Sreeleela : టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీలీల గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే మంచి టాక్ ను సొంతం చేసుకుంది. అమెరికాలో పుట్టిన శ్రీలీల డాక్టర్ చదువుతుండగానే సినిమాల్లోకి వచ్చేసింది. తొలి సినిమాతోనే తెలుగు కుర్రకారు మనసులు దోచుకున్న ఈ చిన్నది. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కొన్ని నెలల్లోనే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయ్యింది. వరుసగా సినిమాలు చేస్తూనే వచ్చింది.
అంతేకాదు.. స్టార్ హీరోల అందరి సరసన నటించి మంచి టాక్ ను సొంతం చేసుకుంది. అయితే ఇప్పటివరకు ఎన్ని సినిమాలు చేసిన అన్ని కూడా స్టార్ హీరోలతోనే కావడం విశేషం.. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కొద్ది కాలంలోనే స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. దాంతో పాటుగా రెమ్యూనరేషన్ ను కూడా పెంచేసింది. అయితే ఈ మధ్య ప్లాపు సినిమాలు ఎక్కువ అవ్వడంతో రెమ్యూనరేషన్ ను పెంచేసారు. ఇప్పుడు రెమ్యూనరేషన్ విషయం షాకింగ్ నిర్ణయం తీసుకుంది.
రెమ్యూనరేషన్ తగ్గించుకున్న శ్రీలీల..?
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటుంది పోయింది. అయితే ఇండస్ట్రీ లోకి ఎంటర్ ఇచ్చిన కొద్దికాలంలోనే స్టార్ హీరోలు సినిమాలలో నటించి మంచి గుర్తింపును తెచ్చుకుంది. అయితే ఈమె ఖాతాలో అనుకున్న హిట్ సినిమాలు పడలేదు. కానీ సినిమాలు మాత్రం వరుసగా ఆమె తలుపు తడుతున్నాయి. ఆఫర్స్ ఎక్కువగా రావడంతో రెమ్యూనరేషన్ని కూడా భారీగానే పెంచేసింది.. ప్రస్తుతం ఒక్కో సినిమాకు 3 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. డిజాస్టర్లతో ఢీలా పడిపోయింది. ప్రస్తుతం తెలుగులో రెండు మూడు సినిమాలు చేస్తున్నా తన మీదున్న అన్‌లక్కీ హీరోయిన్ అనే ముద్ర చెరిపేసుకోవాలని అనుకుంటోదట.. ఈ నేపథ్యంలోనే వరుస ఆఫర్లు దక్కించుకునే ప్రయత్నంలో రెమ్యునరేషన్ తగ్గించుకుందని టాక్ వినిపిస్తోంది. ‘రాబిన్ హుడ్’ మూవీతో పాటు ‘పుష్ప 2’లో ప్రత్యేక గీతం కోసం రూ.3కోట్ల వరకు తీసుకుందట.. అయితే ఇప్పుడు ఆఫర్స్ తగ్గడంతో ఆమె రెమ్యూనిరేషన్ ని సగానికి చేస్తుందని తెలుస్తుంది. ప్రస్తుతం ఈమె కోటి 75 లక్షలు రెమ్యూనిరేషన్ ని తీసుకోబోతున్నట్లు సమాచారం.. మరి ఇప్పటికైన శ్రీలీలకు భారీ ఆఫర్స్ వస్తాయేమో చూడాలి..
శ్రీలీల సినిమాలు..
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకేక్కించిన పెళ్లి సందడి మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైంది. ఆ మూవీ హిట్ అవ్వడంతో ఆమె క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. సినిమాతోనే స్టార్ హీరోయిన్ రేంజ్ లో పాపులర్ తిని సొంతం చేస్తుంది. ఆరు నెలలు తిరగకముందు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయింది. ధమాకా, గుంటూరు కారం, స్కంద, భగవంత్ కేసరి, ఆదికేశవ, ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్, రాబిన్‌హుడ్ చిత్రాల్లో నటించింది. కెరీర్ తొలినాళ్లలో రెండు మూడు హిట్లు కొట్టిన ఈ బ్యూటీ ఆ తర్వాత వరుస ప్లాఫులతో వెనకబడిపోయింది.. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సరసన ‘ఉస్తాద్ భగత్‌సింగ్’లో నటిస్తోన్న శ్రీలీల తెలుగులో మంచి హిట్ కోసం ఎదురుచూస్తోంది. అలాగే మాస్ మహరాజ్ రవితేజతో ‘మాస్ జాతర’, అఖిల్ అక్కినేనితో ‘లెనిన్’లో నటిస్తోంది.. తెలుగు తో పాటు తమిళ్లో కూడా పలు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. మరోవైపు బాలీవుడ్ లో తన సత్తాను చాటేందుకు ప్రయత్నాలు చేస్తుంది.. మరి ఈ సినిమాల్లో ఏ ఒక్కటి అయినా కూడా ఆమె లైఫ్ టర్న్ అవుతుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి..