Hyper Adi : జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. బుల్లి పై పలు షోలల్లో, ఇటు సినిమాల్లో కూడా నటిస్తూ ప్రేక్షకుల మనసును దోచుకున్నాడు. ఆది ఏ షోలో కనిపించిన ఆ షో సూపర్ హిట్ అవ్వాల్సిందే తన కామెడీతో కడుపుబ్బా నవ్విస్తాడు. జబర్దస్త్ షో ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ఆది తన టాలెంట్ తో అతి తక్కువ కాలంలోనే స్టార్ కమెడియన్గా గుర్తింపు తెచ్చుకున్నాడు. బుల్లితెర షోలు సినిమాలు మాత్రమే కాదు బయట కూడా ఆయన వేసే పంచులకు కడుపు చెక్కలవ్వాల్సిందే..తన నోటి ద్వారా వచ్చే పంచులతోనే ఎదుటి వ్యక్తిని చంపేస్తాడు ఆయన. అందుకే ఈమధ్య డైరెక్టర్స్ ఇతన్ని తమ సినిమాలో కమెడియన్ గా తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు.. ఇదంతా పక్కన పెడితే ఈమధ్య రాజకీయాలకు సంబందించిన మీటింగ్ లకు ఎక్కువగా వెళుతున్నాడు.. అక్కడ ఆది మాట్లాడే మాటలు అవతలి వ్యక్తికి నేరుగా తగులుతాయి. ఇక తాజాగా ఐకాన్ అల్లు అర్జున్ పై సెటైర్లు వేసాడు. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..
ఇటీవల సంక్రాంతి సందర్భంగా బుల్లితెర పై జరిగిన ఓ షోలో ఆది పాల్గొన్నాడు. అసలు పుష్ప 2 క్యారెక్టర్ ని ఆది చేశాడు.. గతంలో ఏ సినిమా రిలీజ్ అయిన ఆది అలా క్యారెక్టర్ లోకి ఇన్వాల్వ్ పై నాన్ స్టాప్ పంచులను వేస్తూ అందరిని నవ్విస్తారు అలాగే ఈసారి పుష్ప 2 సినిమాలోని క్యారెక్టర్ ను దించేశాడు. ఈ మూవీలో హీరో స్నేహితులను విడిపించుకోవడానికి పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన శీను ని ఆది చేశారు. దొరబాబు పోలీస్ పాత్రలో కనిపించారు. ఆది దొరబాబు దగ్గరికి వెళ్లి రూల్స్ గురించి నాకే చెప్తున్నావా? అని అడుగుతాడు.. అప్పుడు దొరబాబు దానికి కౌంటర్ ఇస్తూ ‘నువ్వా?’ అని ఆశ్చర్యపోతాడు. అంటే అల్లు అర్జున్ రూల్స్ పాటించకపోవడం వల్లే అరెస్ట్ అయ్యాడు అనే వాదన కూడా ఈ మధ్య సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇక దొరబాబు ఆది ఫన్ జనరేట్ చేశారు. ఒకసారి లోపలికి వేసినోడిని బయటకు తీసుకురావడానికి మా రూల్స్ ఒప్పుకోవు అని దొరబాబు అంటాడు.
ఆది ఏ మాత్రం తగ్గకుండా కౌంటర్ల మీద కౌంటర్లు వేస్తూ అందరిని కడుపుబ్బా నవ్వించాడు. నిన్ను లోపల ఏ లోపలేస్తే తీసుకొచ్చింది గుర్తొచ్చిందా అన్నట్టుగా ఇన్ డైరెక్ట్ గా అల్లు అర్జున్ ని టార్గెట్ చేస్తూ ఆది స్కిట్ చేశాడు . ఈమధ్య ఆది ఏ మీటింగ్ కు వెళ్ళినా ఏ షో కి వెళ్ళినా నేను మాట్లాడి మాటలు చర్చిని అంశంగా మారుతున్నాయి అలాగే ఈ షోలో ఆయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో రచ్చ చేస్తున్నాయి. అల్లు అర్జున్ ఫ్యాన్స్ తీవ్రంగా మండిపడుతున్నారు. కామెడీ పేరుతో మా హీరోని కించపరిస్తే అసలు సహించబోమంటూ హైపర్ ఆది కి సోషల్ మీడియా ద్వారా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. తాను వేసిన స్కిట్స్ లో ఏదైనా తప్పు జరిగితే ఎలాంటి భయం బెరుకు లేకుండా మీడియా ముందుకు వచ్చి క్షమాపణ చెప్తాడు అది కానీ.. అల్లు అర్జున్ విషయంలో అలా జరుగుతుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది.. ఏది ఏమైనా ప్రస్తుతం అది నోట అల్లు అర్జున్ పై సెటైర్లు వేయడం కాస్త హాట్ టాపిక్ అయ్యింది.