Swara Bhaskar:బాలీవుడ్ నటి స్వర భాస్కర్ (Swara Bhaskar) అంటే ప్రత్యేక పరిచయాలు అక్కర్లేని పేరు. ఈమె వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉంటూ బాలీవుడ్ ఇండస్ట్రీలో బ్లాక్ లిస్టులో కూడా చేరిపోయింది. మరి అలాంటి స్వర భాస్కర్ బ్లాక్ లిస్టులోకి వెళ్లడానికి కారణమేంటి..? ఆమె తనకు జరిగిన అనుభవాలను ధైర్యంగా చెప్పడం వల్లే ఇలా బ్లాక్ లిస్ట్ లో పెట్టారా? అనేది ఇప్పుడు చూద్దాం.. బాలీవుడ్ నటి స్వర భాస్కర్ 2009లో విడుదలైన ‘మధోలాల్ కీప్ వాకింగ్’ అనే మూవీ ద్వారా హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది.ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించి, నటిగా బాలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. స్వర భాస్కర్ చివరిగా ‘జహాన్ చార్ యార్’ అనే మూవీలో కనిపించింది. ఆ తర్వాత మళ్లీ ఇప్పటి వరకు సినిమాల్లో కనిపించడం లేదు. అయితే స్వర భాస్కర్ మాట్లాడిన మాటల కారణంగా ఆమెను ఇండస్ట్రీ బ్లాక్ లిస్టులో పెట్టినట్టు తెలుస్తోంది. అందుకే ఆమెకు సినిమాల్లో అవకాశాలు ఎక్కువగా రావడం లేదట. అయితే ఇండస్ట్రీ బ్లాక్ లిస్టులో పెట్టడం గురించి, తాజాగా జాతీయ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన విషయాలు బయటపెట్టింది స్వర భాస్కర్.
నిజం మాట్లాడితే బ్లాక్ లిస్ట్ లో పెట్టారు..
ఆమె మాట్లాడుతూ.. “నేను తీసుకునే రాజకీయ అభిప్రాయాల కారణంగా, నా సినీ జీవితం చాలా వరకు నష్టపోయింది. ధైర్యంగా మాట్లాడితే.. చాలా వరకు ఎన్నో ఇబ్బందులు వస్తాయి. అలాంటి పరిణామాలు ఎదురవుతాయి అని తెలిసినా కూడా నా రాజకీయ వైఖరి కారణంగా ధైర్యంగా మాట్లాడడం వల్ల నాకు ప్రస్తుతం ఈ పరిస్థితి వచ్చింది.ఈ ప్రస్తుత పరిస్థితికి కారణం నా రాజకీయ వైఖరే.అలాగే ఈ బాధాకరమైన సవాళ్లను అంగీకరిస్తున్నాను” అని చెప్పింది.కానీ తనకు జరిగిన చేదు అనుభవాన్ని మాత్రం పంచుకోలేదు.అయితే స్వర భాస్కర్ ఇంకా మాట్లాడుతూ.. “భిన్నమైన అభిప్రాయాలను ఎక్కువగా మాట్లాడడం వల్ల నేరంగా పరిగణించి, దేశ వ్యతిరేఖిగా ముద్ర వేస్తారు. అయితే ఇలా ముద్ర వేయడానికి కారణం ప్రస్తుతం దేశంలోని విసృత రాజకీయ వాతావరణమే అని నేను నమ్ముతాను”.. అంటూ సంచలన కామెంట్లు చేసింది స్వర భాస్కర్.
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన స్వర భాస్కర్..
అలాగే తనకు ఎదురైన ప్రతిఘటనలు అన్నింటికీ బాలీవుడ్ ని నిందించడం నాకు ఇష్టం లేదు అన్నట్లుగా కూడా స్వర భాస్కర్ మాట్లాడింది. అంతేకాకుండా ఈ విషయాలన్నీ తనకు మాత్రమే కాదు జైలు జీవితాన్ని అనుభవించిన కొంతమంది ఫ్రెండ్స్ అలాగే వేధింపులకు గురైన ఇతర నటులను కూడా ఈ పరిస్థితి ప్రభావితం చేస్తుంది అంటూ చెప్పుకొచ్చింది.అలా స్వర భాస్కర్ ఏ విషయమైనా సరే నిర్మొహమాటంగా, ధైర్యంగా మాట్లాడడంతో చాలావరకు నెగిటివిటీని మూటగట్టుకుంది.అందుకే తనను చిత్రపరిశ్రమలో బ్లాక్ లిస్ట్ పెట్టారని కూడా స్వర భాస్కర్ చెప్పుకొచ్చింది. ఇక స్వర భాస్కర్ కేవలం సినిమాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఏదైనా వివాదం జరిగితే అందులో స్పందించడంలో స్వర భాస్కర్ ముందుంటుంది. ఇక గతంలో “హిజాబ్” కు వ్యతిరేకంగా మాట్లాడి, ట్రోలింగ్ కి గురైన సంగతి మనకు తెలిసిందే. ఇక స్వర భాస్కర్ సినిమాల విషయానికి వస్తే..ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ నటించిన “మిసెస్ ఫలాని” షూటింగ్ పూర్తయింది. త్వరలోనే ఈ మూవీ విడుదల కాబోతోంది.