిన అనూష.. బాబీ ఘోస్ట్ రైటర్‌గా ఉన్న టైంలోనే ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ విషయాన్ని డైరెక్టర్ ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు.. ఆ ఇంటర్వ్యూ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. అసలేం అన్నాడో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

డైరెక్టర్ బాబీ లవ్ స్టోరీ.. 


టాలీవుడ్ ఇన్ డైరెక్టర్ బాబి గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన లవ్ స్టోరీ ఎలా మొదలైంది అన్న విషయాలని బయట పెట్టాడు.. తన లవ్ స్టోరీ గురించి, తన భార్య గొప్పదనం గురించి బాబీ మాట్లాడాడు.. నేను చాలా అదృష్టంగా ఫీల్ అయ్యేది నా అంత అదృష్టవంతుడు లేడు అని అనుకునేది ఒక్క నా పెళ్లి విషయంలోనే అని బావి అన్నారు. తన భర్త ఎలాంటి సినిమాలు తీస్తాడో.. ఏం చేస్తాడో తను సీరియస్‌గా తీసుకోదు. స్కూల్ డేస్‌లోనే నేను తనను ప్రేమించాను. మా ఇద్దరినీ కలిపింది కేవలం వాటర్ బాటిలే అని సరదాగా చెప్పారు. వాళ్లది పెద్ద ఫ్యామిలీ అయినా.. అనూష నన్ను ప్రేమించిందని, ఎవరేమనుకున్నా పర్వాలేదని నాకిచ్చి పెళ్లి చేశారు. అప్పటికి నేను స్టార్ డైరెక్టర్ కాదు. కనీసం రైటర్‌గా నాకు సోలో కార్డ్ కూడా పడలేదు. ఘోస్ట్ రైటర్‌నే. అందరూ నన్ను నమ్మారు. అది నా అదృష్టం అనిపిస్తుంది. మేము పెళ్లయిన కొత్తలో రెంట్ కట్టుకుంటూ.. జీవితాన్ని ఎలా సాగించాలని ఆలోచిస్తూ ఉన్నాం అలాంటి జీవితంలోకి తెలుగు ఇండస్ట్రీ వెలుగులు నింపింది. స్టార్ ఇమేజ్ ని అందుకునే రేంజ్కి వెతకడానికి నాకు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చింది ఒక్క మాటలో చెప్పాలంటే మరో అమ్మ తెలుగు ఇండస్ట్రీ అని బావి ఆ ఇంటర్వ్యూలో తెలిపారు. తన భార్యపై ప్రశంసలు కురిపించారు బాబి ఈ వీడియో వైరల్ అవ్వడంతో.. భార్యపై డైరెక్టర్ గారికి ఎంత ప్రేమ అని ఆయన ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు..

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×