BigTV English
Advertisement

Allu Arjun: నా ఫ్రెండ్స్ కోసం నేను వస్తా.. రాజకీయ పర్యటనపై అల్లు అర్జున్ క్లారిటీ

Allu Arjun: నా ఫ్రెండ్స్ కోసం నేను వస్తా.. రాజకీయ పర్యటనపై అల్లు అర్జున్ క్లారిటీ

Allu Arjun: చాలా గ్యాప్ తరువాత అల్లు అర్జున్ ఫ్యాన్స్ ముందుకు వచ్చాడు. రావు రమేష్ ప్రధాన పాత్రలో నటించిన మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం సినిమా ఆగస్టు 23 న రిలీజ్ అవుతుంది. లక్ష్మణ్ కార్య డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని సుకుమార్ భార్య  తబిత నిర్మిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ వేగాన్ని పెంచిన మేకర్స్.. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా  నిర్వహించారు. ఇక ఈ ఈవెంట్ కు అల్లు అర్జున్, సుకుమార్  ముఖ్య అతిధులు గా విచ్చేశారు.


ఇక ఈ ఈవెంట్ లో అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ”  నా ఫ్యాన్స్.. నా ఆర్మీ.. లవ్ యూ.. నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చి… అందరూ హీరో ను చూసి ఫ్యాన్స్ అవుతే.. నేను ఫ్యాషన్ చూసి హీరో అయ్యా. ఇక ఈ ఈవెంట్ కు రావడానికి కారణం సుకుమార్ వైఫ్ తబిత ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయడమే. నేను షూటింగ్ లో ఉన్న సమయంలో తబిత వచ్చి.. నేను సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నా.. సుకుమార్ ఎలాగో వస్తారు. నేను మిమ్మల్ని కాకుండా ఇంకెవరిని అడుగుతాను అని అన్నారు.

ఇక ఆ మాట తరువాత మాటలు లేవు.. మాట్లాడుకోవడాలు లేవు.  ఆవిడ అలా అన్న వెంటనే.. క్లైమాక్స్ షూట్ చాలా టఫ్. నేనెప్పుడూ ఇలా అనను.. కానీ నిజంగా ఇది చాలా డిఫికల్ట్ క్లైమాక్స్. దాన్ని కూడా వదిలేసి వస్తున్నాను అని చెప్పాను.  ఎందుకంటే ఇష్టమైనవాళ్లకు మనం చూపించాలి. మన ఫ్రెండ్ అనుకో.. మనకు కావాల్సిన వాళ్ళు అనుకో..  నాకు ఇష్టమైతే నేను వస్తా. నా మనసుకు నచ్చితే నేను వస్తా. అది మీ అందరికి  తెల్సిందే. సుకుమార్ గారు పాన్ ఇండియా రేంజ్ లో ఉన్నా కూడా తబిత.. ఇలా ఒక సినిమా చేయడం అనేది చాలా గ్రేట్.


చిత్ర బృందం మొత్తానికి ఆల్ ది బెస్ట్. సినిమాలో ఎంతమంది పని చేసినా.. హిట్ ఇచ్చేది డైరెక్టరే. ఆయనకు ఆల్ ది బెస్ట్.  రావు రమేష్ గారు నాకు ఇష్టమైన నటుడు. వేదంలో ఒక్క చిన్న క్యారెక్టర్ లో చేశారు. ఎవరు ఆయన.. చాలా బాగా చేశారు అని అడిగితే.. రావు గోపాల్ రావు గారి కొడుకు అని చెప్పారు. నేను షాక్ అయ్యాను. మా తాతగారు, రావు గోపాల్ రావు గారు మా ఇంట్లో ఎప్పుడు  కలుస్తూ ఉండేవారు. ఇక అప్పటినుంచి రావు రమేష్ గారి మీద గౌరవం పెరిగింది . అప్పుడే ఆయనతో చెప్పా .. మీరు ఏలుతారు అని.. ఇప్పుడు ఈ స్థాయికి రావడం చాలా ఆనందంగా ఉంది.

థియేటర్స్ ఇప్పుడు చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నాయి. మంచి మంచి సినిమాలు వస్తున్నాయి. అది చాలా సంతోషం. చిన్న సినిమాలు కూడా మంచి హిట్ అవుతున్నాయి.  ఈ సినిమా కూడా విజయం అందుకోవాలని కోరుకుంటున్నాను. నేషనల్ అవార్డ్స్ వచ్చినవారందరికి శుభాకాంక్షలు. నాకు అవార్డు వవచ్చినప్పుడు కాంతారకు వస్తే బావుండు అనుకున్నాను. నిజంగా రిషబ్ శెట్టికి అవార్డు రావడం మంచి విషయం. సభాముఖంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను.

నేను ఏ సినిమా గురించి చెప్పాలన్నా  భయపడతాను. సినిమా ఏంటి.. ? ఎలా ఉంది.. ? అనేది   ప్రేక్షకులు చెప్పాల్సిన విషయం. నేను చెప్తే డబ్బా కొట్టినట్లు  ఉంటుంది. కానీ, పుష్ప 2  సినిమా  వస్తున్న విధానం.. మీ అందరికి నచ్చుతుంది. డిసెంబర్ 6 న అస్సలు తగ్గేదేలే. నా బంగారం.. ఈ సినిమా మాత్రం మీకు అంకితం. ” అని చెప్పుకొచ్చాడు.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×