OTT Movie : మిగతా సినిమాలతో పోల్చుకుంటే, హారర్ సినిమాలు ఇచ్చే ఎంటర్టైన్మెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇవి ప్రేక్షకులను భయపెట్టిస్తూ ఎంటర్టైన్ చేస్తుంటాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా వెన్నులో వణుకు పుట్టిస్తుంది. ఇందులో హీరో సిద్ధార్థ్ ప్రధాన పాత్రలో నటించాడు. విడుదల అయిన అన్ని భాషల్లో ఈ సినిమాకి ప్రశంసలు వచ్చాయి. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..
స్టోరీలోకి వెళితే
ఈ సినిమా స్టోరీ 1934 లో ఒక చైనీస్ తల్లి, ఆమె కూతురు కలిసి జీవిస్తున్న సీన్ తో ప్రారంభమవుతుంది. వీళ్ళు చాలా సంతోషంగా ఉంటారు. అయితే ఈ ఆనందం ఒక విషాదకర సంఘటనతో ముగుస్తుంది. తరువాత స్టోరీ ప్రజెంట్ లోకి వస్తుంది. 2016 లో డాక్టర్ కృష్ణకుమార్ (సిద్ధార్థ్), ఒక విజయవంతమైన న్యూరోసర్జన్ గా పేరు తెచ్చుకుంటాడు. తన భార్య లక్ష్మి (ఆండ్రియా జెర్మియా)తో హిమాచల్ ప్రదేశ్‌లోని రోసినా వ్యాలీలోని ఒక అందమైన ఇంట్లో నివసిస్తుంటాడు. వీళ్ళ జీవితం సంతోషంగా సాగుతుండగా, పక్క ఇంట్లో ఒక కుటుంబం కొత్తగా దిగుతుంది. ఈ ఇల్లు 80 సంవత్సరాల క్రితం ఆ చైనీస్ తల్లి-కూతురుకు చెందినది. ఈ కుటుంబంలోని జెన్నిఫర్ అనే యుక్తవయసు అమ్మాయికి తన తల్లి చిన్నప్పుడే చనిపోవడంతో, ఆమె తన సవతి తల్లితో కలసి ఉంటోంది. అయితే ఆమెతో తరచూ గొడవ పడుతూ ఉంటుంది. జెన్నీ, కృష్ణకుమార్ ని ఇష్టపడుతూ ఉంటుంది. ఒక రోజు జెన్నీ రహస్యంగా సిగరెట్ తాగడానికి బయటకు వెళ్లినప్పుడు, ఒక చనిపోయిన వ్యక్తికి చెందిన వస్తువును తెలీక తీసుకుంటుంది. దీనితో భయానక పరానార్మల్ సంఘటనలు ప్రారంభమవుతాయి.
జెన్నీ ఇంట్లో పురాతన ఆత్మలు ఆవహించడంతో, ఆమె ప్రవర్తన వింతగా మారుతుంది. ఆమెలో దెయ్యం ఆవహించబడినట్లు అనుమానిస్తారు. ఈ సమస్యను పరిష్కరించడానికి, జెన్నీ కుటుంబం ఒక ఎక్సార్సిస్ట్ అయిన జోషువాని సంప్రదిస్తుంది. అయితే ఎక్సార్సిజం సమయంలో ఆ దెయ్యాన్ని ఎదుర్కొని జోషువా కోమాలోకి వెళ్తాడు. కృష్ణకుమార్ కూడా వీళ్ళకు సాయం చేస్తాడు. ఈ సంఘటనల వెనుక ఉన్న నిజాన్ని తెలుసుకోవడానికి, కృష్ణకుమార్ ఒక వృద్ధ మహిళను కలుస్తాడు. ఆమె 80 సంవత్సరాల క్రితం ఆ ఇంట్లో జరిగిన భయంకరమైన సంఘటనల గురించి చెప్తుంది. చివరికి ఆ ఇంట్లో జరిగిన ఆ సంఘటనలు ఏమిటి ? జెన్నీని ఆవహించిన దెయ్యం ఎవరు ? ఈ దుష్ట శక్తి అంతం అవుతుందా ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ తమిళ హారర్ సినిమాను మిస్ కాకుండా చూడండి.
Read Also : మెజీషియన్ పేరుతో హత్యలు… ఈ తమిళ మర్డర్ మిస్టరీని అస్సలు మిస్ చేయొద్దు
యూట్యూబ్ (Youtube) లో
ఈ తమిళ హారర్ మూవీ పేరు ‘అవల్’ (Aval). 2017 లో వచ్చిన ఈ మూవీకి మిలింద్ రౌ దర్శకత్వం వహించారు. ఇందులో సిద్ధార్థ్, ఆండ్రియా జెర్మియా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా తమిళంలో (అవల్), హిందీలో (ది హౌస్ నెక్స్ట్ డోర్), తెలుగు (గృహం) పేరుతో విడుదలైంది. ఇందులో ప్రతీకారం తీర్చుకునే ఆత్మలు, భయంకరమైన సంఘటనలు, ఊహించని మలుపులు ఉన్నాయి. ఈ మూవీ యూట్యూబ్ (Youtube) లో స్ట్రీమింగ్ అవుతోంది.