Tollywood Hero : సినీ ఇండస్ట్రీలో ఒక సినిమా భారీ విజయాన్ని అందుకుంటే ఆ మూవీ స్టార్స్ కు క్రేజ్ ఎక్కువగానే ఉంటుంది. స్టార్ స్టేటస్ లో ఉన్న సెలెబ్రేటీలు ఒకవైపు పలు కంపెనిలకు బ్రాండ్ లకు ప్రమోటర్స్ గా బ్రాండ్ ఎంబాసిడర్ స్ గా వ్యవహారిస్తూ కోట్లు సంపాదిస్తున్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో ఉన్న హీరోలు టీవీలలో కనిపిస్తు సందడి చేస్తారు., స్టార్ హీరోలు అందరు కూడా సినిమాలతో పాటుగా పలు కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహారిస్తారు. కానీ నందమూరి హీరో మాత్రం కోట్లు ఇచ్చిన ఆ పని చెయ్యను అంటున్నాడు. అదేంటి సులువుగా కోట్లు వస్తున్నా వద్దని అంటున్నాడు. ఇంతకీ ఆ హీరో ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..
అప్పటిలో హీరోలకు, హీరోయిన్లుకు సినిమాల ద్వారా వచ్చే రెమ్యూనరేషన్ మాత్రమే ఆదాయ వనరుగా ఉండేది. అయితే ఇప్పుడు సెలబ్రెటీలు అనేక మార్గాలుగా ఉన్నాయి. సినిమాల కన్నా ఎక్కువగా డబ్బులను సంపాదిస్తూ బిజీగా ఉన్నారు. తమకు ఉన్న క్రేజ్ ను ఉపయోగించుకుని కోట్ల రూపాయలు సంపాదిస్తున్న వారు చాలామంది ఉన్నారు. కొందరు హీరోలు సినిమాల కంటే ఇతర మార్గాల ద్వారానే ఎక్కువ సంపాదిస్తున్నారు.. ప్రస్తుతం ఉన్న హీరోలలో మహేష్ బాబు, అల్లు అర్జున్ లు యాడ్స్ ఎక్కువగా చేస్తున్నారు. కానీ బాలయ్య మాత్రం ఎక్కువ యాడ్స్ చేయలేదు.. గతంలో ఆయన దగ్గరకు ఒక యాడ్ వచ్చిందట.. భారీ పారితోషికం ఇవ్వడానికి ఓ కంపెనీ ముందుకు వచ్చినా కానీ బాలయ్య మాత్రం కమర్షియల్ యాడ్స్‌ను చేసే ఉద్దేశం లేదని నిర్మోహమాటంగా చెప్పేశారట..
ఆ తర్వాత ఆయనకు తగ్గ యాడ్స్ ఆయన వద్దకు చాలానే వచ్చాయి. కానీ ఆయన దానికి నో చెప్పాడట. బాలయ్యకు జనాలను మోసం చేయడం ఇష్టం లేక ఆ ప్రచార వీడియోల్లో నటించడానికి నో చెప్పారట. ఆయన సన్నిహితులు ఏమంటున్నారంటే.. ఏదైనా ఒక ఉత్పత్తి గురించి మాట్లాడాలంటే అందులో నిజం ఉంటేనే మాట్లాడతాను లేకుంటే లేదని చెప్పేసాడట.. డబ్బు సంపాదించడం ఇష్టం లేదు కాబట్టే బాలయ్య బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించలేదట. ఈ వార్త విన్న ఫ్యాన్స్ బాలయ్య గ్రేట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అది అసలు సీక్రెట్.. అందుకే ఇప్పటివరకు ఎక్కువగా యాడ్స్ లలో కనిపించలేదు. ఒక్క జ్యుయలరీ యాడ్ తప్ప. ప్రస్తుతం ఆయన రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు.