Alakananda Kidney Racket: అలకనంద కిడ్నీ రాకెట్ కేసులో విచారణ వేగవంతం చేస్తున్నారు. ఈ కేసును సీఐడీకి బదిలీ చేసే యోచనలో ఉంది ప్రభుత్వం. వైద్య ఆరోగ్య శాఖ అధికారుల సమావేశంలో మంత్రి దామోదర రాజనర్సింహ చర్చించారు. కిడ్నీ రాకెట్ వెనుక ఉన్న నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నారు. తాజాగా హాస్పిటల్ యజమాని సుమన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా ఉజకిత్సాన్ ఎంబీబీఎస్ సర్టిఫికెట్‌తో క్లీనిక్ అనుమతి పొందినట్లు పోలీసులు గుర్తించారు. అయితే నెఫ్రాలజీ ట్రీట్మెంట్‌కు ఎలాంటి అనుమతులు లేకపోవడం గమనర్హం. MBBS సర్టిఫికెట్‌తో 9బెడ్స్ క్లీనిక్‌కు అధికారులు పర్మిషన్ ఇచ్చారు. కానీ సుమన్ అక్కడ మల్టీ స్పెషాలటీ ఆసుపత్రిని నడిపిస్తున్నాడు. దీంతో DHMO హాస్పిటల్‌ను సీజ్ చేశారు.
ఇదిలా ఉంటే.. ఈ కేసులో 8 మంది బ్రోకర్లను పోలీసులు గుర్తించారు. 6 నెలల నుంచి అలకనంద ఆస్పత్రిలో కిడ్నీ మార్పిడి చేస్తున్నట్టు దర్యాప్తులో తేలింది. ఈ వ్యవహారంలో బెంగళూరుకి చెందిన డాక్టర్‌దే కీలకపాత్రగా గుర్తించారు పోలీసులు. బెంగళూరు, చెన్నైకి చెందిన బ్రోకర్లే కిడ్నీల మార్పిడిలో సూత్రధారులుగా ఉన్నట్టు గుర్తించారు.
ఒక్కో కిడ్నీ మార్పిడికి డాక్టర్‌కు 55 లక్షల రూపాయలు తీసుకున్నట్టు తేలింది. చెన్నై నుంచి ఇద్దరు మహిళలను తీసుకొచ్చి డాక్టర్ ఆపరేషన్ చేశాడని.. బెంగళూరుకు చెందిన లాయర్, నర్స్‌కు కిడ్నీ మార్పిడి చేసినట్టు తేలింది. కిడ్నీ మార్పిడికి డాక్టర్‌కు లాయర్ రూ. 55 లక్షలు ఇవ్వగా.. నర్స్ 45 లక్షలు ఇచ్చినట్టు తేలింది. చెన్నైకి చెందిన భాను, ఫిరోజ్ భానులను కిడ్నీ డోనర్స్‌గా గుర్తించారు పోలీసులు. కిడ్నీ డోనర్లకు ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల చొప్పున నగదు చెల్లింపులు జరిపినట్టు దర్యాప్తులో తేలింది. పరారీలో ఉన్న ప్రధాన సూత్రధారి డాక్టర్ కోసం పోలీసులు ముమ్మర గాలింపులు జరుపుతున్నారు.
ఇటీవల ఉస్మానియా మాజీ సూపరిండెంట్ నాగేందర్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. అలకనంద ఆస్పత్రిని పరిశీలించిన కమిటీ.. గాంధీ ఆస్పత్రిలో బాధితులను విచారించింది. ఎంత డబ్బులు ఆశచూపారో ఆరా తీశారు అధికారులు. కమిటీలో నెఫ్రాలాజిస్ట్ డా.కిరణ్మయి, యూరాలజిస్ట్ డా. మల్లికార్జున్ ఉండగా.. ఉస్మానియా హాస్పిటల్ మాజీ సూపరింటెండెంట్ డా. నాగేందర్ నేతృత్వం వహిస్తున్నారు. కిడ్నీ రాకెట్ వెనక ఉన్నది ఎవరో.. డీటెయిల్స్ తెలుసుకుని ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. మరోవైపు ఇప్పటికే అలకనంద హాస్పిటల్ గుర్తింపును రద్దు చేశామన్నారు DMHO వెంకటేశ్వరరావు.
Also Read: కిడ్నీ దందాలో కీలక మలుపు.. హాస్పిటల్ చైర్మన్ అరెస్ట్
ఈ ఆస్పత్రి ఇటీవలే అనుమతులు తీసుకుందనీ. దీంతో ఇప్పటి వరకూ ఎక్కువ సంఖ్యలో కిడ్నీ రాకెట్ జరగడం లేదనీ అన్నారు డీహెచ్ఎంఓ. ఇలాంటి వ్యవహారాలు ఏమైనా ఉంటే.. తమ దృష్టికి తెచ్చిన వెంటనే కఠిన చర్యలు తీసుకుంటామనీ కిడ్నీ రాకెట్ నిర్వహణ చట్ట ప్రకారం తప్పని అన్నారు డీహెచ్ఎంఓ. గతంలో చనిపోయిన వారిది కిడ్నీ మార్పిడి వ్యవహారం కాదనీ. ఇప్పటికైతే ఇద్దరు దాతలు, ఇద్దరు గ్రహీతలను గాంధీ ఆస్పత్రిలో ఉంచి.. కమిటీ అధ్వర్యంలో వారి ఆరోగ్య పరిరక్షణ చేస్తున్నామనీ అన్నారు DHMO.
అయితే ఆర్ధిక పరమైన సమస్యల కారణంగా తమిళనాడు, కర్నాటకకు చెందిన ఇద్దరు వితంతువులు.. ఈ కిడ్నీ అమ్మినట్టు ఒప్పుకున్నారని చెబుతున్నారు అధికారులు. ఇతర ప్రాంతాల వారినిక్కడకు తీసుకొచ్చి కిడ్నీ రాకెట్ నిర్వహిస్తున్నారని అంటున్నారు. అలకనంద ఆస్పత్రికి సంబంధించి ఒక ప్లాస్టిక్ సర్జన్ కు మాత్రమే గుర్తింపు ఉందని. నిజానికి ఆ ప్లాస్టిక్ సర్జనే ఈ సర్జరీ చేశారా లేదా ఆరా తీస్తున్నామనీ. అనుమతి లేకున్నా ఇలాంటి సర్జరీలు చేసేవారిని కఠినంగా శిక్షిస్తామని అంటున్నారు అధికారులు. ఇదిలా ఉంటే ఈ ఆస్పత్రి యజమాని విషయంలోనూ తాము మరింత లోతైన పరిశోధన చేయనున్నామని అంటున్నారు DHMO.
కిడ్నీ మార్పిడికి అత్యంత కీలకం.. ఆయా ఆస్పత్రుల్లోని అధునాతనమైన థియేటర్లేననీ. వాటిని చూసే తాము అనుమతులు ఇస్తామనీ. ఒకరి నుంచి మరొకరికి అవయవ మార్పిడి చేయడం అదేమంత తేలికైన విషయం కాదనీ. ఇరువురి ఆరోగ్యానికి ఏ మాత్రం చిన్న తేడా వచ్చినా తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని BIGTVతో అన్నారు డీహెచ్ఎంవో వెంకటేశ్వర్లు.