Kannappa Movie: మంచు విష్ణు(Manchu Vishnu) తన డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప సినిమా (Kannappa Movie)పనులలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఈ సినిమాని జూన్ 27వ తేదీ ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్న నేపథ్యంలో వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ సందడి చేస్తున్నారు. అదేవిధంగా మరోవైపు ఈ సినిమా పలు వివాదాలలో చిక్కుకుంటూ చిత్ర బృందానికి సమస్యగా కూడా మారుతుంది. ఇటీవల హార్డ్ డిస్క్ మిస్ అయిందనే వార్త బయటికి రావడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు. ఇలా హార్డ్ డిస్క్ ఇప్పటికీ దొరకలేదని మంచు విష్ణు తెలియజేశారు. ఇక ఈ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్న నేపథ్యంలో బ్రాహ్మణ సంఘాల నుంచి కూడా వ్యతిరేకత వస్తున్న సంగతి తెలిసిందే.
సినిమాకు పాజిటివ్ బజ్…
ఈ సినిమాలో పిలకలు గిలకలు ఉంటే ప్రీ రిలీజ్ వేడుకలోనే క్లారిటీగా చెప్పాలని, బ్రాహ్మణుల మనోభావాలను దెబ్బతీసేలా ఉంటే కచ్చితంగా ఈ చిత్రాన్ని విడుదల చేయకుండా అడ్డుకుంటాము అంటూ హెచ్చరించారు. ఇలా వరుస వివాదాలు ఈ సినిమాని వెంటాడుతూ ఉన్నప్పటికీ విష్ణు మాత్రం విజయవంతంగా ఈ సినిమాని విడుదల చేయడానికి ముందుకు తీసుకెళుతున్నారు. ఇటీవల వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్న ఈయనకు ఊహించని ప్రశ్న ఎదురైంది. కన్నప్ప సినిమాకు మీరు ఎంచుకున్న కథ, మీతో పని చేస్తున్న టెక్నీషియన్లు అందరూ పని చేస్తూ మీ స్థానంలో వేరే ఎవరైనా చేసి ఉంటే ఈ సినిమాకు మరింత పాజిటివ్ బజ్ వచ్చి ఉండేదా? అనే ప్రశ్న ఎదురయింది.
తెలుగుకు పరిమితం కాదు…
ఈ ప్రశ్నకు మనోజ్ సమాధానం చెబుతూ నేను కాకుండా ఎవరైనా నటించి ఉంటే ఖచ్చితంగా మంచి బజ్ వచ్చి ఉండేదేమో అంటూ కూడా సమాధానం చెప్పారు.. అదేవిధంగా విష్ణు మాట్లాడుతూ… ఏ నటుడికైనా లిమిటెడ్ బజ్ ఉంటుంది. అది కూడా ఇండస్ట్రీలో వారి మార్కెట్ ఆధారంగా ఉంటుందని విష్ణు తెలిపారు. నేనొక్కడినే ఈ సినిమా చేసి ఉంటే కనుక ఈ సినిమా తెలుగులో మాత్రమే మంచి పాజిటివ్ బజ్ క్రియేట్ చేసుకుని ఉండేది. కానీ నేను ఇలాంటి ఒక గొప్ప సినిమాని తెలుగుకు మాత్రమే పరిమితం చేయాలనుకోలేదు ఈ కథ గురించి అందరూ తెలుసుకోవాలన్న ఉద్దేశంతోనే పాన్ ఇండియా స్థాయిలో తీసుకు వస్తున్నానని తెలిపారు.
విష్ణు ఈ విధమైనటువంటి సమాధానం చెప్పడంతో వెంటనే ఆయనకు మరొక ప్రశ్న ఎదురైంది. ఇటీవల మీకు తెలుగు సినీ ప్రేక్షకులలో కాస్త ఆదరణ తగ్గింది.. అందుకే ఈ సినిమాపై కూడా అనుకున్న స్థాయిలో బజ్ రాలేదనే ప్రశ్నకు మీ సమాధానం ఏంటి అంటూ ప్రశ్న వేశారు. ఇక వెంటనే విష్ణు సమాధానం చెబుతూ కచ్చితంగా నెగిటివ్ బజ్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఇటీవల నేను చేసిన చివరి సినిమాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి.. ఇలా నేను ప్రేక్షకుల టార్గెట్ రీచ్ కాకపోవటం వల్ల ఈ సినిమా పై ఎందుకు మంచి అంచనాలు పెట్టుకోవాలనే క్వశ్చన్ ప్రతి ఒక్కరిలోనూ కలుగుతుంది. అయితే ఈ సందేహాలన్ని జూన్ 27వ తేదీ మార్నింగ్ షో వరకు మాత్రమే ఉంటాయని, ఆ తర్వాత అందరికీ క్లారిటీ వస్తుందని విష్ణు తెలిపారు. ఇలా ఈ సినిమా విషయంలో విష్ణు ఎంతో కాన్ఫిడెన్స్ గా ఉన్నారని ఆయన మాటల్లోనే స్పష్టమవుతుంది. మరి కన్నప్పతో విష్ణు పాన్ ఇండియా స్థాయిలో ఎలాంటి సక్సెస్ అందుకుంటారో వేచి చూడాలి.