
Hrithik Roshan latest news(Bollywood celebrity news) : సినీ సెలబ్రిటీలలోని కపుల్స్‌ను చూసి వీళ్లలాగా ఉండాలి అనిపించడం కంటే వీరిలాగా వెంటనే విడిపోకూడదు అనే ఆలోచన ప్రేక్షకులలో మొదలయ్యింది. విడాకులు అనేవి ఎక్కడైనా కామన్‌గా జరుగుతున్నదే. కానీ గత కొన్నేళ్లలో సినీ పరిశ్రమలో జరుగుతున్న విడాకుల సంఖ్య మాత్రం విపరీతంగా పెరిగిపోయింది. కొందరు కపుల్స్ విడాకుల తర్వాత వేరే పార్ట్‌నర్స్‌ను కూడా ఎంపిక చేసుకొని మళ్లీ పెళ్లీ చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు. తాజాగా ఆ లిస్ట్‌లోకి బాలీవుడ్ హ్యాండ్‌సమ్ హీరో కూడా జాయిన్ అయ్యాడు.
ప్రస్తుతం బాలీవుడ్‌లో ఉన్న మోస్ట్ క్రేజీ కపుల్స్‌లో హృతిక్ రోషన్, సభా ఆజాద్ కూడా ఒకరు. ఈ కపుల్ ఎక్కువగా పార్టీలలో, డిన్నర్ డేట్స్‌లలో కనిపిస్తూ.. అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. మీడియా ముందు తమ రిలేషన్‌షిప్‌ను పెట్టడానికి వీరు ఎక్కువగా ఆలోచించలేదు. అంతే కాకుండా వీరికి సంబంధించిన కపుల్ ఫోటోలను కూడా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే ఉంటారు. అంతే కాకుండా ఆ పోస్ట్‌లకు పెట్టే క్యాప్షన్స్‌తో ఫ్యాన్స్ చేత కపుల్ గోల్స్ అంటే ఇలా ఉండాలి అనిపించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.
ముందుగా సుజేన్ ఖాన్ అనే ఫ్యాషన్ డిజైనర్‌ను పెళ్లి చేసుకున్న హృతిక్ రోషన్.. భారీ భరణం ఇచ్చి తనతో విడాకులు చేసుకున్నాడు. ఆ తర్వాత కొంతకాలానికే సబా అనే నటితో రిలేషన్‌షిప్‌ను ప్రారంభించాడు. విడాకుల తర్వాత తమ కొత్త పార్ట్‌నర్స్‌తో హృతిక్, సుజేన్ పార్టీ కూడా చేసుకున్నారు. అయితే సబాపై తనకు ఉన్న ప్రేమను పెళ్లిగా మార్చాలని అనుకుంటున్నాడట ఈ హీరో. దీనికి రోషన్స్ ఫ్యామిలీ కూడా సమ్మతించిందని బాలీవుడ్ వర్గాల సమాచారం. అందుకే సబా.. రోషన్స్ ఫ్యామిలీ ఫంక్షన్స్‌లో కూడా పాల్గొనడం మొదలుపెట్టింది.
బాలీవుడ్ వర్గాల్లో హృతిక్, సబా పెళ్లి గురించి వార్తలు వైరల్ అవుతున్నా.. ఈ ఇద్దరు నటీనటులు కానీ, వారి కుటుంబ సభ్యులు కానీ దీనిపై ఏ విధంగా స్పందించలేదు. ప్రస్తుతం జరుగుతున్న చాలా బాలీవుడ్ పెళ్లిళ్ల లాగానే వీరిది కూడా కేవలం సన్నిహితుల మధ్య జరిగే అవకాశం ఉందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇప్పటికే వీరికి ఒకరిపై ఒకరికి ఎంత ప్రేమ ఉందో సోషల్ మీడియాలో పలుమార్లు బయటపెట్టిన ఈ కపుల్.. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అనే వార్త హృతిక్ ఫ్యాన్స్‌కు సంతోషాన్ని కలిగిస్తోంది.