BigTV English

BCCI New Rules : క్రికెటర్ల రిటైర్‌మెంట్ విషయంలో బీసీసీఐ కొత్త రూల్స్..

BCCI New Rules : క్రికెటర్ల రిటైర్‌మెంట్ విషయంలో బీసీసీఐ కొత్త రూల్స్..
BCCI New Rules


BCCI New Rules : ఒక్కొక్కసారి క్రికెటర్స్ ఇచ్చే రిటైర్‌మెంట్ స్టేట్‌మెంట్స్.. ఫ్యాన్స్‌ను ఆశ్చర్యపరుస్తాయి. అంతా బాగానే ఉంది అనుకుంటున్న క్రమంలో రిటైర్‌మెంట్ ప్రకటించిన క్రికెటర్లు ఎంతోమంది ఉన్నారు. అంతే కాకుండా చిన్న వయసులో కూడా క్రికెట్ నుండి రిటైర్ అవుతున్నామంటూ ప్రకటించిన ఆటగాళ్లు పదుల సంఖ్యలో ఉన్నారు. అందుకే క్రికెటర్లు రిటైర్‌మెంట్ ప్రకటించే విషయంలో ఇండియన్ బోర్డ్ ఒక నిర్ణయం తీసుకోనుంది. కొత్త రూల్స్‌ను అందుబాటులోకి తీసుకురానుంది.

ముందస్తుగా నిర్ణయించబడిన క్రికెటర్ల రిటైర్‌మెంట్ విషయంలో కొత్త పాలిసీని అందుబాటులోకి తీసుకురానున్నట్టు ఇండియన్ బోర్డ్ సెక్రటరీ జై షా ప్రకటించారు. ఇప్పటికే ఆఫీస్ ఉద్యోగులు పాలిసీని సిద్ధం చేశారని, దానిని అపెక్స్ కౌన్సిల్ ముందు పెట్టామని అన్నారు. నెలరోజుల్లో ఈ పాలిసీపై ఒక క్లారిటీ వస్తుందని కూడా తెలిపారు. రిటైర్‌మెంట్ గురించి నిర్ణయించుకున్న తర్వాత క్రికెటర్లకు కూల్ డౌన్ పీరియడ్‌ను అందించే విధంగా పాలిసీ ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.


క్రికెటర్లు రిటైర్‌మెంట్ గురించి నిర్ణయం తీసుకున్న తర్వాత ఓవర్సీస్ లీగ్స్‌లో ఆడడానికి ముందు వారికి కొంత సమాయాన్మి కేటాయించడమే కూల్ డౌన్ పీరియడ్. చివరికి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నుండి రిటైర్ అవుతున్న వారికి కూడా ఈ కూల్ డౌన్ పీరియడ్ అనేది వర్తిస్తుందని సమాచారం. ఇప్పటికే పలువురు క్రికెటర్లు రిటైర్‌మెంట్ ప్రకటించిన వెంటనే టీ20 లాంటి లీగ్స్‌లో పాల్గొన్నారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా ఉండడం కోసమే ఈ కూల్ డౌన్ పీరియడ్‌ను అమలులోకి తీసుకురానున్నారు.

క్రికెటర్ల రిటైర్‌మెంట్‌తో బీసీసీఐ మరికొన్ని మార్పులకు కూడా సిద్ధమవుతోంది. ఉమెన్ క్రికెట్ టీమ్‌కు సపోర్టింగ్ స్టాఫ్ కావాలంటూ ప్రకటన జారీ చేసింది. సపోర్టింగ్ స్టాఫ్‌ను నియమించిన తర్వాతే కోచ్‌ను నియమించాలని అనుకుంటోంది. ఇక ఏషియన్ గేమ్స్‌లో కూడా టీమిండియా తరపున మెన్స్ టీమ్, ఉమెన్స్ టీమ్.. రెండూ పాల్గొంటాయని తెలిపింది. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌లో కూడా పలు మార్పులు జరగనున్నాయి. సయ్యద్ ముష్తాఖ్ అలీ ట్రాఫీ, ఐపీఎల్.. ఈ రెండిటిలో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్స్ వేర్వేరుగా ఉంటాయని జై షా ప్రకటించారు.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×