Sridevi: సినిమా ఇండస్ట్రీలో తెలుగువారు హీరోయిన్లుగా కొనసాగడం చాలా అరుదుగా జరుగుతుంది. చాలామంది తెలుగు అమ్మాయిలు ఎంతో మంచి టాలెంట్ ఉన్నప్పటికీ సినిమాలలో హీరోయిన్లుగా రావడానికి ఇష్టపడరు.. ఇకపోతే కొంతమంది సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి వచ్చిన వారికి మెయిన్ హీరోయిన్ గా కాకుండా సినిమాలో ఏదైనా కీలక పాత్రలలో నటించే అవకాశాలు వస్తుంటాయి. ఇలా మన తెలుగు అమ్మాయిలు ఎంతో మంది ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఇటీవల నాని నిర్మాణంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కోర్టు సినిమా(Court Movie) ద్వారా తెలుగు బ్యూటీ శ్రీదేవి(Sri Devi) వెండి తెరపై సందడి చేసిన సంగతి తెలిసిందే.
డైరెక్టర్లు కలిసారు….
కాకినాడకు చెందిన శ్రీదేవి సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ నిత్యం రీల్స్ చేస్తూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇలా సోషల్ మీడియాలో ఎంతో క్రేజ్ సొంతం చేసుకున్న శ్రీదేవి కోర్టు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి తన నటనతో మరోసారి ప్రేక్షకులను సందడి చేశారు. ఇక ఈమె తదుపరి సినిమాల గురించి ఇప్పటివరకు ఎక్కడ అధికారిక ప్రకటన లేకపోయిన తన ప్రాజెక్టుల గురించి శ్రీదేవి చేసిన కామెంట్స్ మాత్రం భారీ స్థాయిలో విమర్శలకు గురి అవుతున్నాయి.
బాలీవుడ్ అవకాశం…
ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె మాట్లాడుతూ తనకు ఐదో క్లాస్ నుంచి ప్రేమలేఖలు వచ్చాయని చెప్పుకువచ్చారు. అదేవిధంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ట్ డైరెక్టర్లుగా కొనసాగుతున్న గోపీచంద్ మలినేని, హరీష్ శంకర్ వంటి దర్శకులు తనని కలిసారని తన రీల్స్ వారికి బాగా నచ్చాయని చెప్పినట్లు శ్రీదేవి తెలిపారు. ఇకపోతే తాజాగా ఈమె తనకు బాలీవుడ్ అవకాశాలు(Bollywood Offer) కూడా వచ్చాయని చెప్పడంతో పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచారు. బాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన ఒక మ్యూజిక్ డైరెక్టర్ తనని కలిసారని, తనతో ఒక కవర్ సాంగ్ చేయాలని అవకాశం ఇచ్చినట్టు తెలిపారు.
"I was contacted by a Bollywood music director. He asked me to do a cover song with him and said I had to go to Mumbai for the shoot. I got scared and didn’t go."
– #SriDevi | Court Fame ✨ pic.twitter.com/TkKdVHlWHC
— Movies4u Official (@Movies4u_Officl) June 6, 2025
ఇక ఈ సాంగ్ షూటింగ్లో పాల్గొనడం కోసం తనని ముంబైకి రమ్మని చెప్పారు. ఇలా ముంబైకి రమ్మని పిలవడంతో నాకు కాస్త భయం వేసి నేను ఈ అవకాశాన్ని వదులుకున్నాను అంటూ శ్రీదేవి బాలీవుడ్ ఆఫర్ గురించి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక ఈ కామెంట్లపై నెటిజన్స్ విభిన్న రీతిలో స్పందిస్తూ ఈమె పై భారీగా విమర్శలు కురిపిస్తున్నారు. శ్రీదేవి నటించింది ఒక్కటే సినిమా.. ఈ సినిమా వెంటనే బాలీవుడ్ అవకాశాలు వచ్చాయని చెప్పడంతో ఈమెపై భారీగా విమర్శలు వస్తున్నాయి. నీ పేరు మాత్రమే శ్రీదేవి, నువ్వు శ్రీదేవి అని ఫీల్ అయిపోకు అంటూ కొంతమంది కామెంట్ లు చేయగా, మరి కొందరు మాత్రం ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించిన హీరోయిన్లకు కూడా ఇప్పటివరకు బాలీవుడ్ అవకాశాలు రాలేదు.. నీకెలా వచ్చింది అంటూ ఈమెపై విమర్శలు కురిపిస్తున్నారు. అయితే కోర్టు సినిమా తర్వాత ఇప్పటివరకు మరొక తెలుగు సినిమా గురించి ప్రకటించకపోవడం గమనార్హం.