Hyper Aadi-Roja : జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. జబర్దస్త్ షో ద్వారా తన టాలెంట్ ను నిరూపించుకున్నాడు. ఇప్పుడు వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఒకవైపు సినిమాలు చేస్తూనే రాజకీయాల్లో కూడా తన పాత్రను పోషిస్తాడు. పవన్ కళ్యాణ్ వీరాభిమానిగా జనసైనికుడుగా ఆ పార్టీ కార్యకాలాపాల్లో చురుగ్గా పాల్గొంటు ఆ పార్టీకి నమ్మిన బంటుగా ఉండేవాడు. అందుకే ఏ కార్యక్రమం జరిగిన ఆది తప్పకుండా ఉండాలని నేతలు భావిస్తున్నారు. మిగిలిన పార్టీలకు చురకలు అంటిస్తూ ఆది మాట్లాడే మాటలు ఎంతగా వైరల్ అవుతున్నాయో చూస్తున్నాం. ముఖ్యంగా వైసీపీ నేతలను పేరు పేరున ప్రస్తావిస్తూ కౌంటర్లు వేస్తాడు. కానీ ఇప్పుడు వైసీపీ కార్యకర్తను పొగుడుతున్నాడు. అందుకు సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
అసలు విషయానికొస్తే.. జబర్దస్త్ టీమ్ లీడర్ రాకింగ్ రాకేష్ ఇప్పుడు ఓ సినిమాలో ప్రధాన పాత్రలో నటించాడు. కేసీఆర్ పేరుతో ఆ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. గరుడవేగ’ ఫేమ్ అంజి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. అనన్య కృష్ణన్ కథానాయిక. ఈ సినిమా ఈనెల 22న గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ఈ చిత్ర ప్రీరిలీజ్ వేడుకని నిర్వహించారు. ఈ ఈవెంట్ కు హరీష్ రావు, హైపర్ ఆది, రోజా ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. మొన్నటివరకు ఉప్పు నిప్పులా ఉన్న ఆది, రోజా ఒకే వేదిక పై కనిపించడం చూసి పలు కార్యకర్తలు ఓర్వలేక పోయారు.. ఆది ఇలా చేస్తాడా అని అందరు చెవులు కొరుక్కుంటున్నారు. అసలు ఆది ఏం మాట్లాడారో అని తెగ టెన్షన్ పడిపోయారు. వారి ఊహే నిజమైంది..
ఇక ఈ ఈవెంట్ లో హైపర్ ఆది మాట్లాడుతూ ‘అందరికి నమస్కారం, ముందుగా ఈ రోజు ఈవెంట్ కు విచ్చేసిన రోజా గారికి ధన్యవాదాలు. చాలా రోజుల తర్వాత మళ్ళి ఇలా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. బేసిక్ గా యూట్యూబ్ లో చాలా మంది హైపర్ ఆది రోజాని ఏమన్నాడో తెలుసా అంటూ రాస్తుంటారు. నేను ఇంతవరకు ఈమెని ఎప్పుడు ఏమి అనలేదు. అసలు అనను కూడా. నిజంగా ఎప్పుడు ఏమి అనలేదు. అయినా సరే ఎదో అన్నట్టు రాస్తారు. సరే రాసుకొండి మీ వ్యూస్ కోసం ఎదో ఒకటి రాయాలి.. ఇక ఒకప్పుడు నేను అ స్టేజ్ నుంచే వచ్చాము అని అంటాడు. ఇక అందరికి షాక్ ఇస్తూ పుష్ప టీమ్ గురించి మాట్లాడాడు. అల్లు అర్జున్ పుష్ప సినిమాతో తెలుగు సినిమా వైభవం పెరుగుతుంది. తెలుగు సినిమాకు ఆస్కార్ అవార్డ్ రావడం, ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ వెయ్యి కోట్లు సినిమాలు, పవన్ కళ్యాణ్ వంద శాతం స్ట్రయిక్ రేట్ తో పొలిటికల్ గా గెలవడం టాలీవుడ్ ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది.. ఆది మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సడెన్ గా ఇంత మార్పేంటి? కొత్తగా భజనేంటి అని వైసీపీ కార్యక కర్తలు కామెంట్స్ చేస్తున్నారు. ఇక సినీ విశ్లేషకులు సైతం ఈ విషయం పై చర్చలు జరుపుతున్నారు. మరి దీని పై ఆది ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి..