Pushpa 2: దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రం ‘పుష్ప -2’. అల్లు అర్జున్(Allu Arjun)హీరోగా, సుకుమార్(Sukumar ) దర్శకత్వంలో ‘మైత్రి మూవీ మేకర్స్’ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న చిత్రం ఇది. డిసెంబర్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ సినిమాను ప్రజలలోకి తీసుకెళ్లడానికి బన్నీ ప్రమోషన్స్ బాధ్యతను తన భుజాన వేసుకున్నారు. ప్రతి ఈవెంట్ లో కూడా స్పెషల్ గా పాల్గొంటూ.. ప్రేక్షకులలో సరికొత్త హైప్ క్రియేట్ చేస్తున్నారు. ముఖ్యంగా అల్లు అర్జున్ ఎక్కడికి వెళ్ళినా సరే అభిమానులు కూడా ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారు. నార్త్, సౌత్ అని తేడా లేకుండా ఈవెంట్ ఎక్కడ పెట్టినా సరే లెక్కలేనంత మంది జనం వచ్చి ఈవెంట్ ను సక్సెస్ చేస్తున్నారు.
ఇదిలా ఉండగా మరోవైపు పుష్ప టీం రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా భారీ ఈవెంట్ ను ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ని కూడా దాదాపు క్లోజ్ చేశారు. ఇకపోతే ఈ సినిమా భారీ టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలోకి దిగబోతోంది. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఇతర రాష్ట్రాల కంటే తెలుగు రాష్ట్రాలలోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను బ్రేక్ చేయాలి అంటే ప్రభాస్ రికార్డులను బ్రేక్ చేయాల్సి ఉంటుంది. మరి బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ప్రభాస్ టార్గెట్ ను బ్రేక్ చేయాలంటే ఎంత రాబట్టాలి? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.
తెలుగు రాష్ట్రాలలో పుష్ప -2 సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్..
ప్రస్తుతం ఈ సినిమాకి పోటీగా మరో సినిమా లేకపోవడం వల్ల బాగా కలిసి వచ్చింది. అందుకే ఈ సినిమాకి ఎక్కువ స్క్రీన్స్ కేటాయించడం జరిగింది. ఇకపోతే ఈ సినిమాకి ఆంధ్రాలో రూ.90 కోట్లు, సీడెడ్ లో రూ.30 కోట్లు, నైజాంలో రూ.100 కోట్లకు ఈ సినిమా రైట్స్ కి సంబంధించిన డీల్ పూర్తయింది. మొత్తం కలిపి చూసుకుంటే, రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమాకి రూ.220 కోట్ల మేరా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇకపోతే రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమాను విడుదల చేయబోయే డిస్ట్రిబ్యూటర్స్ సేఫ్ జోన్ లో ఉండాలంటే రూ.212 కోట్ల షేర్ రాబట్టాల్సి ఉంటుంది. పైగా 18% జిఎస్టి, 20% కమీషన్ పోగా థియేటర్ రెంట్, ఖర్చులు అదనం. ఈ లెక్కన చూసుకుంటే రూ.450 కోట్ల దాకా తెలుగులో మాత్రమే గ్రాస్ కలెక్షన్ సాధిస్తేనే, ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుంది. ఇక ఈ టార్గెట్ ఏ రేంజ్ లో ఉందో..? దీనికోసం అల్లు అర్జున్ ఎంతలా శ్రమించాలో అర్థమవుతుంది.
ప్రభాస్ రికార్డ్స్ బ్రేక్ చేయాల్సిందే..
ఇకపోతే ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాలలో.. ఆర్ఆర్ఆర్ సినిమా రూ.415 కోట్ల హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్స్ తో నంబర్ వన్ స్థానంలో నిలిచింది. రూ.272.31 కోట్లు షేర్ కూడా రాబట్టింది. ఆ తర్వాత స్థానంలో బాహుబలి 2. ఈ సినిమా ఏకంగా రూ.330 కోట్ల గ్రాస్ కలెక్షన్స్,రూ.204 కోట్ల షేర్ రాబట్టి రెండవ అత్యధిక కలెక్షన్ వసూలు చేసిన చిత్రంగా నిలిచింది. దీన్ని బట్టి చూస్తే పుష్ప సినిమా రికార్డు బ్రేక్ చేయాలి అంటే ఆర్ఆర్ఆర్ లేదా బాహుబలి 2 సినిమాను మించిన కలెక్షన్స్ రాబట్టాలి. వాస్తవానికి సినిమా టికెట్ ధరలు ఇప్పుడు పెంచారు. ధరలు పెంచినా రూ .450 కోట్ల గ్రాస్ , రూ.212 కోట్ల షేర్ అందుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు పుష్ప 2 రూ.212 కోట్ల షేర్ టార్గెట్ తో బరిలోకి దిగబోతోంది. మరి బాహుబలి రికార్డ్స్ ను పుష్ప గాడు ఏ రేంజ్ లో బ్రేక్ చేస్తారో చూడాలి.