EPAPER

Mahesh babu amb mall: మహేష్ బాబు సినిమా మాల్స్ కు జాతీయ స్థాయి గుర్తింపు

Mahesh babu amb mall: మహేష్ బాబు సినిమా మాల్స్ కు జాతీయ స్థాయి గుర్తింపు

Hyderabad Mahesh babu amb mall ranked number one place nationally: మహేష్ బాబు సినిమాలలోనే కాదు బిజినెస్ పరంగానూ మంచి కమర్షియల్ వ్యాపారవేత్తగా రెండు చేతులతోనూ సంపాదిస్తున్నారు. ఒక్కో సినిమాకూ ఇరవై నుంచి ఇరవై ఐదు కోట్లు రెమ్యునరేషన్ తీసుకునే మహేష్ బాబు కు రాజమౌళి సినిమా తర్వాత గ్లోబల్ రేంజ్ పేరుప్రఖ్యాతులు రానున్నాయి. ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత రామ్ చరణ్, ఎన్టీఆర్ రేంజ్  అమాంతం పెరిగిపోయింది. ఇప్పుడిప్పుడే విదేశాలలోనూ మన హీరోలనూ గుర్తిస్తున్నారు. ఆ గుర్తింపు తీసుకొచ్చిన దర్శకుడు మాత్రం రాజమౌళి అని చెప్పక తప్పదు. మహేష్ సినిమాను అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గకుండా మరోసారి ఆస్కార్ రేంజ్ లో ఈ సినిమాకు గుర్తింపు తెచ్చే పనిలో నిమగ్నమయ్యారు. అందుకే కథ, కథనాలే కాదు కాస్ట్యూమ్స్ కూడా దగ్గరుండి మరీ చూసుకుంటారు రాజమౌళి.


ఎఎంబీ మాల్స్

సన్నివేశం ఎంత ఆలస్యం అయినా ఫరవాలేదు..క్వాలిటీ ముఖ్యం అని భావిస్తారు రాజమౌళి. అందుకే ఆయన అంత ఆలస్యంగా పాత్రలను తీర్చిదిద్దుతారు కాబట్టే సినిమా ఇండస్ట్రీలో అందరూ ఆయనను జక్కన్న అని పిలుస్తారు. మహేష్ ఇప్పటికే పలు దేశీయ, అంతర్జాతీయ సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా చేశారు. ఓ పక్క కమర్షియల్ హీరోగా గుర్తింపు తెచ్చుకుంటూనే కమర్షియల్ యాడ్స్ లోనూ దూసుకుపోతున్న మహేష్ బాబు సొంత సినిమా హాల్స్ ప్రాంచైజీని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఏఎంబీ మాల్స్ గా పిలవబడుతున్నాయి అవి. ఏఎంబీ మాల్స్ లో సినిమా చూడాలని ప్రేక్షకులు ఉవ్విళ్లూరుతుంటారు. ఎందుకంటే థియేటర్ ఎక్స్ పీరియన్స్ కావాలని కోరుకునే ప్రేక్షకుడు తప్పనిసరిగా అదే థియేటర్ లో చూసేందుకు ఇష్టపడతాడు. టిక్కెట్ రేటు ఎక్కువే అయినా ఆ అనుభూతినే కోరుకుంటారు ప్రేక్షకులు. హైదరాబాద్ లో ఒకప్పుడు సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఎక్కువగా ఉండేవి. వాటిల్లో సౌకర్యాలు కూడా అంతంత మాత్రమే. మారుతున్న ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్లుగా ప్రస్తుతం సినిమా చూడటానికి వచ్చే ప్రేక్షకులు షాపింగ్ కూడా చేసుకుని వెళ్లేలా మల్టీప్లెక్స్ థియేటర్లు రూపొందాయి.


మల్టీప్లెక్స్ లకే ఆదరణ

మల్టీప్లెక్స్ లలో చూసే ప్రేక్షకులకు కేటాయించిన సీట్ల సంఖ్య కూడా తక్కువే. మొత్తం కలిపి 200 నుండి 250 లోపే ప్రేక్షకులు చూసేందుకు అవకాశం ఉంటుంది.వీటిలో సినిమా చూసే ప్రేక్షకులకు సౌండ్ ఎఫెక్ట్స్ చాలా క్లియర్ గా ఉంటాయి. తెరపైనా విజువల్స్ క్లియర్ గా ఉంటాయి. దీనితో సగటు ప్రేక్షకుడు కూడా టిక్కెట్ రేటు ఎక్కువే అయినా మల్టీప్లెక్స్ థియేటర్ లోనే చూడాలని అనుకుంటున్నారు. కొన్ని ప్రత్యేకమైన సినిమాలు కేవలం విజువల్ ఎఫెక్స్ తో తీసినవి ఉంటాయి. వాటిని మాత్రం తప్పకుండా మల్టీ ప్టెక్స్ లోనే చూసేందుకు ఇష్టపడతారు. ప్రస్తుతం సింగిల్ స్క్రీన్ థియేటర్లు హైదరాబాద్ లో దాదాపు అన్నీ మూలపడే పరిస్థితిలో ఉన్నాయి. ఇప్పటికే వీటిల్లో చాలా మంది యజమానులు పెళ్లిళ్ల ఫంక్షన్లుగా మార్చేశారు.

ఎక్కువ సంఖ్యలో ప్రేక్షకులు

క్రమంగా జనం మల్టీప్లెక్స్ లకు బాగా దగ్గరయ్యారు. అందుకే మహేష్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలు మల్టీప్లెక్స్ థియేటర్లను సొంతంగా నిర్వహించుకుంటన్నారు. అయితే ఇటీవల ఎక్కువ మంది సందర్శించే మాల్స్ నివేదికను జీయో ఐక్యూ సంస్థ ఇచ్చింది. హైదరాబాద్ లో ఉన్న టాప్ మల్టీప్లెక్స్ మాల్స్ లో మహేష్ బాబకు చెందిన ఏఎంబీ సినిమాస్ తొలి స్థానంలో నిలవడం విశేషం. దేశం మొత్తం మీద అత్యధిక సంఖ్యలో పెద్ద సంఖ్యలో ప్రేక్షకుల ఆదరణ దక్కించుకున్న ఏఎంబీ మాల్ నిర్వాహకుడు మహేష్ బాబను సినీ పరిశ్రమకు చెందిన సెలబ్రిటీలు ఆకాశానికి ఎత్తేస్తున్నారు.

Related News

Film Stars: అత్యధికంగా రూ.100 కోట్ల క్లబ్ లో చేరిన సెలబ్రిటీస్ వీళ్లే..!

Jabardast Abhi: బలగం వేణు బాటలో మరో కమెడియన్.. మైథాలజీ సిరీస్ తో ఇండస్ట్రీలోకి అడుగు..!

Nikhil Siddhartha: ప్రమోషన్స్ చేయనప్పుడు.. సినిమాలు ఎందుకు చేస్తున్నావ్.. ?

Sai Pallavi: ఆ సినిమా వదిలేసి మూడు రోజులకే పారిపోవాలనుకున్నా.. షాకింగ్ విషయం బయటపెట్టిన సాయి పల్లవి

Janvi Kapoor : దెయ్యంగా మారబోతున్న జాన్వీ కపూర్..డబ్బుల కోసం ఇంత కక్కుర్తినా..?

Hebah Patel: ప్రేమ పెళ్లి పై అలాంటి కామెంట్స్ చేసిన హెబ్బా పటేల్..!

Sunny Leone: మరోసారి పెళ్లి చేసుకున్న సన్నీ లియోన్.. ముగ్గురు పిల్లలముందే..

Big Stories

×