OTT Movie : థియేటర్లలో సందడి చేసిన ఒక కన్నడ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి అడుగుపెట్టింది. ఈ మూవీ స్టోరీతో పాటు, క్లైమాక్స్ సీన్ కూడా అదిరిపోతుంది. ఒక సీరియల్ కిల్లర్ చుట్టూ స్టోరీ నడుస్తుంది. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ఊహించని మలుపులు తీసుకుంటుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..
స్టోరీలోకి వెళితే
విక్రమ్ అనే ఒక జర్నలిస్ట్ మంగళూరులో 15 సంవత్సరాల క్రితం జరిగిన, ఒక భయంకరమైన కేసుకు సంబంధించిన రహస్యాన్ని ఛేదించడానికి ప్రయత్నిస్తాడు. విక్రమ్ ఈ కేసును పరిశోధిస్తూ దిమ్మతిరిగే రహస్యాలను బయటపెడతాడు. 15 సంవత్సరాల క్రితం ఒక అపరిచితుడు మంగళూరులోని సెయింట్ మేరీస్ అనాథాశ్రమానికి ఆశ్రయం కోరుతూ కొంతమంది పిల్లలను తీసుకొస్తాడు. సిస్టర్ మొదట్లో భయపడినప్పటికీ, ఆ పిల్లలను ఆశ్రమంలో చేర్చుకోవడానికి అంగీకరిస్తుంది. కొన్ని రోజుల్లోనే అనాథాశ్రమంలోని పిల్లలందరూ ఫుడ్ పాయిజనింగ్ కారణంగా చనిపోతారు. తరువాత సిస్టర్ కూడా అరెస్ట్ అవుతుంది. ఇది జరిగిన 15 సంవత్సరాల తరువాత స్టోరీ బెంగళూరుకు మారుతుంది. అక్కడ నగరంలో వరుస హత్యలతో ప్రజలు భయాందోళనలు చెందుతారు. ఈ వరుస హత్యలను పరిశోధించడానికి ఒక ప్రత్యేక పోలీస్ అధికారి అజాజ్ మాలిక్ ను నియమిస్తారు.
మరోవైపు దర్యాప్తు జరుగుతున్నప్పుడు జర్నలిస్ట్ విక్రమ్ తన తల్లిదండ్రులను కోల్పోతాడు. అందువల్ల ఇతను మద్యానికి బానిస అవుతాడు. అయితే అతని సోదరి అతనికి మద్యం మాన్పించి తిరిగి పనిలో చేరడానికి సహాయం చేస్తుంది. కానీ కొన్ని రోజుల్లోనే, విక్రమ్ చెల్లి కూడా చనిపోవడంతో అతను మానసికంగా క్రుంగిపోతాడు. ఈ కేసును విక్రమ్ లోతుగా పరిశీలిస్తున్నప్పుడు, బెంగళూరులో జరిగిన వరుస హత్యలకు, మంగళూరులో జరిగిన 15 ఏళ్ల నాటి అనాథాశ్రమ కేసుకు మధ్య ఉన్న సంబంధాన్ని అతను కనిపెడతాడు. సినిమా ముందుకు సాగుతున్న కొద్దీ విక్రమ్, అజాజ్ ఈ హత్యలను చేస్తున్న వ్యక్తిని కనిపెట్టే ప్రయత్నం చేస్తుంటారు. చివరికి వీళ్ళు కిల్లర్ ని పట్టుకుంటారా ? అతడు వరుసగా హత్యలు ఎందుకు చేస్తున్నాడు ? ఆశ్రమానికి, ఈ హత్యలకు ఉన్న సంబంధం ఏమిటి ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ సినిమాని మిస్ కాకుండా చూడండి.
Read Also : అమెరికాలో సెటిల్ కావాలనుకునే ఫ్యామిలీ… సుద్దపూసలు చూడాల్సిన డార్క్ కామెడీ సిరీస్
సన్ యన్ ఎక్స్ టి (Sun NXT) లో
ఈ పారాసైకలాజికల్ థ్రిల్లర్ మూవీ పేరు ‘నిమిత్త మాత్ర’ (Nimitta Matra). 2025లో విడుదలైన ఈ కన్నడ సినిమాకి రోషన్ డి’సోజా దర్శకత్వం వహించారు. ఇందులో సంగీత రాజీవ్, పూర్ణచంద్ర మైసూరు, అరవింద్ కుప్లికర్, చేతన్ రాయ్ మాణి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా మంగళూరులో 15 సంవత్సరాల క్రితం జరిగిన ఒక భయంకరమైన సంఘటన చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమా 2025 ఫిబ్రవరి 14న థియేటర్లలో విడుదలైంది. కానీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఇది మే 2025 30 నుంచి Sun NXT ఓటీటీ ప్లాట్ ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.