BigTV English

Thandel: తండేల్ మూవీలో భారీ సర్ప్రైజ్.. చైతూ కోసం క్యామియో రోల్..!

Thandel: తండేల్ మూవీలో భారీ సర్ప్రైజ్.. చైతూ కోసం క్యామియో రోల్..!

Thandel:ప్రముఖ అక్కినేని హీరో నాగచైతన్య (Naga Chaitanya) తాజాగా నటిస్తున్న చిత్రం తండేల్ (Thandel). ప్రముఖ యంగ్ బ్యూటీ సాయి పల్లవి (Sai Pallavi) ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది.’ కార్తికేయ 2′ సినిమాతో సంచలనం సృష్టించి పాన్ ఇండియా డైరెక్టర్గా గుర్తింపు తెచ్చుకున్న చందు మొండేటి (Chandu Mondeti) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. గీత ఆర్ట్స్ 2 బ్యానర్ పై అల్లు అరవింద్(Allu Aravindh) సమర్పణలో బన్నీ వాసు (Bunny vasu) నిర్మిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. పూర్తిగా మత్స్యకారుల జీవిత కథ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో నాగచైతన్య చాలా కొత్తగా రాజు అనే క్యారెక్టర్ లో కనిపించనున్నాడు. అయితే ఇప్పుడు విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర బృందం సాలిడ్ ప్రమోషన్స్ ను చేపట్టింది. అందులో భాగంగానే లేటెస్ట్ గా నార్త్ లో కూడా ప్రమోషన్స్ వేగవంతం చేసింది చిత్ర బృందం.


తండేల్ మూవీలో భారీ సర్ప్రైజ్..

ఈ క్రమంలోనే ఈ సినిమాలో ఒక సర్ప్రైజ్ ఉంటుందని, అది కూడా కామెడీ పాత్ర అని అటు హిందీ సినీ వర్గాలలో వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి ఆ సర్ప్రైజ్ ఏమిటి? ఆ క్యామియో పాత్ర ఎవరు చేయబోతున్నారు ?అనే విషయం కూడా వైరల్ గా మారుతూ ఉండడం గమనార్హం. ఇక తాజాగా చిత్ర బృందం బాలీవుడ్ లో ప్రమోషన్స్ చేపట్టిన నేపథ్యంలో ఈ వార్త వైరల్ అవుతోంది. ఆ సర్ప్రైజ్ క్యామియో ఎవరో కాదు బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ (Aamir Khan) అన్నట్లు సమాచారం. అయితే ఇందులో ఎలాంటి నిజం లేదనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. వాస్తవానికి గతంలో నాగచైతన్య.. అమీర్ ఖాన్ హీరోగా నటించిన ‘లాల్ సింగ్ చడ్డా’ లో అతిధి పాత్ర పోషించారు. కానీ అమీర్ ఖాన్ మాత్రం ఈ తండేల్ సినిమాలో లేరనే వార్తలు వినిపిస్తున్నాయి .కాబట్టి ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం అవుతుంది. ఏది ఏమైనా బాలీవుడ్ లో వస్తున్న వార్తలు ఒకవేళ నిజమవుతాయా అనే విషయం తెలియదు కానీ ఇప్పుడు మాత్రం అక్కడ జరుగుతున్న ప్రమోషన్స్ తండేల్ మూవీకి కలిసి వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఏది ఏమైనా తండేల్ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు.


సక్సెస్ కోసం భారీ ఎదురుచూపు..

ఇదిలా ఉండగా అక్కినేని హీరోగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన నాగచైతన్య, ఇప్పటివరకు ఒక్క సాలిడ్ హిట్ కూడా ఆయన ఖాతాలో పడలేదని చెప్పాలి. అక్కినేని నాగేశ్వరరావు మినహా అటు నాగార్జున(Nagarjuna) ఇటు నాగచైతన్య, అటు అఖిల్(Akhil) ఇలా ఎవరి ఖాతాలో కూడా రూ.100 కోట్ల సినిమా లేదు. ఈ నేపథ్యంలోనే నాగచైతన్య ఎలాగైనా ఈ తండేల్ సినిమాతో రూ.100 కోట్ల క్లబ్లో చేరిపోయి అక్కినేని ఇంట అరుదైన రికార్డు సృష్టించిన హీరోగా నిలబడాలని నాగచైతన్య ప్రయత్నం చేస్తున్నారు. అక్కినేని అభిమానులు కూడా ఈ సినిమా కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఇక భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా ఖచ్చితంగా ఆ రీచ్ సాధిస్తుందని కూడా కామెంట్లు చేస్తున్నారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×